ఖమ్మం
Thursday, May 17, 2018 - 14:45

ఖమ్మం : జిల్లా రఘునాథపాలెం మండలం పంగిడిలో చేపట్టిన రైతుబంధు కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాసు బుక్కులు చేసి ఇస్తామని రెవెన్యూ అధికారులు గిరిజన రైతుల నుండి కోటి రూపాయలు వసూలు చేశారు. అయినప్పటికీ పట్టా పాసు పుస్తకాలు ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. వీఆర్‌వో రాములు, ఆర్‌ ఐ నర్సింహారావులను గదిలో బంధించారు. 

Wednesday, May 16, 2018 - 19:23

ఖమ్మం : కొణిజర్ల మండలం పెద్ద మునగాల గ్రామంలో రైతు బందు పథకం చెక్కుల పంపిణీలో గందరగోళం తలెత్తింది. రెండు వర్గాలుగా మారిన టిఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పోంగులేటి శ్రీ నివాస రెడ్డి, వైరా ఎంఎల్ ఏ మదన్ లాల్ వర్గాల గొడవకు దిగాయి. ఫ్లెక్స్ లో ఎంపి ఫోటో లేదని ఎంపీ అనుచరులు తహాశీల్ధారు ను నిలదీశారు. గొడవ జరుగుతున్నా సమయంలోనే ఎమ్మెల్యే అనుచరులు చెక్కులు...

Monday, May 14, 2018 - 06:24

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అన్నదాతలకు చెక్‌లతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగిన రైతుబంధు చెక్కుల...

Monday, May 7, 2018 - 10:14

ఖమ్మం : నగరంలో ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని ఘనంగా జరిగింది. సంకల్ప స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్‌ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంబించారు. తలసేమియా వ్యాధి చికిత్సకోసం సంకల్ప స్వచ్చంద సంస్థ కృషి చేస్తోందన్నారు ఎమ్మెల్యే అజయ్‌కుమార్. మమత ఆసుపత్రిలో  ఇరవై పడకల వార్డును తలసేమియా వ్యాధి గ్రస్తులకు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే...

Monday, May 7, 2018 - 10:12

ఖమ్మం : నగరంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరు అమాయకంగా ఉన్న వ్యక్తులను ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి బంగారం, డబ్బును దోచుకుంటున్నారని  పోలీస్ కమీషనర్ తాప్సిర్ ఇక్బాల్‌ తెలిపారు. ఖమ్మం అర్బన్ మండలం దానవాయిగూడెంకి చెందిన బండి వెంకటేశ్వర్లు, బండి వీరబాబుతో పాటు ఓమైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు...

Sunday, May 6, 2018 - 15:29

ఖమ్మం : పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని పలువురు నిరూపిస్తున్నారు. తాజాగా సివిల్స్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన శ్రీహర్ష తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ ను సాధించాడు. సివిల్స్ లో ఆరో ర్యాంకును సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలియచేస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి శ్రీహర్ష, తల్లిదండ్రులతో ముచ్చటించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే...

Sunday, May 6, 2018 - 13:00

ఖమ్మం : సివిల్స్ 6వ ర్యాంకును శ్రీహర్ష కైవసం చేసుకున్నారు. తొలిప్రయత్నంలోనే శ్రీహర్ష ఐఏఎస్ సాధించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ ఘనత దక్కిందని చెప్పారు. 

Sunday, May 6, 2018 - 11:52

ఖమ్మం : దేశవ్యాప్తంగా జరగుతోన్న నీట్‌ పరీక్షా విధానంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సీబీఎస్సీ విధానంలో పరీక్ష నిర్వహిండంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. స్టేట్ సిలబస్‌తో పరీక్ష రాసే విద్యార్థులకు ఈ పరీక్ష కఠినంగా మారిందంటున్నారు. నీట్‌ పరీక్ష పట్ల తల్లిదండ్రుల ఆందోళనపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

Wednesday, May 2, 2018 - 19:14

ఖమ్మం : ఇచ్చిన హామీలు ఎందుకు పూర్తి చేయలేదంటూ వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ ను గిరిజనులు నిలదీశారు. పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రోడ్డు వేస్తామని ఆయన హామీనిచ్చారు. కానీ నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇచ్చిన హామీ నెరవేర్చలేదని అక్కడి గిరిజనులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం డబుల్ బెడ్ రూం నివాసాలకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే వెళ్లారు. ఈ విషయం...

Pages

Don't Miss