కర్నూలు
Sunday, November 5, 2017 - 18:51

కర్నూలు : జిల్లా నంద్యాల కేంద్రంగా పనిచేస్తున్న ఇండోఫిల్‌ ఇండస్ట్రీస్‌ వరిని ఆశించే తెగుళ్ల నివారణకు కొత్త పురుగు మందును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంప్రెషన్‌ పేరుతో తయారు చేసిన ఈ మందును కంపెనీ జనరల్‌ మేనేజర్‌ టీ నారాయణరెడ్డి మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఇండోఫిల్‌ శాస్త్రవేత్తలు ఆరేళ్ల పరిశోధనల ఫలితమే ఇంప్రెషన్‌ అని నారాయణరెడ్డి చెప్పారు. వరి పంటకు సోకే అగ్గి, పొడ తెగుళ్ల...

Sunday, November 5, 2017 - 13:35

కర్నూలు : జిల్లాలోని ఎమ్మిగనూరు పట్టణంలో కూరగాయల మార్కెట్‌లో దళారుల దౌర్జన్యం రోజురోజుకు పెరుగుతోంది. తాము చెప్పిన ధరకే విక్రయించాలని దళారులు డిమాండ్ చేయడంతో.... రైతులు అందుకు ససేమిరా అన్నారు. న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. రైతుల సరుకు కొనేందుకు దళారులు ముందుకు రాకపోవడంతో... మార్కెట్‌  యార్డులో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. అటు కూరగాయలు కొనేందుకు వచ్చిన ప్రజలు కూడా ఇబ్బందులు...

Sunday, November 5, 2017 - 13:24

కర్నూలు : జిల్లాలోని ఎమ్మిగనూరు పట్టణంలో కూరగాయల మార్కెట్‌లో దళారుల దౌర్జన్యం రోజురోజుకు పెరుగుతోంది. తాము చెప్పిన ధరకే విక్రయించాలని దళారులు డిమాండ్ చేయడంతో.... రైతులు అందుకు ససేమిరా అన్నారు. దీంతో మార్కెట్‌  యార్డులో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దీంతో తమకు న్యాయం చేయాలంటూ రైతులు ధర్నాకు దిగారు. 

 

Saturday, November 4, 2017 - 18:31

కర్నూలు : ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే విధానాన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధానాలను తిప్పికొట్టేందుకు నవంబర్‌ 9 నుండి 11 వరకు ఢిల్లీలో పార్లమెంట్‌ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు కార్మిక సంఘాలు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల చట్టాలను కాలరాసే ప్రయత్నం చేస్తుందంటున్న కార్మిక సంఘాల నాయకులతో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

Friday, November 3, 2017 - 18:38

విజయవాడ : జిల్లాల పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్న హామీలు కోటలు దాటుతున్నాయి. అమలు మాత్రం గడప దాటడంలేదు. బడ్జెట్‌లో నిధులు లేకపోయినా... వేల కోట్ల రూపాయల వాగ్దానాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. మూడున్నరేళ్లలో జిల్లాల పర్యటనలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎన్ని వేల కోట్ల రూపాయాలకు చేరుకున్నాయో వింటే ఎవరికైనా గుండె గుబేల్‌ మంటుంది. చంద్రబాబు వాగ్దానాలు అమలు చేయాలంటే 49 వేల కోట్ల...

Friday, November 3, 2017 - 15:20

కర్నూలు : జీవో నంబరు 465 కి వ్యతిరేకంగా జూనియర్‌ డాక్టర్లు కర్నూలులో ఆందోళన చేపట్టారు. కర్నూల్ ప్రభుత్వాస్పత్రి నుంచి భారీగా ర్యాలీ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వైద్యసేవలను ఆర్‌ఎంపీలకు అప్పజెప్పడమంటే ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడమేనని ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో వైద్యుల పోస్టులను భర్తీ చేయాలన్నారు. వారు ఎలాంటి సమస్యలు...

Friday, November 3, 2017 - 09:51

కర్నూలు : జిల్లాలోని బండిఆత్మకూర్ మండలం సింగవరంలో బెల్ట్‌ షాపు నిర్వహిస్తున్నారంటూ దంపతులపై పోలీసులు దాడి చేశారు. తల్లిదండ్రులను కళ్ల ముందే కొట్టడాన్ని చూసి తట్టుకోలేని బాలుడు పురుగులమందు తాగాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. సింగవరానికి చెందిన ధనుంజయ గౌడ్, లక్ష్మీదేవి దంపతులు బెల్టుషాపు నిర్వహిస్తున్నారన్న నెపంతో..  పోలీసులు సోదాలు చేశారు. ఎలాంటి ఆధారాలు దొరకక పోవడంతో.....

Thursday, November 2, 2017 - 08:54

కర్నూలు : పాములపాడులో విషాదం నెలకొంది. ఐదుగురు యువతులు కేసీ కెనాల్ లో కార్తీక స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయారు. స్థానికులు..నలుగురిని స్థానికులు కాపాడారు. మరో యువతి గల్లంతైంది. గల్లంతైన యువతి లావణ్యగా గుర్తించారు. ఆమె కోసం గాలిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Pages

Don't Miss