ఖమ్మం
Wednesday, July 18, 2018 - 19:29

ఖమ్మం : పేదలకు డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మం జిల్లా పాల్వంచలో ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించారు సీపీఎం నేతలు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని 4 ఏళ్లు గడిచినా ఇంకా హామీలు నెరవేర్చకపోవడంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసమే వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

Wednesday, July 18, 2018 - 19:23

ఖమ్మం : నిరుద్యోగులకు ఓ సంస్థ టోకరా వేసింది. ఉద్యోగాలిస్తామని నమ్మించి మోసం చేసింది 'ది హ్యాపీ ఫ్యూచర్‌ మల్టీపర్పస్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ'.  ఒక్కో అభ్యర్థి నుండి 80 వేల రూపాయల నుండి లక్ష రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. బ్యాంక్‌ సర్వీస్‌, లోన్లు ఇస్తామని నమ్మించి వ్యాపారులు, సామాన్యులను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు కంపెనీ యాజమాన్యం పరారైంది. దీంతో బాధితులంతా లబోదిబోమంటూ...

Monday, July 16, 2018 - 21:15

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటోంది. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలుప్రాంతాల్లో జనజీవనం స్ధంబించింది. కాగా ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల ఒక...

Sunday, July 15, 2018 - 15:44

విజయవాడ : పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుకునూరు, వేలేరుపాడు వంటి పలు మండలాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీలోని జల్లేరు, కొవ్వాడ, ఎర్రకాల్వ, బైనేరు, అశ్వారావుపేట వంటి తదితర కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కొండ...

Friday, July 13, 2018 - 11:52

ఖమ్మం : గోదారమ్మ జల కళతో కళకళలాడుతోంది. ఎగువ రాష్ట్రమైన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో వరదనీరు భారీగా వచ్చి చేరటంతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గత రాత్రి గోదావరిలో 30.7 అడుగుల నీటి మట్టం నమోదు కాగా ఈరోజు రాత్రికి మరో నాలుగు అడుగుల మేరకు వరద నీరు పెరగనుండటంతో నీటి మట్టం మరింతగా పెరిగే అవకాశముంది. 43 అడుగుల నీటి మట్టం దాటితే మొదటి ప్రమాద హెచ్చరికను...

Thursday, July 12, 2018 - 21:15

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ, ఏపీలో గాలి వానకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నారుమళ్లలో నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. రాత్రి నుంచి ఏకధాటిగా...

Tuesday, July 10, 2018 - 10:14

హైదరాబాద్ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. వరంగల్‌, భద్రాద్రిజిల్లాల్లో వాగులు పొంగుతున్నాయి. చిన్నతరహా జలాశయాల్లో భారీగా వరద చేరుతోంది. గోదావరి ఉపనదులు ప్రాణహిత, కిన్నెరసాని, తాలిపేరుల్లోకి వరద నీరు ఉధృతంగా చేరుతోంది.  తాలిపేరులోకి 7వేల 250 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 73  మీటర్లకు చేరుకోవడంతో...

Wednesday, July 4, 2018 - 18:31

ఖమ్మం : సర్కార్ దావాఖానకు నేను పోను బిడ్డో అన్న రోజులు పోయాయి. కార్పోరేట్ ఆస్పత్రికి దీటుగా ఖమ్మం ప్రభుత్వం ఆస్పత్రిలో వైద్యసేవలు అందిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రికి దీటుగా మాతా శిశు కేంద్రం నిలుస్తోంది. కేసీఆర్ కిట్ ప్రభావం కూడా పని చేస్తోందని వైద్యులు అంటున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

Wednesday, June 27, 2018 - 21:16

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను...

Pages

Don't Miss