కర్నూలు
Monday, February 26, 2018 - 09:41

కర్నూలు : బీజేపీ చేసిన కర్నూలు డిక్లరేషన్‌ను టీడీపీ నేత రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌ స్వాగతించారు. ఇది పేపర్లకే పరిమితం కాకుండా ఆచరణలో అమలు అయితే బాగుంటుందన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా టీజీ మాట్లాడుతూ కేంద్రం రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. కేంద్రం తొలి రాజధానినే ఇంకా పూర్తి చేయలేదని విమర్శించారు....

Monday, February 26, 2018 - 08:37

కర్నూలు : వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. జగన్‌ కుట్రలు, కుతంత్రాల్లో ఎవరూ భాగస్వాములు కావద్దని కోరారు. కేంద్ర నిధులు ఇచ్చి ఉంటే రాష్ట్రం ఇంకా మెరుగైన అభివృద్ధి సాధించేదని తెలిపారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఆఖరి...

Sunday, February 25, 2018 - 20:46

కర్నూలు : 

Saturday, February 24, 2018 - 20:51

కర్నూలు : జిల్లాలోని పత్తికొండలో దారుణం చోటుచేసుకుంది. బ్రతికుండగానే ఓ వృద్ధుడిని శ్మశానంలో వదిలి వెళ్లారు కుటుంబసభ్యులు. వృద్ధుడి రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో భారమని భావించి శ్మశానంలో వదిలేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల కోసం గాలిస్తున్నారు. 

 

Saturday, February 24, 2018 - 09:08

కర్నూలు : జిల్లాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. సి.వి రామన్ జూనియర్ కళాశాలో ఇంటర్ చదువుతున్న నాజీమున్నీసా తోటి విద్యార్థుల ముందు లెక్చరర్ మందలించిందని ఆత్మహత్య చేసుకుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Friday, February 23, 2018 - 18:25

కర్నూలు : ఏపీ రెండో రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని సీమ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలులో బిజెపి ముఖ్య నేతల సమావేశం జరిగింది. 16 డిమాండ్లతో కూడిన రాయలసీమ డిక్లరేషన్ ను సమావేశంలో ఆమోదించారు. రాయలసీమలో అసెంబ్లీ భవనాన్ని నిర్మించి ప్రతి ఏటా కొన్ని సమావేశాలు నిర్వహించాలని, హైకోర్టును కూడా ఏర్పాటు చేయాలని కోరారు. అభివృద్ధిని అమరావతిలో...

Thursday, February 22, 2018 - 15:25

కర్నూలు : జిల్లా మంత్రాలయంలో.. రాఘవేంద్రస్వామి పుట్టినరోజు వేడుకులను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. టీటీడీ అధికారులు.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేడుకల్లో భాగంగా.. రాఘవేంద్ర స్వామి మృతికను, పాదాలను మఠం నలు వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో.. ఏపీ, తమిళనాడు, కర్నాటక నుంచి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

Tuesday, February 20, 2018 - 09:10

కర్నూలు : జిల్లా తుంగభద్ర బ్రిడ్జివద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్ నేషనల్ హైవేపై రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు మునగాలపాడుకు చెందని ప్రసాద్, సుదర్శన్ గా గుర్తించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Monday, February 19, 2018 - 18:12

కర్నూలు : జిల్లా ఆలూరు ఎమ్మార్వో కార్యాలయంలో సస్పెన్షన్ గురైన తశీల్దార్ సూర్యనారాయణ హల్ చల్ చేశారు. 3 వారాల క్రితం సస్పెన్షన్ గురైన సూర్యనారాయణ ఆఫీస్ వచ్చి ఫైల్స్ ఎత్తుకెళ్లెందుకు యత్నించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Friday, February 16, 2018 - 18:39

కర్నూలు : జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో కొన్ని రోజులుగా పురావస్తు శాఖ అధికారుల ఆధ్వర్యంలో తవ్వకాలు  జరుపుతున్నారు. ఈరోజు తవ్వకాల్లో ఆ ప్రాంతంలో పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. అందులో సీతారాముడు, లక్ష్మణుడి విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు రాగిచెంబులు, పళ్లాలు లభ్యమయ్యాయి. జీపీఆర్ స్కానర్ ద్వారా భూమిలో ఇంకా ఏమైనా ఉన్నాయా అని పరిశోధిస్తున్నారు. లభ్యమైన వస్తువులు...

Friday, February 16, 2018 - 17:05

కర్నూలు : జిల్లాలోని కౌతాళం మండలం ఉరకుందలో దారుణం జరిగింది. భార్యను బ్లేడుతో కోసి భర్త కిరాతకంగా హత్య చేశాడు. శివరాత్రి నాడు ఉరుకుంద వీరన్న ఆలయానికి భార్యాభర్తలు కలిసి వచ్చారు. ఆలయానికి చెందిన ట్రస్ట్ రూంలో బస చేశారు. అదే రూంలో భార్యను హతమార్చాడు. మూడురోజులుగా భార్య మృతదేహం అదే రూంలో ఉంచాడు. కొడుకుకి అనుమానం రావడంతో హత్య విషయం వెలుగుచూసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Pages

Don't Miss