కృష్ణ
Monday, May 15, 2017 - 16:32

ఢిల్లీ : రాన్స్‌మ్‌వేర్‌ సైబర్‌ దాడులు ఇవాళ కూడా కొనసాగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంనాడు ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాల్లో రాన్స్‌మ్‌వేర్‌ సైబర్‌ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ జరగబోయే సైబర్‌ దాడులు శుక్రవారం నాటికన్నా తీవ్రస్థాయిలో ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తాజాగా కేరళలోని పంచాయితీ కార్యాలయంపై సైబర్‌ దాడులు జరిగినట్లు అనుమానిస్తున్నారు. నాలుగు...

Monday, May 15, 2017 - 08:52

విజయవాడ : ఇదే విజయవాడలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీ. అరకొరా సౌకర్యాలతో కాలనీ వాసులు నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కాలనీలో ఒక వైన్, ఒక బార్ షాపుకు మద్యం టెండర్లను దక్కించుకున్నారు కొందరు టిడిపి నేతలు. అప్పటి నుంచి కాలనీ వాసుల కష్టాలు మొదలయ్యాయి. భర్తలు సంపాదించిన డబ్బంతా మద్యానికే తగలేయడం.. తాగి హింసించడంతో కాలనీ మహిళలు తట్టుకోలేకపోయారు. రెండు మద్యం దుకాణాలను మూసివేయాలని...

Sunday, May 14, 2017 - 21:28

ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా మరో సైబర్ దాడి జరగనుందని హెచ్చరిస్తున్నారు సాఫ్ట్‌వేర్ నిపుణులు. ఈ దాడి సోమవారమే జరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. పాత మాల్‌వేర్‌ కోడింగ్‌లో స్వల్పమార్పులతో మళ్లీ దాడి జరిగే అవకాశముంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న రామ్సమ్‌వేర్‌ దుష్పరిణామాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఇప్పుడు మరో దాడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిన్న...

Sunday, May 14, 2017 - 21:24

విజయవాడ : నాన్నంటే కూతురికి కొండంత అండ. . కూతురంటే నాన్నకు బాధ్యత. అలాంటిది ఓ కూతురికి రాకూడని కష్టం వచ్చింది. అయినా ఓ తండ్రి మనసు కరగలేదు. తనను బ్రతికించమని వేడుకున్నా ఆ తండ్రికి వినబడలేదు. విజయవాడ భూకబ్జా కేసులో క్యాన్సర్ బాధిత చిన్నారి సాయిశ్రీ మరణం అందరినీ కలచివేస్తోంది. నన్ను బ్రతికించు నాన్నా.. అంటూ తండ్రికి కడసారి ఆమె పంపిన వీడియో చూస్తే అందరినీ కంటతడి పెట్టిస్తోంది....

Sunday, May 14, 2017 - 21:21

వరంగల్ : కాసేపట్లో పెళ్లి.. కల్యాణ మండపమంతా వచ్చిపోయే వారితో కళకళలాడుతోంది.. మహూర్తం దగ్గరకు వచ్చేసింది.. ఇక వధూవరులు రావడమే ఆలస్యం.. ఇంతలో పెళ్లికూతురుకు వచ్చిన ఓ మెసేజ్‌ అందరినీ షాక్‌కు గురిచేసింది.. పీటలదాకావచ్చిన పెళ్లి ఆగిపోయేలా చేసింది. ఒక అమ్మాయితో ప్రేమాయణం నడిపి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడో వరుడు.. చివరినిమిషంలో ఈ విషయం తెలుసుకున్న వధువు తల్లిదండ్రులు వివాహాన్ని...

Sunday, May 14, 2017 - 21:18

హైదరాబాద్ : ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయడం ఖాయమని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. త్వరలో అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తానని ప్రకటించిన జనసేనాని ప్రజాసమస్యల కోసం అవసరమైతే సినిమాల్ని మానేస్తానని ప్రకటించారు. జనసేన సైనికులతో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. జనసేన పార్టీ కోసం స్పీకర్లు, కంటెంట్‌ రైటర్లు, అనలిస్టులుగా సేవలు...

Sunday, May 14, 2017 - 19:32

విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల అధిపతులకు తొత్తులుగా మారాయని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తూకూరు మండలం పైనాపుపరంలో పరిశ్రమల బాధితులతో మధు మాట్లాడారు. కృష్ణపట్నం పోర్టు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, పామాయిల్‌ కంపెనీలు వెంటనే కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.. స్థానికులకు ఉద్యోగాలివ్వాలన్నారు.

Pages

Don't Miss