విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. పలువురు మృత్యువాత పడుతున్నారు. తాజాగా మరో యువకుడు మృతి చెందాడు. ఖమ్మం పాడుకు చెందిన కొంతమంది పుష్కర స్నానం చేయడానికి వచ్చారు. వీరు పవిత్ర సంగమం వద్ద స్నానం చేస్తున్నారు. వీరిలో యశ్వంత్ కు ఫిట్స్ వచ్చి నీటిలో పడిపోయాడు. ఈ విషయాన్ని ఇతర కుటుంబసభ్యులు గమనించలేదు. చివరకు కుటుంబసభ్యులు వెతికి యశ్వంత్ ను బయటకు లాగారు....
విజయవాడ : కృష్ణా పుష్కరాలు నాల్గో రోజు విజయవాడలో ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలివస్తున్నారు. పలు ఘాట్ల వద్ద భక్తుల రద్దీతో నిండిపోతున్నాయి. రద్దీని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణవేణి ఘాట్లో భక్తుల సందోహం కొనసాగుతోంది. సెలవు దినం కావడంతో యాత్రికుల రద్దీ పెరిగింది. దుర్గాఘాట్ వద్ద...
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కానీ ప్రమాదాలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. బెజవాడలోని భవానీపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం పుష్కరస్నానం చేసేందుకు విజయవాడకు దాదాపు 8మంది వచ్చారు. వీరందరూ భవానీ టవర్స్ లో రాత్రి బస చేశారు. సోమవారం ఉదయం పుష్కర స్నానం చేసేందుకు 8మంది ఐదో...
విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో మునిగితే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. అయితే గంగలో మునిగినా కుల వివక్ష మాత్రం పోవడం లేదు. విజయవాడ పద్మవతి ఘాట్ వద్ద జరుగుతున్న కృష్ణా పుష్కరాల్లో జంగమ కుల పురోహితులు తీవ్ర కుల వివక్షకు గురతున్నారు. బ్రాహ్మణులు కానందున పిండం పెట్టే అర్హత, సంకల్పం చేయించే అర్హతలు లేవని తమను బ్రాహ్మణులు, అధికారులు, పోలీసులు అడ్డుకుంటున్నారని జంగమ పురోహితులు ఆందోళనకు...
హైదరాబాద్ : పుష్కరాల మూడోరోజు ఏపీ, తెలంగాణలోని పలు ఘాట్లు భక్తులతో పోటెత్తాయి.. ఆదివారం కావడంతో పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.. ఘాట్లలోని ఏర్పాట్లను మంత్రులు, అధికారులు స్వయంగా పరిశీలించారు.
తెలంగాణలో..
తెలంగాణలో మూడోరోజూ పుష్కర సందడి కొనసాగింది.. వరుస సెలవులు కావడంతో పుష్కర స్నానం చేసేందుకు భక్తులు క్యూ కట్టారు.....
హైదరాబాద్ : నయీం కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సిట్ విచారణలో నయీంకు సహకరించిన ఉన్నతాధికారుల హస్తం బట్టబయలవుతోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న నయీం డైరీ నుంచి సేకరించిన సమాచారంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా విజయవాడకు చెందిన రిటైర్డ్ పోలీసు అధికారిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నయీంకు గతంలో కొన్ని కేసుల్లో ఈ...
విజయవాడ : నదులు మనకు ఎంతో ఇచ్చాయని, వాటి రుణం తీర్చుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రం నుంచి కరవును తరిమికొట్టాలంటే నదుల అనుసంధానం తప్పనిసరని చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా పుష్కర ఘాట్లలో సమస్యలకు సంబంధించి 201 ఫిర్యాదులు తమకు అందాయని చెప్పారు. ఈ పుష్కరాల్లో గోదావరి నీటిని పెన్నాకు తీసుకువెళ్లాలని సంకల్పం చేశామని...
హైదరాబాద్ : ఇటీవలే హతమైన గ్యాంగ్ స్టర్ నయీం వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. నయీం కేసులో పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆయన రాసుకున్న డైరీలో పలువురు ప్రముఖులున్నట్లు, నయీంతో దందాలు..సత్సంబంధాలు కొనసాగించినట్లు ఆరోపణలు రావడంతో పలువురు స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే సిట్ పోలీసులు...
విజయవాడ : కృష్ణా పుష్కరాలు ఏ ఒక్క మతానికి సంబంధించి కాదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పుష్కరాల్లో మూడో రోజు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నదులు అందరీ అవసరాలు తీరుస్తోందని, ఇందుకు అందరూ అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు 21.69 లక్షల మంది పుష్కర స్నానాలు చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజల నుండి అందిన 201 ఫిర్యాదులను పరిష్కరించినట్లు, ఈ...