కృష్ణ
Tuesday, January 16, 2018 - 12:57

కృష్ణా : జిల్లా జగ్గయ్యపేటలో కనుమ సంబరాలు జరుగుతున్నాయి. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. గంగిరెద్దుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య ఎడ్ల బండ్ల మీద విహరిస్తూ కనుమ సంబరాలు జరుపుకున్నారు. మహిళలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాయినాలు చెల్లిస్తూ, పండ్లు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 

Monday, January 15, 2018 - 21:17

కర్నూలు : జిల్లా డోన్‌లో యువకులు కాసేపు వీరంగం సృష్టించారు. మద్యం తాగి... చేతిలో వేట కొడవళ్లతో ప్లైఓవర్ కింద హడావుడి చేశారు. డోన్‌లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపుల వద్ద ఇలాంటి ఘటనలు తరచు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు వచ్చేలోపు ఉడాయించడం షరామామూలేనని అంటున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Monday, January 15, 2018 - 20:53

హైదరాబాద్ : అందరూ ఊహించిందే జరుగుతోంది. కోస్తాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. భోగిరోజు మొదలైన ఈ పందెం... రెండోరోజూ కొనసాగింది. కత్తులు కట్టి కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హడావుడి చేసిన అధికారులు, పోలీసులు పత్తాలేకుండా పోయారు. ఇదేఅవకాశంగా ఖద్దరు అండతో నిర్వాహకులు కోడిపందేలు యధేచ్చగా నిర్వహిస్తున్నారు. ఏపీలో కోడి పందేలు యధేచ్చగా సాగుతున్నాయి. కోళ్లు కత్తులు...

Monday, January 15, 2018 - 16:56

తమిళ నటుడు 'సూర్య'కు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి మంచి విజయాలు సాధించాయి. దీనితో ఆయన టాలీవుడ్ పై కూడా మనస్సు పారేసుకుంటుంటారు. తాజాగా ఆయన నటించిన 'గ్యాంగ్' సినిమా ఇటీవలే తెలుగులో విడుదలైంది. ఈ సందర్భంగా 'సూర్య' సోమవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. రాజమండ్రిలోని ఓ థియేటర్ లో అభిమానులతో కలిసి 'గ్యాంగ్' సినిమా చూశారు. ‘సూర్య' వచ్చాడని...

Monday, January 15, 2018 - 16:25

విజయవాడ : కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. బెట్టింగుల రూపంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. కోడిపందాల వద్దకు మహిళలు కూడా భారీగా చేరుకొని వీక్షిస్తున్నారు. పోరంకి సెంటర్లో హాస్యనటుడు కిషోర్ దాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సుప్రీంకోర్టు నిబంధనలు పట్టించుకోకుండా... కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి మరీ పందేలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. ...

Monday, January 15, 2018 - 08:10

విజయవాడ : రైల్వే స్టేషన్ల నిర్వహణ ప్రైవేటుపరం కాబోంది. ఇప్పటికే ట్రాక్‌ నిర్మాణం, ఎలక్ట్రిఫికేషన్‌, కోచ్‌ల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్న రైల్వే శాఖ... ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. రైల్వే స్టేషన్ల నిర్వహణ బాధ్యతల నుంచి కూడా తప్పుకుని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమైంది. రైల్వే స్టేషన్లు కార్పొరేట్‌ సంస్థ చేతుల్లోకి వెళ్లబోతున్నాయి. స్విస్‌ చాలెంజ్‌ విధానంలో 99...

Sunday, January 14, 2018 - 21:01

ఢిల్లీ : కోట్లాది మంది భక్తులకు అయ్యప్ప స్వామి మకరజ్యోతి రూపంలో దర్శనమిచ్చారు. శబరిమల కొండపై అయ్యప్ప స్వామి జ్యోతి స్వరూపుడై దర్శనమివ్వడంతో స్వామియే శరణం అయ్యప్ప అంటూ శబరిమల కొండలు అయ్యప్ప నామస్మరణలో మారుమోగాయి. స్వామివారి దర్శనంతో భక్తులు పులకించిపోయారు.

Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Sunday, January 14, 2018 - 20:55

విజయవాడ : కోర్టు ఆదేశాలు.. పోలీసుల హెచ్చరికలు.. ఇవేవీ వారికి పట్టలేదు. ఎప్పటిలాగానే పందెంరాయుళ్లు జోరుగా కోడిపందేలు ఆడారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీగా పందెంరాయుళ్లు తరలివచ్చి మరీ పందేలు వేస్తున్నారు. దీంతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. భారీ భారీ టెంట్లు... అదిరిపోయే పందెం కోళ్ల స్టంట్లు.. ఏపీలోని కోస్తాలో...

Pages

Don't Miss