ఖమ్మం
Monday, January 15, 2018 - 20:53

హైదరాబాద్ : అందరూ ఊహించిందే జరుగుతోంది. కోస్తాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. భోగిరోజు మొదలైన ఈ పందెం... రెండోరోజూ కొనసాగింది. కత్తులు కట్టి కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హడావుడి చేసిన అధికారులు, పోలీసులు పత్తాలేకుండా పోయారు. ఇదేఅవకాశంగా ఖద్దరు అండతో నిర్వాహకులు కోడిపందేలు యధేచ్చగా నిర్వహిస్తున్నారు. ఏపీలో కోడి పందేలు యధేచ్చగా సాగుతున్నాయి. కోళ్లు కత్తులు...

Monday, January 15, 2018 - 18:13

కొత్తగూడెం : సంక్రాంతి పండుగ సందర్భంగా పందాల జోరు కొనసాగుతోంది. ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్న పందాల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లాలో కలిసిపోయిన తెలంగాణ జిల్లాలోని కొన్ని మండలాల్లో కూడా పందాలు జరిగాయి. భద్రాచలం చుట్టుపక్కల మండలాలకి చెందిన వారు పందాలను వీక్షించడానికి..పాల్గొనడానికి వెళ్లారు. వీఆర్ పురంలోని రేఖపల్లిలో జరిగిన పందాల్లో...

Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Saturday, January 13, 2018 - 16:24

ఖమ్మం : జిల్లాలో ప్రేమ వివాహం చేసుకుని వెళుతున్న వారిని అడ్డుకొనేందుకు వారి కుటుంబసభ్యులు ప్రయత్నించారు. కారును అడ్డుకొనేందుకు ప్రయత్నించగా ప్రేమ వివాహం చేసుకుని వెళుతున్న వారికి ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన భద్రాది జిల్లా కొత్తగూడెం ఇల్లందులో చోటు చేసుకుంది. సుమన్ గౌడ్..సాహెల్ లు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇల్లందు నుండి హైదరాబాద్ కు...

Saturday, January 13, 2018 - 16:06

ఖమ్మం : వెంకటగిరి రైల్వే గేట్‌ వద్ద విషాదం చోటు చేసుకుంది. హోంగార్డు కాశీవిశ్వనాథ్‌ అతని ఇద్దరు కుమారులుగా అనుమానిస్తున్నారు. అయితే... ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Saturday, January 13, 2018 - 13:53

ఖమ్మం : పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. చర్చ్‌కంపౌండ్‌ సమీపంలోని రైలు పట్టాలపై కాశీ విశ్వనాథ్‌ అనే హోంగార్డ్‌తో పాటు మరో  ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని..దర్యాప్తు చేపడుతున్నారు. 

 

Wednesday, January 10, 2018 - 21:23

ఖమ్మం : జిల్లాలోని జక్కేపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి మరీ... మద్యం, డబ్బులు పంచుతున్నారు. మరోవైపు అధికార పార్టీకి అనుకూలంగా ఓటేస్తే పింఛన్లు, రుణాలు ఇస్తామని మంత్రి తుమ్మల పీఏ ధర్మరాజు ఓటర్లను ప్రలోభానికి గురి చేసేందుకు యత్నిస్తున్నారు. ఇక కూసుమంచి ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి తన వాహనంలో.. డబ్బులు, మద్యం...

Wednesday, January 10, 2018 - 17:50

ఖమ్మం : అధికారం చేతిలో ఉండడంతో నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లిలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా యదేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో అనేక ప్రలోభాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు మంత్రి తుమ్మల పీఏ ధర్మరాజును అడ్డుకున్నారు. ఇప్పటికే అధికార పార్టీ నేతలు ఎన్నికల బరి నుంచి టీడీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులను...

Monday, January 8, 2018 - 06:37

ఖమ్మం : వాయు కాలుష్యంలో ఖమ్మం నగరం మహానగరాలతో పోటీ పడుతోంది. నగరంలోని దానవాయిపేట డపింగ్‌ యార్డు కాలుష్యం ప్రాణాలను కబళించివేస్తోంది. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా కాల్చివేస్తున్న వ్యర్థాలతో ఎన్నో అనర్థాలు తలెత్తున్నాయి. సమీప కాలనీల్లోని ప్రజలు ఆరోగ్య సమ్యలతో అల్లాడుతున్నారు. దానవాయిపేట డంపింగ్‌ యార్డుపై 10 టీవీ ప్రత్యేక కథనం. నగరంలో సేకరించే చెత్త, ఇతర వ్యర్థాలకు ఇక్కడకు...

Friday, January 5, 2018 - 09:15

భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణలో వరుసగా దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కుటుంబ కలహాలు..అక్రమ సంబంధాలు...ఇతరత్రా కారణాలతో చంపేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందులో భార్యను ఓ భర్త చంపేసి పరారయ్యాడు. కొత్తగూడెంకు చెందిన ప్రభాకర్ కు ఇల్లందు పట్టణానికి చెందిన పద్మకు వివాహం జరిగింది. కానీ మూడు నెలల క్రితం విబేధాలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. పద్మ ఖమ్మం పరిషత్ కార్యాలయంలో...

Pages

Don't Miss