కృష్ణ
Thursday, May 11, 2017 - 21:25

వాషింగ్టన్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన ముగిసింది. ఏడు రోజుల టూర్‌లో 15 నగరాలను సందర్శించారు. ఏడువేల కిలో మీటర్లకు పైగా ప్రయాణించారు. ముప్పైకి పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. తొంబైకి పైగా కంపెనీల ప్రముఖులు, ప్రతినిధులను కలుసుకున్నారు. అమెరికాకు చెందిన పలు కంపెనీలు ఏపీలో యూనిట్లను పెట్టడానికి అంగీకరించాయని చంద్రబాబు ట్వీట్‌ చేశారు. వ్యవసాయం, విద్య, ఫింటెక్‌,...

Thursday, May 11, 2017 - 16:38

నెంబర్ 2గా పేరొందిన దేవేందర్ గౌడ్ అమెరికాలో ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఆయన్ను కలిశారు. కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాల్లో కనిపించిన ఆయన చాలా అరుదుగా కనిపించడం మొదలు పెట్టారు. కొన్ని నెలలుగా ఆయనపై ఎలాంటి వార్తలు రాలేదు. తాజాగా ఆయన ఆయన ఎక్కడున్నారో తెలిసింది. అమెరికాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు ఆయన్ను కలిశారు. కొన్ని రోజులుగా అక్కడ క్యాన్సర్ వ్యాధికి చికిత్స...

Thursday, May 11, 2017 - 12:48
Wednesday, May 10, 2017 - 21:25

విజయవాడ : రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిని బలపరచాలన్న వైసీపీ నిర్ణయాన్ని సీపీఎం కమిటీ తప్పుపట్టింది. మతోన్మాదాన్ని పెంచిపోషిస్తున్న బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని వైసీపీ అధినేత జగన్‌ ప్రకటించడం లౌకకి స్ఫూర్తికి విరుద్ధమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు వ్యాఖ్యానించారు. వైసీపీ అవకాశవాద రాజకీయాలకు జగన్‌ ప్రకటన నిదర్శమని విమర్శించారు.

Wednesday, May 10, 2017 - 15:45

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మద్యం తాగి వాహనం నడపడం, అతివేగంగా నడపడంతో చోటు చేసుకునే ప్రమాదాలతో పాటు చీకట్లో కనిపించక ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేలపై ప్రయాణించేటపుడు భారీ వాహనాలకు అన్ని వైపులా రేడియం టేపు అతికించాలనే నిబంధన ఉంది. దానిని పట్టించుకోకపోవడంతో పాటు రహదారులపై ఇష్టానుసారంగా వాహనాలను నిలిపివేస్తున్నారు. ఫలితంగా...

Wednesday, May 10, 2017 - 11:32

విజయవాడ: తెలుగు రాష్ట్రాల రవాణ మంత్రుల సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, టీఎస్ మంత్రి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ ఎండీలు, కమిషనర్లు, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అంతర్ రాష్ట్ర ఆర్టీసీ సర్వీసుల ఒప్పందాలు, రవాణ వాహనాల కౌంటర్ పర్మిట్ల జరిమానాల పై కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

Tuesday, May 9, 2017 - 20:04

చిత్తూరు : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు భారత ఐటీ ఉద్యోగులు విలవిలలాడుతున్నారు. వీసా నిబంధనలు కఠినతరం చేసిన తరువాత యూఎస్ లోని స్థానికులను నియమించుకోవాలని భారత ఐటీ దిగ్గజ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగా వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇన్ఫోసిస్ తో పాటు కాగ్నజెంట్ నాలుగు వేల మంది ఉద్యోగస్తులను తొలగించింది. దీనికి వ్యతిరేకంగా ఐటీ ఉద్యోగులు...

Tuesday, May 9, 2017 - 19:39

విజయవాడ : ఏపీ ప్రత్యేక రైల్వే జోన్ పై టిడిపి ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ విషయంలో దేవుడు వరమిచ్చినా పూజారీ కరుణించ లేదన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించేందుకు దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన ఈ సమావేశానికి ఎంపీ రాయపాటి హాజరయ్యారు. అధికారుల...

Pages

Don't Miss