కృష్ణ
Tuesday, October 17, 2017 - 12:25

కృష్ణా : కర్నూలు ఎంపీ బుట్టా రేణుక... విజయవాడలో చంద్రబాబును కలిశారు. టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. త్వరలోనే కర్నూలు భారీ బహిరంగ ఏర్పాటు చేసి.. టీడీపీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. ఇవాళ ఆమె అనుచరులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Tuesday, October 17, 2017 - 07:55

విజయవాడ : రోడ్డు ప్రమాదాల్లో వాహనదారులు మృత్యవాత పడకుండా విజయవాడ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టడానికి కృషిచేస్తున్నారు. దీనికోసం నెలన్నర క్రితం హెల్మెట్‌ నిబంధన అమలులోకి తెచ్చారు. విజయవాడలో హెల్మెట్‌ నిబంధన అమలులోకి వచ్చి 45రోజులు దాటింది. ఈ సందర్భంగా నిబంధనల అమలులోకి వచ్చిన తరువాత వాహనాదారుల్లో మార్పేంటో ఓసారి చూద్దాం.. 
నిబంధనలను ఉల్లంగించిన వాహనదారులపై చలాన్లు...

Tuesday, October 17, 2017 - 07:31

కృష్ణా : ఏపీలోని ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలపై వామపక్షాలు సమరశంఖం పూరించాయి. నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ ఉద్యమబాట పట్టాయి. 10 వామపక్ష పార్టీలు విజయవాడలో మహాధర్నాకు దిగాయి. 30 గంటలపాటు ఈ ధర్నా కొనసాగనుంది. ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని లెఫ్ట్‌ నేతలు తేల్చి చెప్పారు.
ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై ఉద్యమం 
...

Monday, October 16, 2017 - 19:11

కృష్ణా : జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించింది. ఉయ్యూరులో వెలుగు చూసిన నకిలీ పెన్షన్ల అంశంపై విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీలకు వచ్చింది. అయితే విచారణకు సహకరించని ఏ.డి.రత్నకుమారిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Monday, October 16, 2017 - 16:22

కృష్ణా : విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ విద్యార్థి సంఘాల నేతలు తలపెట్టిన విద్యాసంస్థల బంద్ విజయవాడలో ప్రశాంతంగా కొనసాగుతోంది. కృష్ణాజిల్లాలో 10 రోజుల్లో 7 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రులు  నారాయణ, గంటాను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని, ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం...

Monday, October 16, 2017 - 16:20

కృష్ణా : జిల్లాలోని కోడూరులో విషాదం చోటు చేసుకుంది. లెక్కలు రావడం లేదని మనస్థానంతో విద్యార్థిని గుళికలు తిని ఆత్మహత్య చేసుకుంది. సరితను అవనిగడ్డ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. కోడూరులోని స్వతంత్ర్యపురం హైస్కూల్‌లో పాలంకి సరిత తొమ్మిదో తరగతి చదువుతోంది. 
 

 

Monday, October 16, 2017 - 13:53

కృష్ణా : బీసీ నేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. బీసీల కోసం జగన్‌ ఆరు నెలల కార్యాచరణ ప్రకటించారు. బీసీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని.. నిధులు కూడా అరకొరగానే విడుదల చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. బీసీలకు ఏం చేస్తే బాగుంటుందో సలహాలు స్వీకరించాలన్నారు. పాదయాత్ర అనంతరం ఏర్పాటు చేయనున్న బీసీ గర్జనలో... బీసీ...

Monday, October 16, 2017 - 13:50

కృష్ణా : కార్పోరేట్‌ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్మలను నివారించాలని కోరుతూ విద్యార్థి సంఘాలు విజయవాడలో కాలేజీలు బంద్‌ చేయించాయి. విద్యార్థులను యాజమాన్యాలు ర్యాంకుల కోసం మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు. వరుసగా విద్యార్థుల బలవన్మరణాలు పునరావృతమవుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదన్నారు. నారాయణ విద్యాసంస్థల అధినేత నారయణను మంత్రి పదవి నుంచి...

Monday, October 16, 2017 - 11:39

కృష్ణా : నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ విజయవాడలో వామపక్షాలు 30 గంటల మహాధర్నా చేపట్టాయి. ఈ కార్యక్రమానికి సీపీఎం, సీపీఐతో పాటు పలు వామపక్ష పార్టీల నుంచి నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి నిర్వాసితులు హాజరయ్యారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Monday, October 16, 2017 - 09:28

కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌లో బీసీల సంక్షేమం, వారి అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై వైసీపీ బీసీ డిక్లరేషన్‌ను రూపొందించబోతున్నది. రాష్ట్రంలో బీసీల స్థితిగతులు, వారి సమస్యలను గుర్తించి... పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో తెలుసుకోబోతున్నారు. ఇందుకోసం ఈరోజు వైఎస్‌ జగన్‌.. విజయవాడలో బీసీ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి పార్టీకి చెందిన...

Sunday, October 15, 2017 - 21:27

కృష్ణా : విజయవాడలోని కాపు కార్పొరేషన్‌ ఆఫీస్‌లో హైడ్రామా నడిచింది. ఎండీ అమరేందర్‌ను ప్రభుత్వం  ఇవాళ బాధ్యతల నుంచి  తప్పించింది. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు  అమరేందర్‌ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. అయితే  తన  అనుమతి లేకుండా ప్రెస్‌మీట్‌ ఎలాపెడతారంటూ చైర్మన్‌ రామానుజయ అమరేందర్‌ను నిలదీశారు. దీనిపై ఎండీ అమరేందర్‌ సీరియస్‌ అయ్యారు. తనకు సీఎం ఆఫీసు నుంచి అనుమతి ఉందని అడ్టుకోవద్దని...

Pages

Don't Miss