కర్నూలు
Sunday, January 21, 2018 - 17:05

కర్నూలు : హైదరాబాద్ శివార్లలో కలకలం సృష్టించిన చెడ్డిగ్యాంగ్ కర్నూలులోకి చొరబడింది. న్యూ కృష్ణానగర్, ఆదిత్యనగర్, విఠల్‌నగర్‌లలో ఈ గ్యాంగ్ చోరికి తెగపడింది. 3 ఇళ్లలో చోరీకి పాల్పడి... ఓ ఇంటికి నిప్పుపెట్టారు. బనియన్లు, చెడ్డీలతో తిరుగుతున్న యువకులను స్థానికులు చూసి పట్టుకునేందుకు ప్రయత్నించడంతో వీరంతా పారిపోయారు. వీరి వేషధారణను చూసి చెడ్డీగ్యాంగ్‌గా నిర్థారించారు. మరిన్ని...

Saturday, January 20, 2018 - 18:32

కర్నూలు : జిల్లాలోని ఎమ్మిగనూరులో సహారా క్రెడిట్ కో ఆపరేటివ్ బ్యాంక్ డబ్బులు చెల్లించకపోవడంతో ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. బ్యాంకు సిబ్బంది లోపల ఉండగానే బ్యాంకుకు తాళాలు వేసి ఆందోళన చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బ్యాంక్‌లో కట్టిన పాలసీలు మెచ్యూరిటీ అయి రెండు సంవత్సరాలు గడుస్తున్నా బ్యాంక్ సిబ్బంది ఖాతాదారుల్ని  బ్యాంకు చుట్టూ తిప్పుకుంటున్నారు. తమకు రావాల్సిన...

Saturday, January 20, 2018 - 10:53

కర్నూలు : జిల్లా లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ షాపులో షార్ట్‌సర్క్యూట్‌తో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. షాపులోని సామాగ్రి అంతా కాలి బూడిదయ్యింది. సంఘటనాస్థలానికి చేరుకుని ఫైర్‌ సిబ్బంది మంటలార్పివేసింది. ఈ

Saturday, January 20, 2018 - 08:26

కర్నూలు : జిల్లాలోని పెట్రోల్ బంకులో మోసం వెలుగు చూసింది. బంకు యాజమానులు పెట్రోల్ లో కెమికల్స్ కలిపి విక్రయిస్తున్నారు. ఎమ్మిగనూర్ లోని నాగిరెడ్డి పెట్రోల్ బంకులో పెట్రోలులో నీళ్లు కలిపినట్లు వినియోగదారుడు గమనించడంతో ఆయన స్థానికులతో కలిసి పెట్రోల్ బంకు యాజమానిపై పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Thursday, January 18, 2018 - 18:12

కర్నూలు : జిల్లా ఆదోనిలోని వాల్మీకి నగర్ లో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వేటకొడవళ్లతో ఇరువర్గాలు దాడులకు తెగపడ్డారు. ఈ ఘర్షణ 13 మందికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నాటుసారా విషయంలో విదామే ఈ ఘర్షణకు కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Wednesday, January 17, 2018 - 12:24

కర్నూలు : జిల్లా చెన్నంపల్లి కోటలో మొదలైన తవ్వకాలు 30 రోజులకు చేరుకుంది. ఇన్ని రోజులు తవ్వకాలు జరుగుతున్నా ఎలాంటి నిధులు..ఇతరత్రా ఏమీ దొరకడం లేదు. తవ్వకాలు జరుపుతుండడం..కోటను ధ్వంసం చేస్తుండడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాతాళగంగను దాటి కిందకు వెళ్తే నిజంగానే గుప్తనిధులు ఉన్నాయా? గుప్తనిధిని చేరుకునే మార్గం ఇదేనా ? అనే దానిపై అధికారులు యోచిస్తున్నారు....

Tuesday, January 16, 2018 - 13:24

కర్నూలు : సంక్రాంతి పండుగ అయిపోయింది..బుధవారం కనుమ..ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధానంగా ఏపీ రాష్ట్రంలో కనుమ పండుగ సందర్భంగా మాంసాహారాన్ని ఇంటికి తెచ్చుకుంటుంటారు. కానీ కర్నూలు నగరంలో చికెన్..మటన్ దుకాణాలపై మున్సిపల్ అధికారులు దాడులు చేయడం కలకలం రేపింది. అనారోగ్యంతో ఉన్న కోళ్లు..గొర్లు..పొట్టెళ్ల మాంసాహారాన్ని విక్రయిస్తున్నారని సమాచారం మేరకు...

Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Pages

Don't Miss