కర్నూలు
Tuesday, April 11, 2017 - 07:01

కర్నూలు : నంద్యాలలో రాజకీయం వేడెక్కింది. మాజీమంత్రి శిల్పా మోహన్‌రెడ్డి తన నివాసంలో కార్యకర్తలతో రహస్యంగా భేటీ అయ్యారు. నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. టీడీపీ తనకు టికెట్‌ ఇస్తే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ తనకు టికెట్‌ ఇవ్వకుండా భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు ఇస్తే.. టీడీపీని వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీలో చేరి పోటీ...

Monday, April 10, 2017 - 18:43

కర్నూలు : నంద్యాలలో రాజకీయం వేడెక్కుతోంది. నంద్యాల ఎమ్మెల్యే సీటుపై మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డి కన్ను పడింది. మాజీమంత్రి శిల్పా మోహన్‌రెడ్డి తన నివాసంలో కార్యకర్తలతో రహస్యంగా భేటీ అయ్యారు. నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. టీడీపీ టికెట్‌ ఇస్తే పోటీ చేయాలని... ఒకవేళ టికెట్‌ ఇవ్వకపోతే పార్టీ మారే యోచనలో ఉన్నారు. వైసీపీలో చేరి బరిలో...

Saturday, April 1, 2017 - 17:13

కర్నూలు : పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ కర్నూలులో సీపీఎం ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పెంచిన ఛార్జీలతో ప్రజలపై మరింత భారం పడుతుందని ఆరోపించారు. వేలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తయారుచేస్తున్న సోలార్‌ విద్యుత్‌ ఎక్కడికి పోతోందని సర్కారును ప్రశ్నించారు.

Tuesday, March 28, 2017 - 18:35

కర్నూలు : జిల్లాలో ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో పిడకల సమరం ఉత్సాహంగా సాగింది. కొన్నాళ్లుగా ఈ సమరం సంప్రదాయంగా వస్తోంది. వీరభద్ర స్వామి, కాళికాదేవీ ప్రేమ వివాహం సందర్భంగా ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. ఉగాది పండుగ ఒక రోజు ముందు ఇది జరుగుతుంది. పొప్పుల దొడ్డి, చెన్నంపల్లి, అలారుదిన్నె, వెంగళాయదొడ్డి, కారుమంచి, మిల్లెకల్లు గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో...

Sunday, March 26, 2017 - 14:27

కర్నూలు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏపీ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.గఫూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను బలి తీసుకోవడానికే మోటారు వాహనం చట్టానికి సవరణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రవాణా రంగంలో సంస్కరణలు అనే అంశంపై కర్నూలులో సీఐటీయూ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మోటారు రవాణ చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నట్లు, చట్టం రూపుదాల్చితే తీవ్ర...

Sunday, March 26, 2017 - 13:10

కర్నూలు : జిల్లాలోని మంత్రాలయంలో విషాదం చోటుచేసుకుంది. లాడ్జిలో పురుగుల మందుతాగి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పుదుచ్చేరికిచెందిన ఇద్దరు మహిళలు, మరో వ్యక్తి ఈనెల 24 న మంత్రాలయంలోని ఓ లాడ్డిలో 52 వ రూమ్ తీసుకున్నారు. లాడ్జీ సిబ్బంది... ఈరోజు రూమ్ తెరిచి చూశారు. ముగ్గురూ మృతి చెందిన ఉన్నారు. వచ్చిన రోజే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో అన్నాచెల్లెల్లు ఉన్నారు....

Sunday, March 26, 2017 - 11:48

ఎండాకాలం..ఈసారి సూర్యుడు భగభగలాడనున్నాడు. ఫిబ్రవరి నుండే ఎండలు మండిపోతున్నాయి. ఈ భానుడి ప్రతాపం మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాయలసీమ, కోస్తా జిల్లాలో విపరీతమైన ఎండలు ఉండనున్నాయని, సాధారణం కన్నా మూడు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది కొనసాగే అవకాశం ఉందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. శనివారం రాష్ట్రంలోని...

Saturday, March 25, 2017 - 10:54

కర్నూలు : జిల్లాలో దారుణం జరిగింది. దుండగులు వివాహితపై పైశాచిక దాడికి ఒడిగట్టారు. నిద్రిస్తున్న ఓ వివాహిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. జిల్లాలోని ఆలహర్విలో రాత్రి ఇంటిముందు భర్త పక్కల నిద్రిస్తున్న మహిళను పక్కగదిలోకి తీసుకెళ్లి.. నోట్లో బట్టలు కుక్కి, కాళ్లుచేతులు కట్టేసి దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచారం...

Pages

Don't Miss