ఖమ్మం
Monday, August 21, 2017 - 14:35

కరీంనగర్ : సింగరేణిలో ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్‌ 5 నుండి ఎన్నికలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ సింగరేణి భవన్‌ డిప్యూటి లేబర్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌ అధ్యక్షతన సింగరేణి అధికారులు, కార్మిక సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్‌ 14 నుండి నామినేషన్‌లు ఉపసంహరించనున్నారు. 20ను పార్టీలకు గుర్తును కేటాయిస్తున్నట్లు తెలిపారు. అయితే ఏడాది తర్వాత మళ్లీ సింగరేణిలో ఎన్నికలు...

Wednesday, August 16, 2017 - 16:53

ఖమ్మం : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన పచ్చి బూటకమని టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ విమర్శించారు. ఖమ్మంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన నిరుద్యోగ సదస్సులో ఆయన మాట్లాడారు. సింగరేణి కాలరీస్‌, ఆర్టీసీ వంటి ప్రభుత్వరంగ సంస్థల్లోని ఖాళీలను కూడా ప్రభుత్వ శాఖ ఖాతాలో వేశారని మండిపడ్డారు. ఇంతవరకు పాతికవేల ఉద్యోగాలను మాత్రమే...

Thursday, August 10, 2017 - 21:44

ఖమ్మం : సామాజిక తెలంగాణ లక్ష్యంగా టీ మాస్‌ పలు రకాల కార్యక్రమాలు కొనసాగిస్తోంది.. తాజాగా ఖమ్మంలో భారీ ర్యాలీ చేపట్టింది. ర్యాలీ తర్వాత భక్తరామదాసు కళాక్షేత్రంలో టీ-మాస్‌ జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, టఫ్ నాయకురాలు విమలక్క, ప్రజాగాయకుడు గద్దర్‌ హాజరయ్యారు. తెలంగాణలో దొరల పాలన నడుస్తోందని.. బడుగు, బలహీనవర్గాలకు అన్యాయం...

Thursday, August 10, 2017 - 18:20

ఖమ్మం : ఇక్కడ పూజలు చేస్తున్న వారంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని భద్రాచలం డివిజన్‌లోని రైతులు. వానలు వచ్చి.. తమ పంటలు పండాలని వరుణుడికి పూజలు చేస్తున్నారు. ఓవైపు వీరిని ఆదుకోవాలని ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువులు తవ్విస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో వాటి పని తీరు సరిగా లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.నూతనంగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

Wednesday, August 9, 2017 - 17:50

ఖమ్మం : నగరంలో భారీ వర్షపాతం నమోదయ్యింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల డివిజన్లలో మురికి కాలువలు పొంగిపొర్లాయి.. రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే ప్రభుత్వ కార్యాలయంల్లోకి నీరు చేరింది. వాన కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

 

Sunday, August 6, 2017 - 10:48

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల పథకం అబాసుపాలవుతోంది. ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత గ్రామమైన గండగలపాడులో 20 ఇళ్లు మాత్రమే నాణ్యతా ప్రమాణాలతో నిర్మించి.. లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగిలిన 8 నియోజకవర్గాల్లో ఎక్కడా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు పూర్తి కాలేదు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి....

Saturday, August 5, 2017 - 17:23

ఖమ్మం : ఆ రైల్వేస్టేషన్‌ ఒకప్పుడు వందలాది సింగరేణి కార్మికుల కుటుంబాలతో కిటకిటలాడేది. అసలు సింగరేణి అనే పదం పుట్టిందే అక్కడ. ఆ రైలు మార్గం నుంచి వ్యాగన్ల సహాయంతో బొగ్గును ఎగుమతి చేస్తూ.. సింగరేణి, రైల్వే సంస్థలు కోట్లల్లో లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ లాభాలకు ప్రతిఫలంగా ఆ సంస్థలు ఏకంగా రైల్వేస్టేషన్‌నే ఆ ప్రాంతం నుంచి ఎత్తేశాయి. బ్రిటీష్‌వారు సింగరేణి కాలరీస్‌ అని పేరు పెట్టిన...

Sunday, July 30, 2017 - 10:32

ఖమ్మం : రైతురాజ్యంగా చెప్పుకునే మన దేశంలో అన్నదాతలకు అడుగడుగునా భంగపాటు తప్పడం లేదు. విత్తనాల నుంచి  ఎరువులు, క్రిమి సంహారక మందుల వరకు నకిలీలే రాజ్యమేలుతున్నాయి. చివరికి రైతు రుణాలు కూడా నకిలీగా మారిపోయాయి. అదేంటి... రైతు రుణాలు నకిలీ కావడమేంటనే అనుమానం కలుగుతోందా. అవును. లేని రైతులను సృష్టించి వారి పేరుతో వ్యవసాయ రుణాలు కాజేస్తున్నారు కొందరు అక్రమార్కులు. 
...

Pages

Don't Miss