కృష్ణ
Thursday, March 16, 2017 - 11:34

విజయవాడ : రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ రోజు ప్రతిపక్షం ఆందోళనలు చేయడంతో పలుమార్లు సభ వాయిదా పడుతూ వచ్చింది. ఉదయం ప్రశ్నోత్తరాల్లో పోలవరం అంశంపై అధికార..ప్రతిపక్షం మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. జగన్ కు అవకాశం ఇవ్వలేదని పేర్కొంటూ వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనితో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు అనంతరం తిరిగి సభ ప్రారంభమైంది. ఎక్సైజ్...

Thursday, March 16, 2017 - 11:28

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజా అంశం మళ్లీ రాజుకుంది. ఎమ్మెల్యే అనితపై రోజా వ్యవహారశైలిపై విచారించబడిన ప్రివిలేజ్ కమిటీ గురువారం ఉదయం స్పీకర్ కు నివేదిక సమర్పించింది. గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతనలో ప్రివిలేజ్ కమిటీ 62 పేజీల నివేదిక తయారు చేసింది. రోజా ఏ విధంగా అవమానపరిచారు ? వీడియో క్లిప్పింగ్స్..ఇతరత్రా వ్యాఖ్యలను నివేదికలో పొందుపరిచారు. రోజా సభకు క్షమాపణలు చెబితే ఈ అంశంపై...

Thursday, March 16, 2017 - 10:10

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మళ్లీ ఏడాది పాటు సస్పెన్స్ వేటు పడే అవకాశం ఉంది. గతంలో జరిగిన సభలో ఎమ్మెల్యే అనిత..రోజా మధ్య జరిగిన వివాదం దుమారం రేగిన సంగతి తెలిసిందే. రోజా వ్యవహార శైలిపై ఎమ్మెల్యే అనిత స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో స్పీకర్ కోడెల ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు. అనంతరం దీనిపై ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టారు. నాలుగు సార్లు సమావేశమైంది. ప్రివిలేజ్ కమిటీ...

Thursday, March 16, 2017 - 09:34

విజయవాడ : ఏపీ అసెంబ్లీలో మళ్లీ లొల్లి షురూ అయ్యింది. అధికార..విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు..వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. గురువారం నాడు ప్రారంభమైన శాసనసభలో తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులపై వైసీపీ నేత జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆరోపణలు..విమర్శలు గుప్పించారు. నేషనల్ ప్రాజెక్టు అని డిక్లేర్డ్ చేసిన అనంతరం కేంద్రం చేయాల్సిన ధర్మమన్నారు....

Thursday, March 16, 2017 - 08:21

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం కొనసాగనున్నాయి. ఈ రోజు జరిగే సమావేశాల్లో పలు అంశాలు చర్చకు రానున్నాయి. గవర్నర్ ప్రసంగంపై సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం..పర్యాటక – సాంస్కృతిక, వారసత్వ చట్టం, ఎక్సైజ్ బిల్లు, వ్యాట్ బిల్లులు సభ ఎదుట రానున్నాయి. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సభా హక్కుల కమిటీ నివేదిక సమర్పించనుంది. ఏడాదిపాటు సస్పెండ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ...

Thursday, March 16, 2017 - 08:17

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం కొనసాగనున్నాయి. ఈ రోజు అసెంబ్లీ హాట్ హాట్ జరగనుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో టెన్ టివి ముచ్చటించింది. ఓ మహిళ అనుచితంగా ప్రవర్తించారంటే అందుకు గల కారణాలు చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రోజా మూడు సార్లు దరఖాస్తు పెట్టుకోవడం జరిగిందని, తనపై ఎమ్మెల్యే అనిత ఎలా దురుసుగా మాట్లాడారో చూపెట్టాలని...

Thursday, March 16, 2017 - 07:38

అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్‌ తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. లక్షా 56 వేల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి 19 వేల కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత ప్రాథమిక విద్యకు 17 వేల కోట్లు, నీటిపారుదల రంగానికి 12 వేల కోట్లు కేటాయించారు. 9 రంగాల ఆధారంగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తామని.. విజన్‌ 2029లో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్‌ ప్రతిబింబిస్తుందన్నారు యనమల...

Thursday, March 16, 2017 - 06:26

విజయవాడ : రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. 18వేల 214 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌లో మూడో విడత రుణమాఫీ కింద 3వేల 600కోట్లు ప్రతిపాదించారు. మొక్కజొన్న, మినుముల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం పూర్తయ్యాక... వ్యవసాయ...

Thursday, March 16, 2017 - 06:24

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధులు ఇవ్వడంతో పాటు, పర్యావరణ అనుమతుల విషయంలో కూడా కేంద్రమే చొరవ తీసుకోనుంది. ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా సమకూర్చాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల టీడీపీ, బీజేపీ నేతలు కేంద్రానికి కృతజ్ఞతలు...

Pages

Don't Miss