కర్నూలు
Sunday, February 11, 2018 - 10:52

కర్నూలు : జిల్లాలోని ప్యాపిలిలో రౌడీషీటర్ దారుణ హత్య గావించారు. రౌడీషీటర్ వెంకటరెడ్డి జాతరకు వెళ్లి వస్తుండగా దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. మధు 2009లో ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్నారు. ఇరువర్గాలు 20 రోజుల క్రితం రాజీపడ్డారు. పాత కక్షలు నేపథ్యంలో మధు హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Saturday, February 10, 2018 - 18:52

కర్నూలు : సీపీఎస్ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కర్నూలులో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో..కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి... ఓపీఎస్ సిస్టమ్ అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కర్నూలు ఉద్యోగ...

Saturday, February 10, 2018 - 08:09

కర్నూలు : గుప్త నిధులంటూ కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో చేపట్టిన తవ్వకాలతో... చరిత్ర ఆనవాళ్లు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిధుల కోసం అధికారులు చేపట్టిన తవ్వకాలలో నిధుల మాటేమోగాని కోటంతా గుంతలమయం అయింది. దీంతో భవిష్యత్‌ తరాలకు చరిత్ర తెలియకుండా పోయే పరిస్థితి నెలకొంది. 

 

Friday, February 9, 2018 - 09:35

కర్నూలు : ప్రైవేట్ కాలేజీలో ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. కాలేజీ యాజమాన్యాలు డబ్బులే పరమావధిగా భావిస్తున్నారు. ఫీజుల పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రైవేట్ కాలేజీ ధన దాహానికి విద్యార్థులు బలవుతున్నారు. తాజాగా కర్నూలులో ఫీజుల జులుంకి బీటెక్ విద్యార్ధిని ప్రశాంతి బలైంది. ప్రశాంతి కర్నూలులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్‌ రెండో సంవత్సరం...

Thursday, February 8, 2018 - 17:35

విజయవాడ : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు బంద్‌ చేపట్టాయి. దీంతో కర్నూలు జిల్లాలో ఉదయం నుండే బస్సు డిపోల వద్ద వామపక్ష పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.

కడప జిల్లాలో......

Tuesday, February 6, 2018 - 10:47

కర్నూలు : వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధర పడిపోయింది. కిలో 25 పైసలకు పడిపోవడంతో టమాటా రైతులు లబోదిబోమంటున్నారు. రవాణా ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ధర లేకపోవడంతో రైతులు రోడ్డుపైనే టమాటాలు పారబోశారు. టమాటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోలనకు దిగారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Sunday, February 4, 2018 - 21:49

కర్నూలు : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వంపై మాటల దాడిని మరింత ఉధృతం చేశారు. సీఎం చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు సంధించారు. తాము నిప్పులాంటి వారిమని... టీడీపీ నేతలు అవినీతిపరులని ఆరోపించారు. ఏపీలో రూలింగ్‌ లేదని... కేవలం ట్రేడింగ్‌ మాత్రమే జరుగుతుందన్నారు. రెండెకరాల రైతును అంటున్న బాబుకు... లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న...

Sunday, February 4, 2018 - 17:45

కర్నూలు : జిల్లాలోని చెన్నంపల్లి కోటలో 15రోజుల తరువాత తవ్వకాలు తిరిగి ప్రారంభమైయ్యాయి. తవ్వకాల్లో ఇవాళ ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. వీటిని రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Sunday, February 4, 2018 - 09:20

కర్నూలు : జిల్లా పాణ్యం సమీపంలో బలపనూరు రహదారిపై ఓ మినీ లారీ ఎద్దుల బండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గరు మృతి చెందారు. రెండు ఎడ్లు కూడా మరణించాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Saturday, February 3, 2018 - 16:45

కర్నూలు : జిల్లాలోని ఆదోనిలో ఆర్ట్స్ ఆండ్ సైన్సు కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని విజయలక్ష్మి ఆత్మహత్యకి పాల్పడింది. ప్రాక్టికల్‌ పరీక్షలకు ఆలస్యం కావడంతో కాలేజీ యాజమాన్యం అనుమతించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌...

Pages

Don't Miss