కృష్ణ
Friday, November 6, 2015 - 07:01

విజయవాడ : ఏపీ రాజధానికి అన్ని శాఖలను తరలించాలన్న సీఎం చంద్రబాబు... సెక్రటేరియట్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అంశంపై మంత్రులతో చర్చించి.. ఓ నిర్ణయానికి వచ్చారు. గన్నవరంలోని మేథా టవర్స్‌ అయితే బాగుంటుందని డెసిషన్‌ తీసుకున్నారు. అయితే ఐటీ డెవలప్‌మెంట్‌ కోసం తాము విశేషంగా కృషిచేస్తున్నామంటున్న టిడిపి సర్కార్ చెప్తున్నదానికి చేస్తున్నదానికి పొంతన కుదరడం...

Thursday, November 5, 2015 - 13:00

హైదరాబాద్ : రాజధాని అమరావతి నిర్మాణంలో గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసు ఇవ్వడం స్వాగతిస్తున్నట్లు సామాజిక వేత్త ప్రసాద్ పాటిల్ పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండానే అమరావతి శంకుస్థాపన ఏలా చేస్తారని ట్రిబ్యునల్ ప్రశ్నించింది. ఈ సందర్భంగా టెన్ టివితో ప్రసాద్ పాటిల్ మాట్లాడారు. రాజధాని పేరిట లక్షలాది ఎకరాల పొలాలు నాశనం చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. అత్యంత సారవంతమైన ఆహార భద్రతకు...

Thursday, November 5, 2015 - 12:55

హైదరాబాద్ : రాజధాని అమరావతి నిర్మాణ విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేయడం సరైందేనని మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ పేర్కొన్నారు. స్టే ఇచ్చినా కూడా ఏ కార్యక్రమాలు జరుపకూడదని ఎన్ జిటి ఆదేశాలు ఇచ్చినా లేక్క చేయకుండా ప్రధాన మంత్రి, సీఎ చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. పర్యావరణ అనుమతికి సంబంధించిన పత్రాలు దాఖలు చేయలేదని, కఠిన చర్యలు...

Thursday, November 5, 2015 - 12:51

ఢిల్లీ : ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'అమరావతి' రాజధాని నిర్మాణంపై గ్రీన్ ట్రిబ్యునల్ కన్నెర్ర చేసింది. ఈ విషయంలో శ్రీమన్నారయణ న్యాయపోరాటం చేస్తున్నారు. తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం కొనసాగిస్తానని..లక్ష ఎకరాల భూమి కాంక్రింట్ జంగిల్ కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీమన్నరాయణ టెన్ టివితో మాట్లాడారు. పర్యావరణ అనుమతులు...

Thursday, November 5, 2015 - 11:39

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన రాజధాని 'అమరావతి' శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం పట్ల గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ జిటి ఆదేశాలను ఉల్లంఘించారంటూ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. దీనిపై వారంలోగా సమాధానం చెప్పాలని ఏపీ ప్రభుత్వం, సీఆర్డీఏ, పట్టణాభివృద్ధి, పర్యావరణ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

గ్రీన్...

Wednesday, November 4, 2015 - 16:24

విజయవాడ: బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం రోజురోజుకు తారాస్థాయికి చేరుతోంది. పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణలు.. చంద్రబాబుపై చేస్తున్న విమర్శలను టీడీపీ విజయవాడ అర్బన్‌ అధ్యక్షులు బుద్దా వెంకన్న తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి వలస వచ్చిన వీళ్లు.. కాంగ్రెస్‌ ఏజెంట్లుగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇకనైనా వారు నోరు...

Wednesday, November 4, 2015 - 14:55

ఢిల్లీ : అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ పిడికెడు మట్టి ఇచ్చి ఏపీ ప్రజలను అవమానపరిచారని పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మాట మారుస్తున్నారని విమర్శించారు. స్పెషల్‌ స్టేటస్‌ సాధనకు మట్టి సత్యాగ్రహాన్ని చేపడుతున్నామని చెప్పారు. నవంబర్‌ 6న జరిగే పీసీసీ విస్తృత సమావేశంలో దీనికి సంబంధించి విధివిధానాలను తయారుచేస్తామని తెలిపారు. ఢిల్లీలో రాజ్‌ఘాట్‌ను...

Wednesday, November 4, 2015 - 13:31

హైదరాబాద్ : బీజేపీ నేత హరిరామ జోగయ్య పుస్తకం ప్రకంపనాలు సృష్టిస్తోంది. టిడిపి, బిజెపి నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ఈ పుస్తకంపై టీడీపీ నేత కళా వెంకట్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన పుస్తకం ఎక్కువ అమ్ముడుపోవడానికే జోగయ్య ఇలాంటి కామెంట్స్ చేశారని ఆరోపించారు. ఇలాంటి అంశాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

Wednesday, November 4, 2015 - 13:28

ఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఏపీ భవన్‌లో జరిగిన కీలక భేటీల్లో చంద్రబాబు పాల్గొన్నారు. బుధవారం ఉదయం సైన్స్ అండ్‌ టెక్నాలజీ, బయో టెక్నాలజీ శాఖ కార్యదర్శి విజయరాఘవన్‌, సీఎంను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో బయోటెక్నాలజీ సంస్థల ఏర్పాటుపై చంద్రబాబుతో చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర సైన్స్ అండ్‌ టెక్నాలజీ సహాయ...

Tuesday, November 3, 2015 - 17:40

విజయవాడ : రంగా హత్యపై హరిరామజోగయ్య లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విజయవాడ టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్రావు మండిపడ్డారు. తనకు కావల్సిన వారికి ప్రయోజనం చేకూర్చేందుకే ఆయన పుస్తకం రాసినట్లు బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై బురద జల్లేందుకే హరిరామజోగయ్య ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బిజెపి నేతలు కూడా చంద్రబాబును విమర్శించడం దారుణమన్నారు.

 

Tuesday, November 3, 2015 - 13:03

కృష్ణా : విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. కమిషనర్ లేనందున సమావేశం నాలుగు రోజుల పాటు వాయిదా వేయాలని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. అయితే అందుకు మేయర్ అంగీకరించకపోవడంతో.. వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.

Pages

Don't Miss