ఖమ్మం
Sunday, February 11, 2018 - 13:58

ఖమ్మం : నగరం పర్యావరణ, పారిశుద్య సమస్యలకు నిలయంగా మారిందని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వర్‌రావు విమర్శించారు. ఖమ్మంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత కనిపిస్తోందన్నారు. దీంతో పర్యావరణం దెబ్బతింటోందన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో పర్యావరణ, పారిశుద్ద్య సమస్యలను పరిష్కరించాలంటూ 2కె రన్‌ నిర్వహించారు. పెవిలియన్‌ గ్రౌండ్‌లో ప్రారంభమైన ఈ రన్‌... అంబేద్కర్‌ విగ్రహం వరకు సాగింది....

Sunday, February 11, 2018 - 07:16

ఖమ్మం: మురికి కూపంగా ఉన్న లకారం చెరువును ఖమ్మం నగరానికి మణిహారంగా తయారు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లకారం ట్యాంక్‌బండ్‌ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.  మంత్రి  ఎలక్ట్రిక్‌ కారులో తిరుగుతూ పార్కును పరిశీలించిన అనంతరం బోట్‌లో షికారు చేశారు. ఈ పార్కుకోసం ఇప్పటికే 24 కోట్ల నిధులు ఇచ్చామని... కావాలంటే మరో రెండు కోట్లు ఇవ్వడానికైనా...

Sunday, February 11, 2018 - 07:14

ఖమ్మం : టౌన్‌లోని.. లకారం చెరువు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పుడీ చెరువుకట్ట.. నగరానికి మణిహారంలా భాసిల్లుతోంది. ఆహ్లాదం పంచుతోన్న పచ్చందనాల లకారం ట్యాంక్‌బండ్‌ను ఆదివారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తోంది.

ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో లకారం చెరువు సుందరీకరణ పనులు పూర్తైయ్యాయి.. ట్యాంక్ బాండ్ పై వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హట్స్... పాదచారుల కోసం పుట్ పాత్...

Wednesday, February 7, 2018 - 13:46

ఖమ్మం : జిల్లాలోని మధిర ప్రభుత్వ అగ్రికల్చర్‌ డిప్లమో కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఫస్టియర్‌ విద్యార్థిని రవళి ఆత్మహత్య  చేసుకుంది.

 

Monday, February 5, 2018 - 13:32

ఖమ్మం : జిల్లా అశ్వారావుపేటలో టెన్ టీవీ క్యాలెండరన్ సీఐ అబ్బయ్య, ఎమ్మార్వో వెంకటేశ్వర్లు అవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెన్ టీవీ ప్రజ సమస్యలకు గొతుకగా ఉందని వారు కొనియాడారు. 

Wednesday, January 31, 2018 - 13:36

ఖమ్మం : మున్సిపల్ సమావేశం రచ్చ రచ్చ అయ్యింది. అధికార..విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం..ఆందోళనతో సమావేశం దద్దరిల్లింది. సుదీర్ఘకాలం అనంతరం బుధవారం సమావేశం ఏర్పాటైంది. సమావేశంలో అధికార...విపక్ష సభ్యులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించడం లేదని కాంగ్రెస్ కార్పోరేటర్ లు లేవనెత్తారు. దీనితో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విమర్శలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే...

Tuesday, January 30, 2018 - 12:57

ఖమ్మం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దత్తత గ్రామంలో మద్యం ప్రవాహం కొనసాగుతుంది. సాక్షాత్ గ్రామ సర్పంచ్ బెల్టుషాపు నిర్వహిస్తుంది. హైవే పై జోరుగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Thursday, January 25, 2018 - 07:21

ఖమ్మం : తెలంగాణలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మూడురోజుల పర్యటన ముగిసింది. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు కొండగట్టు నుంచి ప్రారంభించిన రాజకీయ యాత్ర.. కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కొనసాగింది. ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్‌లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల కార్యకర్తలతో పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మార్పు కోసమే...

Wednesday, January 24, 2018 - 16:55

ఖమ్మం : జనసేన అధినేత పవన్ కాన్వాయ్ పై గుర్తుతెలియని దుండగుడు చెప్పు విసిరాడు. ఖమ్మం పట్టణంలోకి కాన్వాయ్ ప్రవేశిస్తుండగా ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss