కృష్ణ
Tuesday, January 17, 2017 - 14:36

విజయవాడ : మంత్రి దేనివేని ఉమమహేశ్వరావు ఉత్తరాంధ్ర ఇరిగేషన్‌ ప్రాజెక్టులు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ పనులపై విశాఖ నగరంలో సమీక్షను నిర్వహించారు. పనులు తీసుకుని చాలాకాలం అవుతున్నా ఇంత వరకూ పనులు పర్తి చేయకపోవడంపై మంత్రి మండిపడ్డారు. పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్టులు రద్దు చేసి.. వారిని బ్లాక్ లిస్ట్‌లలో పెడతామని హెచ్చరించారు...

Tuesday, January 17, 2017 - 14:34

విజయవాడ : సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుని నేటికి ఏడాది పూర్తైంది. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ విజయవాడలో దళిత, ప్రజా సంఘాలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Tuesday, January 17, 2017 - 06:51

కృష్ణా : విగ్రాహాల ధ్వంసం, ఫ్లెక్సీల చించివేత ఘటనలు కృష్ణా జిల్లాలో సామాజిక ఉద్రిక్తతలు, ఘర్షణలకు దారితీస్తున్నాయి. విజయవాడ సింగ్‌నగర్‌లో రంగా విగ్రహం ధ్వంసం, జిల్లాలోని కైకలూరులో చిరంజీవి నటించిన ఖైదీ నంబర్‌ 150 ఫ్లెక్సీల చించివేత ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

వంగవీట సినిమా తర్వాత కృష్ణా జిల్లాలో...

...

Monday, January 16, 2017 - 21:22

హైదరాబాద్ : సంక్రాంతి సెలవులు ముగియడంతో .. జనం మళ్లీ నగరబాట పట్టారు. మూడురోజుల పాటు సంక్రాంతి పండగను సొంతూళ్లలో ఆనందోత్సహాలతో జరురపుకుని తిరుగుప్రయాణం కావడంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నారు. మరోవైపు సందంట్లో సడేమియాగా ఆర్టీసీ సహా ప్రైవేటు బస్సుల నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు తరలివెళ్లిన జనం... తిరుగు ప్రయాణమవుతున్నారు....

Monday, January 16, 2017 - 21:21

ఢిల్లీ : రాష్ట్ర విభజన అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి తోపాటు మరో 24 మంది వేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం ..కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రం విడిపోయి రెండున్నర ఏళ్లు గడిచినా ..విభజన వివాదాలు ఇంకా...

Monday, January 16, 2017 - 21:19

విజయవాడ : పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు దావోస్‌ మొదలైంది. ఇవాళ దావోస్ చేరుకున్న చంద్రబాబు... వివిధ కంపెనీల ప్రతినిధులతో బిజీబిజీగా గడిపారు. ఏపీలో వ్యాపార అవకాశాలు, తమ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో పర్యటిస్తున్న ఆయన.. తొలిరోజు ప్రముఖ కంపెనీ స్టాడ్లర్‌ ప్రతినిధులతో...

Monday, January 16, 2017 - 18:23

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు పలు సంస్థలతో సమావేశమయ్యారు. హైస్పీడ్ రైళ్లు, ఇంజిన్లు, కోచ్‌ల తయారీలో పేరొందిన సంస్థ స్టాడ్లర్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. భారత్‌లో తమ కంపెనీ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చంద్రబాబుకు తెలిపారు. ఇప్పటికే బెంగాల్‌లోని తమ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోందని,...

Monday, January 16, 2017 - 15:39

విజయవాడ : సాంకేతిక టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు దూసుకెళ్తున్నారు. మారుతున్న కాలానికనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఏపీని భద్రతా వలయంగా మార్చుతున్నారు. సీసీ కెమెరాలు, పోలీస్‌ పహారాకు తోడు సరికొత్త యాప్‌లతో ప్రజలకు చేరువకావడానికి కృషి చేస్తున్నారు. టెక్నాలజీ సాయంతో ఎంతటి కేసులైనా ఛేదిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. టెక్నాలజీకి తమ ఆలోచనలను జోడించి విధి...

Pages

Don't Miss