ఖమ్మం
Thursday, October 8, 2015 - 06:32

విశాఖపట్టణం : ఓ పక్క విశాఖ ఏజెన్సీలో కిడ్నాప్‌నకు గురైన ప్రజాప్రతినిధులు ఇంకా మావోయిస్టుల చెరలోనే ఉన్నారు. మరోపక్క ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఇక ఖమ్మం జిల్లాలో అపహరణకు గురైన ముగ్గురు రైతులు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. మూడు ప్రాంతాల్లో మూడు విభిన్న ఘటనల నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన అందరినీ వెంటాడుతోంది.

...

Wednesday, October 7, 2015 - 11:46

ఛత్తీస్ గఢ్ : తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఛత్తీస్ గఢ్ లోని దర్భా ఘాట్ వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇందులో మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా మావోయిస్టులు కదలికలు ఉంటుండడం..వరంగల్ ఎన్ కౌంటర్..టిడిపి నేతల కిడ్నాప్...

Wednesday, October 7, 2015 - 07:13

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు యాక్టివ్‌ అవుతున్నారు. బాక్సైట్‌ తవ్వకాలను నిలిపివేయాలంటూ విశాఖలో ముగ్గురు టీడీపీ నేతలను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోనూ ముగ్గురు రైతులను అపహరించి ప్రభుత్వాలకు సవాల్ విసురుతున్నారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మౌనంగా ఉన్న మావోయిస్టులు ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ...

Tuesday, October 6, 2015 - 11:22

ఖమ్మం : భద్రాచలం కేంద్రంగా ప్రత్యేకంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ గిరిజన సంక్షేమ పరిషత్, సేవ్ భద్రాద్రి కమిటీలు బంద్ కు పిలుపునిచ్చాయి. దీనితో భద్రాచలం డిపో పరిధిలోని బస్సులు నిలిచిపోయాయి. దుకాణాలు, కార్యాలయాలు, పాఠశాలలు మూతబడ్డాయి. భద్రాచలాన్ని జిల్లాగా ప్రకటించాలని గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేయడం జరిగిందని నేతలు తెలిపారు. భద్రాచలాన్ని ముక్కలు ముక్కలు...

Monday, October 5, 2015 - 17:58

ఖమ్మం : జిల్లా మణుగూరులో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. విజయనగరం గ్రామానికి చెందిన విద్యార్థులు రామానుజవరంలోని ప్రభుత్వ పాఠశాలకు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని తప్పించుకునే క్రమంలో ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 11 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో...

Friday, October 2, 2015 - 17:39

ఖమ్మం : తెలుగురాష్ట్రాల్లో సరిహద్దు సమరం ముదురుతోంది. భద్రాచలం బోర్డర్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఇరురాష్ట్రాల అధికారులు సై అంటే సై అంటున్నారు. హద్దుల పంచాయితీతో వేడిపుట్టిస్తున్నారు.

ఇసుకను తరలిస్తున్న తెలంగాణ ట్రాక్టర్లకు ఏపీ అధికారులు బ్రేకులు....

ఇరురాష్ట్రాల రెవెన్యూ అధికారులు ఢీ అంటే ఢీ అన్నారు. మాటల తూటాలు పేల్చుకున్నారు....

Friday, October 2, 2015 - 10:59

ఖమ్మం : పట్టణంలోని వికలాంగుల కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో.. ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లపై కిరోసిన్ పోసి... నిప్పంటించి... తాను నిప్పంటిచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్వర్ పాషా, పర్వీన్ లు దంపతులు. ఖమ్మం పట్టణంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు.. రహీమా, రేష్మలు ఉన్నారు. అయితే దంపతుల మధ్య గత కొంతకాలంగా విభేదాలున్నాయి. పర్వీన్ బక్రీద్ కు...

Wednesday, September 30, 2015 - 19:46

ఖమ్మం : సత్తుపల్లిలో కొండచిలువ కలకలం రేపింది. సమీప అటవీ ప్రాంతం నుంచి 10 అడుగుల కొండచిలువ వెంగళరావు నగర్‌ నివాస ప్రాంతాల్లోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాలనీ వాసుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫారెస్టు అధికారులు.. గంట సేపు కుస్తీ పట్టి కొండచిలువను పట్టుకున్నారు.

Friday, September 25, 2015 - 18:20

ఖమ్మం : ముఖ్యమంత్రి నుంచి మంత్రి మండలి సభ్యులంతా.. తమ వృథా ఖర్చులను వదులుకోవాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య సూచించారు. ఖమ్మంలో టిపిఈఆర్ ఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా సదస్సులో ఆయన పాల్గొని, ప్రసంగించారు. ఇతర పథకాలకు వెచ్చించే నిధులను తగ్గించి, విద్యా రంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యా హామీని ప్రభుత్వం అమలు చేయాలన్నారు. వచ్చే విద్యా...

Friday, September 25, 2015 - 11:58

ఖమ్మం : ఫేస్‌బుక్‌ను ఎకౌంట్ ద్వారా యువతులకు అశ్లీల చిత్రాలు పంపిస్తున్న ఓ ప్రబుద్ధుడి భరతం పట్టారు ఖమ్మం జిల్లా భద్రాచలం వాసులు. భద్రాచలంలోని సీతారామనగర్‌కు చెందిన బాలరాజు ఫేస్‌బుక్‌లో ఓ ఫేక్‌ అకౌంట్ క్రియేట్‌ చేసాడు. ఈ ఎకౌంట్‌తో పలువురు యువతులకు నగ్న చిత్రాలు పంపిస్తున్నాడు. బాధితులు ఇద్దరూ తల్లితండ్రులకు చెప్పటంతో బాలరాజు అకౌంట్‌ను హ్యాక్‌ చేసి అసలు అడ్రస్‌...

Thursday, September 24, 2015 - 17:21

ఖమ్మం : జిల్లాలో ఓ కీచక ఉపాధ్యాయుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఖమ్మం జిల్లా రూరల్‌ మండలం తెల్దారుపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న వీరయ్య అనే ఉపాధ్యాయుడు విద్యార్ధులను వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం అందింది. దీనిపై ఆరా తీసిన విద్యార్ధుల తల్లిదండ్రులకు అసలు విషయం బయటపడింది. దీంతో ఆగ్రహోద్రిక్తులైన విద్యార్ధుల తల్లి దండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి ఎంఈవోకు...

Pages

Don't Miss