కృష్ణ
Wednesday, March 29, 2017 - 18:36

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో హేవళంబి నామ సంవత్సర ఉగాది పర్యదిన వేడుకలు ఘనంగా జరిగాయి. షడ్రుచుల ఉగాది పచ్చడి పంపిణీ, పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఉగాది వేడుకను ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరంగా విజయవాడలో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. కొత్త సంవత్సరంలో నదుల అనుసంధానం,...

Wednesday, March 29, 2017 - 18:31

విజయవాడ : కుర్చీ ఎక్కేదాకా ఒక మాట.. ఆ తర్వాత మరోమాట.. ఏపీ సీఎం చంద్రబాబుపై మహిళలు మండిపడుతున్నారు. సీఎంగా చేసిన తొలి ఐదు సంతకాల్లో భాగంగా బెల్ట్ షాపులు తొలగించేందుకు కూడా ఆదేశాలిచ్చారు. కాని ఇచ్చిన మాటను గట్టుమీద పెట్టినట్టు.. రాష్ట్రవ్యాప్తంగా మద్యంషాపులు సంఖ్యను పెంచడానికి సీఎం మరోసారి సిద్దమవతున్నారు. రహదారులకు 500 మీటర్ల దూరంగా మద్యంషాపులను నెట్టేయాలని సుప్రీంకోర్టు...

Wednesday, March 29, 2017 - 15:41

విజయవాడ : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పండితులు అందించిన ఉగాది పచ్చడిని చంద్రబాబు తీసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సీఎం ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వివిధ రంగాల్లోని 86 మందికి, కళా...

Wednesday, March 29, 2017 - 15:39

విజయవాడ : అమరావతి చుట్టూ 186 కి.మీ. పొడవున రింగు రోడ్డు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు, కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి దారితీసే ఏడు రోడ్ల నిర్మానానికి గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎర్రబాలెంలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. తొమ్మిది నగరాలు, 27 టౌన్‌షిప్‌లను కలుపుతూ ఈ రింగు రోడ్డు ఉంటుందని ఉంటుందని చెప్పారు. వచ్చే ఉగాది...

Wednesday, March 29, 2017 - 11:45

విజయవాడ: అ అంటే అమ్మ, అమరావతి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని చదువుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్, ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..మనిషిలో...

Wednesday, March 29, 2017 - 11:10

విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి కోరుకున్నారు. అనంతరం మండలి బుద్ధ ప్రసాద్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి, డిప్యూటీ సీఎం కే.ఈ కృష్ణమూర్తి తమ శుభాకాంక్షలు...

Tuesday, March 28, 2017 - 20:26

విజయవాడ : పట్టిసీమ తమ పాలిట దివ్యవరమైందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పట్టిసీమ వల్లే పెద్దమొత్తంలో పంటలు పండాయని సంబరపడ్డారు. అసెంబ్లీకి తరలివచ్చి..సీఎం చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా పెద్దమొత్తంలో పంటలు పండాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు పట్టిసీమ ప్రాంత రైతులు. ప్రాజెక్టు వల్లే తమ జీవితాల్లో వెలుగు వచ్చిందని.. పట్టిసీమను పూర్తి చేసిన సీఎం...

Tuesday, March 28, 2017 - 20:22

విజయవాడ : ఏపీ శాసనమండలిలో ప్రతిపక్షనేతగా పనిచేసిన సి. రామచంద్రయ్యకు నేటితో పదవీకాలం ముగిసింది. ఈ సందర్భంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. కాంగ్రెస్‌ పార్టీ వాణిని రామచంద్రయ్య మండలిలో గట్టిగా వినిపించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఆరు సంవత్సరాల పదవీకాలం సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

Pages

Don't Miss