ఖమ్మం
Wednesday, March 2, 2016 - 22:15

ఖమ్మం : నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో సీపీఎం దూసుకుపోతోంది. పోటీలో ఉన్న సీపీఎం అభ్యర్ధులు తరుపున పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రెండో రోజు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. సీపీఎం పాలనలో ఖమ్మంలో ప్రజా సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యాయని ఆయన చెప్పారు. టీడీపీ,  కాంగ్రెస్‌ మున్సిపల్‌ చైర్మన్ల పాలనలో అవినీతి పెరిగిపోయిందని తమ్మినేని ఆరోపించారు. 

 

Wednesday, March 2, 2016 - 15:40

ఖమ్మం : అప్పుల బాధ తాళలేక రైతు తనువు చాలించిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వైరా మండలం దాసాపురం గ్రామానికి చెందిన రైతు వేంరెడ్డి రవీందర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న ఆరెకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్న రవీందర్ పెట్టుబడుల కోసం ఆరు లక్షల రూపాయలకు పైగా అప్పులు చేశాడు. అయితే సరైన దిగుబడులు లేక రవీందర్ అప్పులు తీర్చలేకపోయాడు. మరొకవైపు వ్యాపారుల నుంచి...

Wednesday, March 2, 2016 - 06:28

హైదరాబాద్ : ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియేట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నాం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్ధులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని ఇంటర్‌బోర్డు ఆదేశాలు జారీ చేసింది. 9గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రానికి అనుమతించేది లేదని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 9,93,891 మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారు....

Tuesday, March 1, 2016 - 22:12

ఖమ్మం : నగర పాలక సంస్థ ఎన్నికల్లో సీపీఎం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. పార్టీ నేతలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు కలిసి ర్యాలీలు, రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారు. ఇంటింట ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సీపీఎం గెలిస్తే అవినీతి రహిత పాలన అందిస్తుందని అభ్యర్ధులతోపాటు, నేతలు హామీ ఇస్తున్నారు. 
ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీపీఎం 
...

Tuesday, March 1, 2016 - 21:57

ఖమ్మం : మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దట్టమైన అటవీ ప్రాంతంలో రక్తపుటేరులు పారింది. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు అడవిని జల్లెడపట్టారు. మావోయిస్టులకు... పోలీసులకు మధ్య ఊహించని విధంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.
ఎన్‌కౌంటర్‌ 8 మంది మావోయిస్టులు మృతి 
...

Tuesday, March 1, 2016 - 19:21

ఖమ్మం : 8 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏరియా ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఇంకా ఆరు మృతదేహాలను గుర్తించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. 

 

Tuesday, March 1, 2016 - 15:37

ఖమ్మం : తెలంగాణ-చత్తీస్ ఘడ్ అటవీప్రాంతం చర్ల మండలం సమీపంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను పోలీసులు భద్రాచలం తరలించారు. ఏరియా ఆస్పత్రిలో కాసేపట్లో మృతదేహాలకు పోస్టుమార్టం జరుగనుంది. పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు. మృతుల్లో 5 మంది మహిళలు, ముగ్గురు పురుషలు ఉన్నారు. ఏడుగురు మావోయిస్టులు...

Tuesday, March 1, 2016 - 12:40

ఖమ్మం : ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని ఖమ్మం ప్రచారంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఒక అభ్యర్ధి ఏ పార్టీలో ఎంతసేపు ఉంటాడో.. గెలిచిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్తాడో అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. డబ్బు, పదవుల కోసం పార్టీలు మారడం నిజమైన రాజకీయాలు కావన్నారు. నీతివంతమైన రాజకీయాల కోసం సీపీఎం కృషి చేస్తుందన్నారు. గతంలో ఖమ్మాన్ని అభివృద్ధి ఎంతో చేశాం.. మళ్లీ...

Tuesday, March 1, 2016 - 12:31

ఖమ్మం : ఛత్తీస్ గఢ్ - తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ తో సహా ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. ఘటనా స్థలం నుండి ఏకే 47, మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యాన్ని, సెల్ ఫోన్ లు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం ఉదయం చర్ల సరిహద్దు...

Tuesday, March 1, 2016 - 10:09

ఖమ్మం : తెలంగాణ - ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలున్నారు. మంగళవారం ఉదయం చర్ల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి....

Monday, February 29, 2016 - 17:21

ఖమ్మం : ఖమ్మం మున్సిపాలిటికి దేశవ్యాప్తంగా రికార్డు ఉంది. మున్సిపల్ పాలకవర్గంపై ఎర్రజెండాను ఎగురవేసిన ఏకైక సింహం చిర్రావూరి లక్ష్మీనర్సయ్య. వరుసగా నాలుగు సార్లు చైర్మన్ గా ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అలాంటి పాలనను మరళా తీసుకువస్తానని ఖమ్మం 50వ డివిజన్ నుంచి సీపీఎం తరుపున పోటీ చేస్తున్న మల్లిక స్పష్టం చేశారు. ఈ డివిజన్ ప్రధానంగా ఇళ్ల ప్లాట్లు, రేషన్...

Pages

Don't Miss