ఖమ్మం
Thursday, December 21, 2017 - 15:18

ఖమ్మం : జిల్లాలోని వైరా మండలం పినపాక వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దావీదు అనే వ్యక్తితో పాటు యామిని అనే ఐదేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. హోటల్‌లోకి దూసుకెళ్లిన లారీని క్రేన్‌ సాయంతో బయటకు తీశారు. ఘటనా...

Thursday, December 21, 2017 - 13:28

ఖమ్మం :జిల్లాలోని నేలకొండపల్లి పట్టణంలో డబుల్ బెడ్ రూం లబ్దిదారుల ఎంపికలో గందరగోళం నెలకొంది. లబ్దిదారులను ఎంపిక చేసేందుకు నిర్వహించిన గ్రామసభలో ఎంపిక లిస్టు లోపాయికారీగా జరిగిందంటూ గ్రామస్తులు కన్నెర్ర చేశారు. శుక్రవారం గృహప్రవేశాల కార్యక్రమానికి మంత్రి తుమ్మల హాజరు కానున్నారు. నిరుపేదలను, గతంలో పట్టాలిచ్చిన వారిని విస్మరించారరని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీనితో పోలీసులు...

Thursday, December 21, 2017 - 12:44

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో వాహనాల ప్రమాదాలకు చెక్ పడడం లేదు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం..మద్యం మత్తులో వాహనాలు నడుపుతుండడంతో ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో నిండు జీవితాలు ఆర్పిపోతున్నాయి. హయత్ నగర్ లో ఓ కాలేజీ బస్సు సృష్టించిన బీభత్సంలో బాలిక మృతి చెందిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకంది. తాగిన మత్తులో డ్రైవర్ డీసీఎం వ్యాన్ నడపడంతో చిన్నారి బలైంది. ఈ ఘటన...

Wednesday, December 20, 2017 - 19:19

హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈమేరకు టెన్ టివి ఆయనతో ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. సామాజిక తెలంగాణ వచ్చే వరకు తమ పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మహాసభలకు హాజరైన ఆయన.. 31 పార్టీలు కలిసి బహుజన డెమొక్రటిక్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌గా ఏర్పడుతున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో...

Tuesday, December 19, 2017 - 16:01

ఖమ్మం : దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం సీపీఎం పార్టీయేనని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలో జరుగుతున్న జిల్లా 20వ మహాసభల్లో పాల్గొన్న ఆయన.. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీపీఎం పోరాడుతుందన్నారు. గుజరాత్‌లో బీజేపీ బోటాబోటీ మెజార్టీతో బయటపడిందని.. కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయం చూపించలేకపోయిందన్నారు. దేశంలో ఎర్రజెండా సత్తాచాటే...

Monday, December 18, 2017 - 17:04

ఖమ్మం : హైదరాబాద్ పాటు అన్ని నగరాలకు ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో ఖమ్మంలో ఐటీహబ్‌ నిర్మాణాన్ని చేపట్టామన్నారు ఎంపీ కవిత. ఖమ్మంలో నూతనంగా నిర్మిస్తున్న ఐటీహబ్‌ నిర్మాణాన్ని కవిత, ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఐటీహబ్‌ నిర్మాణంతో ఖమ్మం నగరంలోని యువతకు మంచి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. ఖమ్మం ఐటీహబ్‌ నిర్మాణం ఇన్‌స్పిరేషన్‌తో త్వరలో నిజామాబాద్‌లో కూడా ఐటీహబ్‌...

Thursday, December 14, 2017 - 11:12

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఒక్కసారిగా భద్రాద్రి కొత్తగూడెం ఉలిక్కిపడింది. టేకులపల్లి అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. చండ్రపుల్లారెడ్డి బాట దళానికి చెందిన ఐదుగురు నక్సల్స్ హతమయినట్లు సీఐ సారంగపాణి పేర్కొన్నారు.

చండ్రపుల్లారెడ్డి కొత్త దళాన్ని ఏర్పాటు చేశారు. ఈ అజ్ఞాత దళంపై పలు కేసులు కూడా నమోదైనట్లు...

Thursday, December 14, 2017 - 09:18

ఖమ్మం : రఘునాథపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. వేపకుంట మాజీ సర్పంచ్, రైతు భుక్యా రామ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రామ మూడెకరాలతో పాటు మరో కొన్ని ఎకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. లక్షల రూపాయలు అప్పులు తీసుకొచ్చి మిర్చి..పత్తి పంటలు వేశాడు. కానీ ఆ పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రామా తీవ్రమనస్థాపానికి గురయ్యాడు. మొత్తం రూ. 8 లక్షలు అప్పులు కట్టాల్సి ఉండడంతో...

Thursday, December 14, 2017 - 09:13

భద్రాద్రి కొత్తగూడెం : నీళ్ల మడగు అటవీ ప్రాంత్రంలో చండ్రపుల్లారెడ్డి వర్గీయులు..పోలీసుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో చండ్రపుల్లారెడ్డికి చెందిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. జనశక్తి మావోయిస్టులు..లొంగిపోయిన నక్సలైట్లు చండ్రపుల్లారెడ్డి పేరిట దళాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్ జిల్లాలో చండ్రపుల్లారెడ్డి దళంపై పలు ఆరోపణలు...

Tuesday, December 5, 2017 - 15:57

ఖమ్మం : జిల్లాలో ఆపద్బంధు సేవలు నిలిచిపోయాయి. డీజిల్ లేకపోవడంతో ఎక్కడికక్కడ 108 వాహనాలు ఆగిపోయాయి. జిల్లాలో 3 రోజులుగా 108 వాహన సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. డీజిల్ బకాయిలు భారీగా పెరుకుపోయినా ఉన్నతాధికారులు స్పందించడం లేదు. దీంతో అత్యవసర వైద్య సేవలు పొందాల్సిన రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. 

పేదలపాలిట సంజీవని 108 వాహాన సేవలు ఖమ్మం జిల్లాలో మూడు రోజులుగా...

Pages

Don't Miss