ఖమ్మం
Tuesday, August 25, 2015 - 20:27

ఖమ్మం: పెండింగ్ స్కాలర్‌ షిప్‌లను విడుదల చేయాలని కోరుతూ ఖమ్మంలో ఎప్ ఎఫ్ ఐ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శిస్తున్న విద్యార్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అరెస్ట్ చేసే సమయంలో మహిళా పోలీసులను నియమించకుండా నిబంధనలను తుంగలో తొక్కారు.

 

Monday, August 24, 2015 - 18:11

ఖమ్మం: భద్రాచలంలో విద్యార్థి లోకం కదం తొక్కింది. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్న డిమాండ్‌తో... ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. స్కాలర్‌షిప్‌, ఫీజ్‌ రియింబర్స్ మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు రెగ్యులర్‌ మెడికల్‌ చెకప్‌తో పాటు మెస్‌ఛార్జీలు...

Thursday, August 20, 2015 - 14:39

హైదరాబాద్: తనను ఏపీ అసెంబ్లీకి రానివ్వడం లేదని.. తన నియోజకవర్గంలోని మండలాలను ఏపీలో కలిపారంటూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ఎమ్మెల్యే తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు 4 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఎలక్షన్‌ కమిషన్‌కు ఆదేశాలను జారీ చేసింది.

ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న బంద్...

పోలవరం ముంపు...

Wednesday, August 19, 2015 - 16:40

ఖమ్మం: జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నిరంతరం సాగునీరు అందేలా ప్రణాళికలు రూపొందించుతున్నట్లు మంత్రి హరీష్‌రావు ఖమ్మంలో తెలిపారు. ఎన్ ఎస్ పీ కాలువను ఆధునీకరించడమే కాకుండా... కాలువ పరిధిలోని ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు, కొత్త లిప్టులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గత పాలకులు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారని హరీష్‌రావు అన్నారు....

Wednesday, August 19, 2015 - 06:32

ఖమ్మం : ఒక్క ఆర్డినెన్సుతో తెలంగాణలోని ఆరు మండలాల ప్రజలను.. ఏపీ పౌరులుగా మార్చేశారు. ఆ తర్వాత వారెలా ఉన్నారో వారి వెతలేంటో తెలుసుకోవడాన్ని విస్మరించారు. పాత రాష్ట్రం పట్టించుకోక.. కొత్త రాష్ట్రం కష్టాలు తీర్చక అక్కడివారు నానా అగచాట్లూ పడుతున్నారు. ఇది.. తెలంగాణ నుంచి ఏపీలోకి కలిసిన పోలవరం ముంపు మండలాల ప్రజల వేదన. ఎన్నిసార్లు విన్నవించినా స్పందన రాకపోవడంతో.. ప్రభుత్వాన్ని...

Tuesday, August 18, 2015 - 19:48

ఖమ్మం : పోడు భూముల రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేఖ వైఖరిపై భద్రాచలంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు, పోడు భూముల రైతుల సమితి నాయకులు పాల్గొన్నారు. హరితహారం పేరుతో ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం దారుణమని పలువురు ఆరోపించారు. గిరిజనుల పొట్టకూటి కార్పొరేట్‌ సంస్థలకు భూములు...

Sunday, August 16, 2015 - 13:39

ఖమ్మం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తుమ్మల అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. బాధ్యతయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి... రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పోతినేని అన్నారు. ఇతర పార్టీలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేయడమేంటని ప్రశ్నించారు. పార్టీ...

Sunday, August 16, 2015 - 10:38

ఖమ్మం : జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. గోదావరి నది ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం వరకు 23 అడుగులు మేర ఉన్న నీటి ప్రవాహం 35 అడుగులకు చేరుకుంది. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ఈ నీరు కూడా గోదావరిలోకి చేరుతోంది....

Sunday, August 16, 2015 - 09:15

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. సర్కారీ దవాఖానాల్లో సౌకర్యాలు లేకపోవడంతో..ప్రైవేట్‌ వైద్యం చేయించుకునే స్థోమత లేక గిరిజనులు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో మృత్యు ఘంటికలు మ్రోగుతున్నా అధికారులు పట్టించుకోకపోవంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకోని...

Friday, August 14, 2015 - 21:25

ఖమ్మం: బిడ్డలకు కన్నవాళ్లే భారమైపోతున్నారు. రోడ్డున పడేసి, చేతులు దులిపేసుకుంటున్నారు. వేలు పట్టి నడిపించిన వారి గుండెల మీద తన్ని వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. బతకడమెలాగో నేర్పిన తాము .. బతకగలమంటూ ధీమాగా చెబుతున్నారు కొందరు తండ్రులు. ముదిమి వయసులోనూ కష్టాలకు నెరవకుండా ముందుకుపోతున్నారు.
పలువురికి ఆదర్శంగా
కంటికి రెప్పలా సాకిన కన్నవారిని అవసాన...

Monday, August 10, 2015 - 19:02

ఖమ్మం: సల్మాన్‌ఖాన్‌ సినిమా భజరంగీ భాయిజాన్‌ తరహాలో.. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమై అలమటిస్తోన్న యువతి గీత గుర్తుందిగా..! భారత్‌కు చెందిన ఈ అమ్మాయి తప్పిపోయి.. పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉంటే.. భద్రతాదళాలు కరాచీలోని ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. గీత గురించి మీడియాలో ప్రచారం జరగ్గానే.. అమ్మాయి తమ బిడ్డ అంటే.. తమ బిడ్డ అంటూ.. పోటీ పెరిగిపోయింది. ఈ జాబితాలోకి ఇప్పుడు ఖమ్మం...

Pages

Don't Miss