కృష్ణ
Tuesday, July 28, 2015 - 17:36

కృష్ణా: జిల్లాలోని మైలవరంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూమిలో సాగుచేస్తున్న పేదలను తొలగించరాదని సీపీఎం ఆందోళన చేసింది. మైలవరం మార్కెట్‌యార్డు దగ్గర హైవేపై బైఠాయించి నేతలు ధర్నా చేశారు. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏపీ కార్యదర్శి మధుతో పాటు సీపీఎం నేతలు, వందలాది మంది చిన్న, సన్నకారు రైతులు పాల్గొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని పోలీసులు...

Tuesday, July 28, 2015 - 12:04

విజయవాడ : భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణం లౌకిక ప్రజాస్వామ్యానికి తీరని లోటని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ లౌకికతత్వం కాపాడిన వ్యక్తులు కలాం ఒకరని తెలిపారు.
షిల్లాంగ్ లో కలాం కన్నుమూత..
షిల్లాంగ్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఉపన్యాసమిస్తూ కలాం ఒక్కసారిగా...

Monday, July 27, 2015 - 21:46

విజయవాడ: 2014 మార్చి 15వ తేదీన అత్యంత దారుణంగా.. అత్యాచారానికి, హత్యకు గురైన హిమబిందు హత్య కేసులో తుది తీర్పును... రేపు విజయవాడ కోర్టు వెల్లడించనుంది. ఇప్పటికే విచారణ పూర్తిచేసుకోవడంతో నిందితులకు ఎలాంటి శిక్ష పడుతుందోననే ఉత్కంఠ.. సర్వత్రా నెలకొంది. కిరాతకంగా వ్యవహరించి పాశవికంగా హత్యచేసిన వారికి కఠిన శిక్షలే పడాలని స్థానికులు అంటున్నారు. వారికి పడే శిక్షలను చూసి ఇతరులెవరూ...

Sunday, July 26, 2015 - 21:54

కృష్ణా: జిల్లాలోని మైలవరంలో చలవాది జమలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో 150వ నెల ఉచిత మెగా మెడికల్‌ కాంప్‌కు తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ కొణిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉచిత మెగా క్యాంప్‌ నిర్వహణను రోశయ్య ప్రశంసించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని గవర్నర్‌ రోశయ్య పేర్కొన్నారు. 

Sunday, July 26, 2015 - 06:46

విశాఖపట్టణం : ప్రముఖ రచయిత, కవి, విరసం నేత చలసాని ప్రసాద్‌ (83) భౌతికకాయాన్ని నేడు ఆంధ్రా మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు ఆయన కుటుంబసభ్యులు అందచేయనున్నారు. బతికినా, చనిపోయినా పదిమందికీ ఉపయోగపడాలనేది చలసాని ఆకాంక్ష. ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అప్పగించనున్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలోని హెచ్ బీ కాలనీలో శనివారం చలసాని కన్నుమూసిన సంగతి తెలిసిందే...

Saturday, July 25, 2015 - 16:32

హైదరాబాద్: ఆస్ట్రేలియాలో తెలుగు యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ములకలపల్లి నవీన్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. కారులో ఇంటికివస్తుండగా మంచులో దారి కనిపించక కరెంటు స్తంభానికి ఢీకొట్టాడు. దీంతో నవీన్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు...

Saturday, July 25, 2015 - 16:24

విజయవాడ: డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికులు ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నారు. 15 రోజులుగా నిరసనలు చేపడుతున్న మున్సిపల్ కార్మికులు.. ఇవాళ విజయవాడలో నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గపూర్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేషు, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్‌లు నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ...

Friday, July 24, 2015 - 12:34

విజయవాడ : 'చాలీ చాలనీ జీతాలు..ఆపై పెరుగుతున్న ధరలు..తాము అర్ధాకలితో అలమటిస్తున్నాం..కడుపులు కాలిపోతున్నాయి..పచ్చడి మెతుకులు తింటున్నాం..కనీస వేతనాలు పెంచండి..అంటే తమపై పోలీసులు ప్రతాపం చూపుతారా ? ఎందుకు చూపుతున్నారు..మా ఉసురు తాకుతుంది'' అంటూ పారిశుధ్య కార్మికులు శాపనార్థాలు పెట్టారు.
సమస్యలు పరిష్కరించాలంటూ తమకు మద్దతుగా పోరాటం చేస్తున్న నాయకులను ఎందుకు కొట్టారంటూ తీవ్ర...

Friday, July 24, 2015 - 11:32

విజయవాడ : సీఎం డౌన్ డౌన్..పోలీసు జులుం నశించాలనే నినాదాలు..పోలీసులు బలప్రయోగం..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఎం నేత బాబురావులకు తప్పిన సృహ..ఎక్కడ చూసినా సొమ్మ సిల్లిన కార్యకర్తలు..కొంతమంది కార్యకర్తలకు గాయాలు..తోటి కార్మికుల సపర్యలు..ఈ దృశ్యాలన్నీ విజయవాడ సబ్ కలెక్టర్ ఆవరణలో చోటు చేసుకున్నాయి. పోలీసులు జరిపిన బలప్రయోగాన్ని కార్మికులు తీవ్రంగా నిరసించారు.
...

Friday, July 24, 2015 - 06:28

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతోంది. వేతనాలు పెంచేవరకు సమ్మె విరమించేదే లేదని కార్మికులు స్పష్టం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె తీవ్రరూపం దాల్చుతోంది. మరోవైపు మున్సిపల్ కార్మికుల సమ్మెకు లెప్ట్ పార్టీలతో పాటు వైసీపీ మద్దతు తెలపడంతో సమ్మె మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు మున్సిపల్‌ సమ్మెపై ప్రభుత్వం ఇంతవరకు...

Thursday, July 23, 2015 - 19:50

అమరావతీ నగర అపురూప శిల్పం ఆవిష్కృతమైంది. అంబరాన్నంటే ఆకాశహార్మ్యాలు ఓవైపు.. అద్వితీయ సుందరవనాలు మరోవైపు..! ఇటు స్వర్గానికి దారులు పరిచే రహదారులు.. అటు అభివృద్ధిని పరుగులు పెట్టించే పారిశ్రామిక పార్కులు..! ఆ వైపు హైవేలు.. ఈ వైపు స్కైవేలు.. ఒక్కటేమిటీ..! ఆంధ్రుల అక్షయపాత్రగా అవతరించబోతోంది భూలోక అమరావతి. మరి, ఇంతటి అసామాన్య నగరంలో సామాన్యుడికి స్థానం ఉంటుందా..? సగటు ఆంధ్రుడి స్వప్నం ఫలించనుందా...

Pages

Don't Miss