కృష్ణ
Wednesday, November 15, 2017 - 21:26

హైదరాబాద్ : మహిళా సాధికారతని చాటి చెబుతూ తీసిన 'రుద్రమదేవి' సినిమా ఎందుకు మూడు ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఎంపిక కాలేకపోయిందని ప్రశ్నించారు సినిమా డైరెక్టర్‌ గుణశేఖర్. ఈమేరకు గుణశేఖర్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తెలుగు జాతి ఖ్యాతిని దశదిశలా చాటి చెప్పిన చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవికి వినోదపు పన్ను మినహాయింపు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడం తప్పా అని లేఖలో పేర్కొన్నారు....

Wednesday, November 15, 2017 - 21:22

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రన్న బీమా పథకంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఏపీ అసెంబ్లీలో చంద్రన్న బీమా పథకం, మధ్యాహ్న భోజన నిర్వహణ, ఉపాధి హామీ పథకాలపై చర్చ జరిగింది. ప్రధానంగా చంద్రన్న బీమాపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ స్కీమ్‌పై హర్షం వ్యక్తం చేసిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు...

Wednesday, November 15, 2017 - 21:19

విజయవాడ : వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తే... అధిక దిగుబడులు వస్తాయని విశాఖలో ప్రారంభమైన ఏపీ వ్యవసాయ సదస్సు అభిప్రాయపడింది. మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు సాగు చేయాలని...సదస్సుకు హాజరైన నిపుణులు సూచించారు. వ్యవసాయంలో సరికొత్త సాంకేతికతను జోడించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రైతులు వరి నుంచి ఇతర పంటలకు మారాల్సి ఉందని సూచించారు. అలాగే వ్యవసాయం రంగంలో...

Wednesday, November 15, 2017 - 20:03

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు..ఉపాధ్యాయ సంఘాలు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహంచాయి. దీనిని భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించాయి. ఎక్కడికక్కడ అడ్డుకుంటూ అరెస్టులు..చేపట్టాయి. అంతేగాకుండా పలువురిని గృహ నిర్భందం చేశారు. దీనిని సంఘాలు తీవ్రంగా నిరసించాయి. సీసీఎస్ విధానాన్ని కొనసాగించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశాయి. ఈ అంశంపై టెన్ టివి విజయవాడ...

Wednesday, November 15, 2017 - 19:08

విజయవాడ : ఫెర్రీ ప్రమాద ఘటనలో 22 మంది మృతికి కారకులైన వారిని పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ప్రధాన నిందితుడు కొండల్ రావుతో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి విచారించారు. కొండలరావు, నీలం శేషగిరి రావు, మాచవరపు మనోజ్ కుమార్, యంజమూరి విజయ సారథి, గేదెల శ్రీను, బోటు నడిపిన భైరవ స్వామి, గేదెల లక్ష్మీలను అరెస్టు చేశారు. విహార యాత్రకు పనికొచ్చిన బోటు కాదని..చేపలు...

Wednesday, November 15, 2017 - 18:30

హైదరాబాద్ : మెగాస్టార్ ఫ్యామిలీకి అన్యాయం జరిగిందా ? అంటే అవును జరిగిందని గీతా ఆర్ట్స్ లో కీలకంగా వ్యవహరిస్తున్న బన్నీ వాసు పేర్కొన్నారు. ఈయన చేసిన ట్వీట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఇటీవలే ఏపీ ప్రభుత్వం మూడు సంవత్సరాలకు నంది అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో అల్లు అర్జున్ కు క్యారెక్టర్ ఆర్టిస్టు అవార్డు వచ్చింది. మెగా కుటుంబంలో ఉన్న ఒక్క హీరోకు కూడా ఉత్తమ నటుడు అవార్డు...

Wednesday, November 15, 2017 - 18:16

కడప : డీడీల ఫోర్జరీ కేసులో సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. ఇందులో కదిరి టిడిపి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పును చెప్పింది. హుస్సేనీ ఆలం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కు ఫోర్జరీ డీడీలు సమర్పించి రూ. 6 కోట్ల వరకు మోసం చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. దీనిపై గురువారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు విచారించింది. ఈ కేసులో ఇన్ స్పెక్టర్...

Wednesday, November 15, 2017 - 14:31

పశ్చిమగోదావరి : ఫెర్రీ సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదం అనంతరం అధికారులు మేల్కొన్నారు. బోటు ప్రమాదంలో 22 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిని సీరియస్ గా తీసుకున్న సర్కార్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదం జరిగిన అనంతరం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటారనే విమర్శలున్నాయి.

బుధవారం ఉదయం పశ్చిమగోదావరి..తూర్పుగోదావరి వైపు ప్రయాణిస్తున్న బోట్లను అధికారులు తనిఖీలు...

Wednesday, November 15, 2017 - 11:44

విజయవాడ : కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను నిరసిస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీంతో భారీ ఎత్తున పోలీసులు.. విజయవాడ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించి... పలువురిని అరెస్ట్‌ చేశారు. అయితే... పోలీసుల వైఖరిని యూటీఎఫ్‌ నేతలు తప్పుపడుతున్నారు. ఎన్ని ఆటంకాలు కల్పించిన 'చలో అసెంబ్లీ' నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. 
...

Wednesday, November 15, 2017 - 10:57

విజయవాడ : కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను నిరసిస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీంతో భారీ ఎత్తున పోలీసులు.. విజయవాడ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించి... పలువురిని అరెస్ట్‌ చేశారు. అయితే... పోలీసుల వైఖరిని యూటీఎఫ్‌ నేతలు తప్పుపడుతున్నారు. ఎన్ని ఆటంకాలు కల్పించిన 'చలో అసెంబ్లీ' నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. మరిన్ని...

Pages

Don't Miss