కర్నూలు
Monday, August 7, 2017 - 21:27

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తి అయ్యింది. నామినేషన్లపై టీడీపీ, వైసీపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. శిల్పామోహన్ రెడ్డి నామినేషన్ పై సంతకం చేసిన నోటరీ లైసెన్స్ ముగిసిందని టీడీపీ ఆరోపించింది. 

 

Monday, August 7, 2017 - 18:58

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. నామినేషన్ల పరిశీలనల సమయంలో వైసీపీ, టీడీపీలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ చెల్లదంటూ.. రిటర్నింగ్‌ అధికారికి టీడీపీ ఫిర్యాదు చేసింది. శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ను నోటరీ చేసిన న్యాయవాది రామతులసీ రెడ్డి సంతకం చెల్లదని,.. ఆయన లైసెన్సు గడువు ముగిసిందని ఫిర్యాదు చేశారు. అలాగే...

Monday, August 7, 2017 - 18:41

కర్నూలు : నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి నామినేషన్‌ చెల్లదని టీడీపీ ఫిర్యాదు చేసింది. జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌ పెట్టలేదని ఫిర్యాదు చేసింది. నామినేషన్‌ నిబంధనల ప్రకారం లేదని ఫిర్యాదు చేశారు.

Monday, August 7, 2017 - 08:11

కర్నూలు : ఇదిగో ఇతని పేరు శ్రీనివాసులు. చేసేది గౌరవప్రదమైన ఉపాధ్యాయవృత్తి. కర్నూలు జిల్లా ఆదోని మండలం పర్వతాపురంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. వచ్చేది మంచి వేతనమే అయినా... ఆ పంతులుగారికి డబ్బు ఆశ తీరలేదు. ఏం చేసైనా ఇంకా డబ్బులు సాధించాలనుకున్నాడు. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు.. అతనే వక్రమార్కం పట్టాడు. డబ్బు...

Sunday, August 6, 2017 - 21:51

కర్నూలు : నంద్యాలలో జగన్‌కి వస్తున్న ప్రజాధరణ చూసీ టీడీపీకి భయం పట్టుకుందని వైసీపీ నేతలు అంటున్నారు. సీఎం చంద్రబాబుపై జగన్‌ విమర్శలను టీడీపీ నేతలు భూతద్దంలోచూస్తున్నారని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్‌ రెడ్డి విమర్శించారు. 

Sunday, August 6, 2017 - 19:10

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక కాక రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలు,  రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వేడి పుట్టిస్తోంది. ఎలాగైనా గెలుపు తీరాలకు చేరాలని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను భారీగా రంగంలోకి దించాయి. మరి ఇంతకీ నంద్యాలలో గెలుపు ఎవరిది? నంద్యాల ప్రజల ఏర్పు ఇవ్వనున్నారు? నంద్యాల నియోజకవర్గ ప్రజలు ఎవరి...

Sunday, August 6, 2017 - 06:46

అమరావతి : నంద్యల ఉపఎన్నికల్లో ఓటమిని ఓర్వలేక జగన్‌ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. బహిరంగ సభలో జగన్‌ వ్యాఖ్యలు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాయన్నారు. జగన్‌ రాజకీయాల్లోకి వస్తే హత్యారాజకీయాలు తప్పవని విమర్శించారు. జగన్‌ ప్రతిపక్ష నాయకుడిలా కాకుండా వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

Saturday, August 5, 2017 - 21:37

కర్నూలు : జగన్‌ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ స్పందించింది. జగన్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఏం జరిగిందో నివేదిక ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్, రిటర్నింగ్‌ అధికారికి ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. జగన్‌కు కర్నూలు జిల్లా కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చినా తప్పులేదన్న వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని...

Pages

Don't Miss