కర్నూలు
Thursday, October 26, 2017 - 19:02

కర్నూలు : కంచ ఐలయ్యపై రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ ఫైర్‌ అయ్యారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి ఐలయ్య తన పుస్తకాలను అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. ఆర్యవైశ్యులు ద్రవిడులు కాదని ఆరోపించడం సరికాదన్నారు. దీనిపై డీఎన్‌ఏ పరీక్షలకి సిద్ధమని.. నువ్వూ సిద్ధమేనా అంటూ సవాల్‌ విసిరారు. 

 

Monday, October 23, 2017 - 11:21

కర్నూలు: జిల్లా నంద్యాలలో ఓ భవనం ఒకేసారి కుప్పకూలింది. రోడ్డు విస్తరణలో ఆ భవనం కొంత కూల్చేశారు. మిగతా భాగం ఈ రోజు కూలింది. ఈ ప్రమాదంలో ప్రాణపాయం తప్పింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Saturday, October 21, 2017 - 21:21

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు అమరవీరులకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. అమరులైన పోలీసులకు నివాళులు అందించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు సంస్మరణ వేడుకల్లో...

Saturday, October 21, 2017 - 10:08

కర్నూలు : జిల్లా డోన్ పట్టణంలో దారుణం జరిగింది. అర్థరాత్రి సమయం రోడ్డు పై వెళ్లుతున్న తాగుబోతులు లో ఓ మొబైల్ షాప్ వద్ద నిద్రిస్తున్న వృద్ధుడిపై దాడి చేసి చితగొట్టి అతని దగ్గర ఉన్న డబ్బులు లాక్కెళ్లారు. రాత్రిపూట పోలీసుల పెట్రోలింగ్ లేకపోవాడమే కారణమని స్థానికులు అంటున్నారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

Thursday, October 19, 2017 - 19:48

కర్నూలు : పట్టణంలో దీపావళిశోభ సంతరించుకుంది. పండుగ సందర్భంగా నగరంలోని ఎస్టీబీసీ కళాశాలలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. టపాకాయలు కొనేందుకు చిన్నారులు, పెద్దలు బారులు తీరారు. మరిన్ని వివరాలకు వీడియో చూడండి.

Tuesday, October 17, 2017 - 21:20

విజయవాడ : కర్నూలు ఎంపీ బుట్టా రేణుక.. జగన్‌ పార్టీకి రాంరాం అన్నారు. ఉండవల్లిలో.. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి.. ఆయనకు మద్దతు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే.. తానీ నిర్ణయం తీసుకున్నట్లు రేణుక తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి కూడా.. ఇదేరోజు.. అనుచరులతో కలిసి.. టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని సీఎం అధికారిక నివాసానికి అనుచరగణంతో చేరుకున్న బుట్టా రేణుక.....

Tuesday, October 17, 2017 - 09:52

కర్నూలు : వరుసగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలేస్తూ పరుగెడుతోంది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. ఇన్ ఫ్లో 2.51, 596 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,80, 518 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 884.10 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. దీంతో అధికారులు ఏడు గేట్లను ఎత్తి... దిగువకు నీటిని విడుదల...

Tuesday, October 17, 2017 - 09:50

కర్నూలు : ఆపదలో వచ్చిన వారికి సరైన వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోని ఘటన కర్నూలు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. చేసేదేమీ లేక ఎమ్మిగనూరు నుంచి వచ్చిన గర్భిణిని మహాలక్ష్మి ఆరు బయటే నొప్పులతో అవస్థలు పడింది. అయినా వైద్య సిబ్బందిలో మార్పు రాలేదు. అయితే.. 10టీవీకి సమాచారం...

Tuesday, October 17, 2017 - 07:17

కర్నూలు : ప్రతిపక్ష నేత జగన్‌ పాదయాత్రకు ముందే వైసీపీకి  తెలుగుదేశం పార్టీ గట్టి షాక్ ఇస్తోంది. ఆ పార్టీ నేతలను సైకిల్ ఎక్కించుకునేందుకు సిద్ధమైంది. దీంతో వైసీపీలో కలవరం మొదలైంది. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకు ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా అనుమానం ఉన్న నేతలపై వైసీపీ అధినేత జగన్ ఆరా తీసినట్లు సమాచారం.
టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్...

Pages

Don't Miss