కృష్ణ
Thursday, February 15, 2018 - 10:39

విజయవాడ : విభజన హామీల సాధన కోసం ఏపీలో పోరు తీవ్రమైంది. విభజన లెక్కలు తేల్చేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. లెక్కలు తనకు తెలుపాలని, తాను ఏర్పాటు చేసిన జేఎఫ్ సి కమిటీకి అందచేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు 15వ తేదీ డెడ్ లైన్ గా పవన్ విధించారు. ప్రస్తుతం ఆ తేదీలోపు ప్రభుత్వం వివరాలు అందిస్తుందా ? లేదా ? అనేది ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ స్పందన...

Thursday, February 15, 2018 - 10:27

విజయవాడ : టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకోనున్నారా ? బిజెపి పొత్తుపై ఏదో ఒకటి తేల్చుకోవాలని..కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలని టిడిపి యోచిస్తోందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. విభజన హామీలు..తదితర అంశాలపై కేంద్రం మెతకవైఖరి కనబరుస్తోందంటూ ఏపీ టిడిపి గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై బిజెపి..టిడిపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి....

Thursday, February 15, 2018 - 10:16

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో మరో వార్త సంచలనంగా మారబోతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. ఏపీలో కాపు రిజర్వేషన్లకు కేంద్రం బ్రేకులు వేసింది.

కాపులకు రిజర్వేషన్ లు కల్పిస్తామని ఎన్నికల్లో టిడిపి హామీనిచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పలు పోరాటాలు..ఆందోళనలు నిర్వహించారు....

Wednesday, February 14, 2018 - 21:34

కృష్ణా : హోదా పోరాటాన్ని మహాఉద్యమంగా మలిచేందుకు వామపక్షాలు సిద్ధం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కదిలించేందుకు కార్యాచరణను రెడీ చేస్తున్నాయి. విజయవాడలో జరిగిన భేటీలో 10 కమ్యూనిస్ట్‌పార్టీలు ఉద్యమానికి సిద్ధం అని ప్రకటించాయి. ఏపీ విభజన చట్టంలో హామీలను నెరవేర్చేలా కేంద్రం మెడలు వంచుతామంటున్నారు కమ్యూనిస్టుపార్టీల లీడర్లు. ఇప్పటికే రాష్ట్ర బంద్‌తో ప్రజలను కదిలిచిన నేపథ్యంలో...

Wednesday, February 14, 2018 - 15:39

కృష్ణా : విభజన చట్టంలోని హామీల అమలుకు భారీస్థాయిలో ఉద్యమం చేపట్టబోతున్నట్టు వామపక్ష పార్టీల నేతలు తెలిపారు. దీనిపై దశలవారీగా ఉద్యమం నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలను సమీకరిస్తామన్నారు. విభజన చట్ట హామీల అమలుకు మార్చి 6న పార్లమెంట్‌ ధర్నా నిర్వహించనున్నట్టు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ తెలిపారు. ఇవాళ విజయవాడలో 10వామపక్ష...

Wednesday, February 14, 2018 - 12:39

విజయవాడ : ఏపీలో సోలార్ విద్యుత్‌కి డిమాండ్ పెరుగుతోంది. విద్యాసంస్థలు.. వ్యాపార సముదాయాలు సైతం ఇప్పుడు సోలార్‌ పవర్‌పై దృష్టి పెట్టాయి. విజయవాడలో అతి పెద్ద విద్యాసంస్థల్లో ఒకటైన సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రయోగాత్మకంగా 150 వాట్స్ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ప్రారంభించింది.

విజయవాడ నగరంలోని సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజ్‌ ఇది... ఈ కాలేజ్‌ ప్రాంగణంలో 10 వేల చదరపు అడుగులతో...

Wednesday, February 14, 2018 - 12:26

కృష్ణా : విభజన చట్టాల హామీలు ఎలా సాధించుకోవాలి..ప్రత్యేక హోదాకు అనుసరించాల్సిన వ్యూహం..కేంద్రం మెడలు ఎలా వంచాలే దానిపై వామపక్షాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఇప్పటి వరకు జరుగుతున్న పోరాటాలను మరింత ఉధృతం చేయాలని యోచిస్తున్నాయి. విభజన హామీలు అమలుకు టిడిపి వత్తిడి చేయకపోవడం..కేంద్రం స్పందించకపోవడంపై వామపక్షాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి.

నాలుగేళ్లు దాటిపోవడంతో ఇక భారీ...

Wednesday, February 14, 2018 - 11:25

విజయవాడ : గత కొన్ని రోజులుగా ఏపీలో విభజన హామీల అమలు..ప్రత్యేక హోదా అమలు చేయాలంటూ కేంద్రంపై అధికార..విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిదే. దీనిపై ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధానంగా ప్రతిపక్షమైన వైసీపీ ఒక్కసారిగా వ్యూహం మార్చేసింది. తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న జగన్ ప్రకటనతో రాజకీయ వేడి మరింత రగులుకుంది. దీనితో టిడిపి అప్రమత్తమైంది. టిడిపి జాతీయ...

Tuesday, February 13, 2018 - 21:35

విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. విభజన హామీలను అమలు చేయకుండా తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. కేంద్రంలో బీజేపీతో టీడీపీ లాలూచీ పడిందని మధు ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంటూ టీడీపీ-బీజేపీలు ఎన్నికల స్టంట్‌కు తెరతీశాయని మండిపడ్డారు.

ఏపీకి...

Tuesday, February 13, 2018 - 18:47

కృష్ణా : రిలయన్స్‌ అధిపతి ముఖేశ్‌ అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌ సందర్శిస్తారు. ఆర్‌టీజీఎస్‌ పనితీరును ముఖేశ్‌ అంబానీ పరిశీలిస్తారు. ఏపీలో జియో ఫోన్ల తయారీ పరిశ్రమ, ఐటీ సంస్థల ఏర్పాటుపై చర్చిస్తారు.  మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Pages

Don't Miss