కర్నూలు
Monday, January 1, 2018 - 21:36

కర్నూలు : జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నెలో దళితులను అగ్రకులస్తులు గ్రామం నుంచి బహిష్కరించారు. వారికి విద్యుత్‌, నీటితోపాటు నిత్యావసరాలపైనా ఆంక్షలు విధించారు. దళితులతో ఎవరు మాట్లాడవద్దని హుకుం జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే 5వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అగ్రకులస్తుల్లో ఒకరు చనిపోతే అంత్యక్రియల ఏర్పాట్లు చేయలేదని ఆరోపిస్తూ దళితులపై కక్ష కట్టారు. దళిత కాలనీకి...

Monday, January 1, 2018 - 14:46
Monday, January 1, 2018 - 13:28

కర్నూలు : ప్రభుత్వాసుపత్రి వైద్యులు తీరుమార్చుకోవడం లేదు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒకరికి అందించాల్సిన వైద్యం మరొకరికి అందించి ఒకరి మృతికి కారణమయ్యారు. అనంతపురం జిల్లా డీ. హీరేహల్‌ మండలం సదం గ్రామానికి చెందిన బీమప్ప రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో కర్నూలు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పూర్తికావడంతో డిశ్చార్జి చేశారు. ఇది మరచిపోయిన వైద్యులు... మహబూబ్‌నగర్‌ జిల్లా ఐజ మండలం...

Monday, January 1, 2018 - 12:50

కర్నూలు : శాస్త్రసాంకేతికపరంగా ఎంత అభివృద్ధి చెందినా దళితులపై వివక్ష, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 60 ఏళ్ల స్వాతంత్య్రంలో దళితులు అడుగడుగునా అవమానాలకు గురవుతూనే ఉన్నారు. అగ్రకులాలు దళితులను అసలు మనుషులుగానే చూడడం లేదు. రోజు రోజుకూ వారి వికృత చేష్టలు మితిమీరిపోతున్నాయి. ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు....

Monday, January 1, 2018 - 08:53

కర్నూలు : న్యూ ఇయర్ లో విషాదం నెలకొంది. జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శిరవేళ్ల మండలం కేంద్రంలో ఆగిఉన్న జేఏబీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

 

 

Friday, December 29, 2017 - 13:54

కర్నూలు : టీడీపీ వ్యూహం ఫలించింది. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీ నుంచి బైరెడ్డి అనుచరుడు నాగిరెడ్డి తప్పుకోవడంతో కేఈ ప్రభాకర్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. 

Wednesday, December 27, 2017 - 12:26

కర్నూలు : జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి ప్రతిపక్ష వైసీపీ వైదొలగడం ఆ పార్టీ దివాలాకోరుతనానికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. టీడీపీ నాయకత్వం కేఈ ప్రభాకర్‌ను అభ్యర్థిగా నిర్ణయించడంతో ఫలితాలు వేరుగా ఉంటాయన్న భయంతోనే వైసీపీ పోటీకి దూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ప్రభావం 2019 ఎన్నికలపై ఉంటుందని కేఈ కృష్ణమూర్తి  చెప్పారు...

Wednesday, December 27, 2017 - 08:16

కర్నూలు : జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల గడువు ముగిసింది. టీడీపీ నుంచి కేఈ ప్రభాకర్‌తో సహా మొత్తం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఎస్పీతో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. వైసీపీ పోటీ నుంచి వైదొలగడంతో ఏకగ్రీవం అవుతుందనుకున్న కర్నూలు ఎమ్మెల్సీ స్థానం ఇండిపెండెంట్ల పోటీతో ఆసక్తికరంగా మారింది. 
బరిలో నలుగురు...

Pages

Don't Miss