కర్నూలు
Tuesday, May 1, 2018 - 13:36

కర్నూలు : పట్టణంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎర్ర జెండాను ఎగురవేసి కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించవద్దంటూ కార్మికనేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

Saturday, April 28, 2018 - 11:47

కర్నూలు : ఏపీ రాష్ట్రంలో అవినీతి లేదా ? అవినీతి ఉందని ఇటీవలే పలువురు నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ అవినీతి తమ ప్రభుత్వంలో లేదని పాలకులు జబ్బలు చరచుకుంటున్నారు. ఏపీ అవినీతి రహిత రాష్ట్రమని గొప్పలు చెప్పుతున్నారు. కానీ కర్నూలు జిల్లాలో జరిగిన ఘటనపై పాలకులు..అధికారులు..ఏమంటారో ?

జిల్లాలో క్రీడాకారులకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కోడుమూరు...

Friday, April 27, 2018 - 19:55

అమరావతి : ఆళ్లగడ్డ పంచాయితీకి సీఎం చంద్రబాబు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. మంత్రి అఖిలప్రియ, పార్టీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలును పరిష్కరించి.. ఇద్దరు నేతల మధ్య సయోద్య కుదిర్చారు. విభేదాలను విస్మరించి, పార్టీ పటిష్టత కోసం పనిచేయాలన్న చంద్రబాబు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని అఖిలప్రియ, ఏవీ సబ్బారెడ్డి ప్రకటించారు. look.

అఖిలప్రియ...

Friday, April 27, 2018 - 06:38

కర్నూలు : నేతలు గ్రూపులు కడుతూ పార్టీకి చెడ్డపేరు తీసుకురావొద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆళ్లగడ్డ నేతలకు హితబోధ చేశారు. మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి ఇద్దరి పద్దతి బాగాలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడంలో పోటీపడాలి తప్ప.. కొట్లాడుకుంటే ప్రజల్లో చులకనైపోతామని హితబోధ చేశారు. ఆళ్లఫైట్‌పై ఇద్దరు నేతలతో మాట్లాడిన చంద్రబాబు... నేతలంతా పార్టీ ఆదేశాల మేరకు...

Thursday, April 26, 2018 - 21:38

అమరావతి : భూమా కుటుంబాన్ని వేలెత్తి చూపితే సహించేదిలేదని మంత్రి అఖిలప్రియ సోదరి మౌనిక ఆళ్లగడ్డ టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిని హెచ్చరించారు. రాజకీయంగా ఎదగాలంటే సుబ్బారెడ్డికి సహకరిస్తాం కానీ... భూమా కుటుంబంపై నిందతులు మోపితే మాత్రం సహించబోమన్నారు. భూమా కుటుంబంపై విమర్శలు చేసినా ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మౌనిక హెచ్చరించారు. 

Thursday, April 26, 2018 - 10:32

కర్నూలు : వచ్చే సంవత్సరంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి నుండే నేతలు తమ తమ స్థానాలను ఖరారు చేసుకుంటున్నారు. ఆయా పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఏపీలో వలసల తాకిడి ప్రారంభమైంది. ఇతర పార్టీల్లోని నేతలు వైసీపీలోకి చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. బీజేపీ పార్టీకి చెందిన కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన అస్వస్థతకు గురి కావడంతో పార్టీ చేరిక వాయిదా పడింది....

Thursday, April 26, 2018 - 06:45

విజయవాడ : ఏపీ టూరిజం మంత్రి అఖిలప్రియపై టీడీపీ అధిష్టానం సీరియస్‌ అయ్యింది. ఆళ్లగడ్డ ఫైట్‌పై మాట్లాడేందుకు రావాలని అధిష్టానం ఆదేశించినా మంత్రి సమావేశానికి హాజరుకాలేదు. దీంతో ఇవాళ ఎట్టిపరిస్థితుల్లోనూ సమావేశానికి హాజరుకావాల్సిందేనని హుకుం జారీ చేసింది. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు.. ఇద్దరు నేతలతో ఏం చర్చిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఆళ్లగడ్డలో ఇద్దరు టీడీపీ నేతల మధ్య తలెత్తిన...

Wednesday, April 25, 2018 - 11:46

విజయవాడ : దివంగ‌త ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అనుచ‌రుడు, టీడీపీ సీనియ‌ర్ నేత ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి కుమార్తె, మంత్రి అఖిల ప్రియ మ‌ధ్య పచ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ఉంది. కొంత కాలం నుంచి క‌ర్నూలులో రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం వీరిరువురి మ‌ధ్య అంత‌ర్గ‌త రాజ‌కీయ యుద్ధం జరుగుతోంది. బ‌హిరంగంగా ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించుకున్నారు. వీరి ఆధిపత్య పోరుతో టిడిపికి...

Wednesday, April 25, 2018 - 07:43

విజయవాడ : వైసీపీలోకి వలసల జోష్‌ పెరిగింది. సామాజిక వర్గాల వారీగా పేరున్న నేతలు... వైసీపీ వైపు చూస్తున్నారు. మరోవైపు ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేసుకోవాలని వైసీపీ అధినేత జగన్‌ భావిస్తున్నారు. రానున్న రోజుల్లో బలమైన నాయకులకు రెడ్‌కార్పెట్‌ పరచాలని వైసీపీ డిసైడ్‌ అయ్యింది. రానున్న రోజుల్లో వైసీపీలోకి నేతలు భారీగా వలస వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీల్లోని...

Pages

Don't Miss