కర్నూలు
Saturday, August 29, 2015 - 11:54

హైదరాబాద్ : కర్నూలులో బంద్ ఉధృతమవుతోంది. వైసీపీ చేపడుతున్న బంద్‌కు సీపీఐ, సీపీఎం కూడా పూర్తి మద్దతు ప్రకటించాయి. నగరంలో వినూత్నంగా కబడ్డి ఆడుతూ ..సీపీఎం కార్యకర్తలు నిరసన తెలిపారు.

Tuesday, August 25, 2015 - 09:14

కర్నూలు: ఆళ్లగడ్డ సమీపంలోని చింతకొమ్మదిన్నె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల నుంచి వరిపొట్టుతో వెళ్తున్న లారీ చింతకొమ్మదిన్నె వద్ద టైర్ పంక్చర్ కావడంతో వాహనాన్ని డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపి మరమ్మత్తులు చేపట్టాడు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన లారీ వెనుక నుంచి వచ్చి ఈ వాహానాన్ని ఢీ కొట్టింది. ఈ ఘగనలో...

Wednesday, August 19, 2015 - 12:37

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సు చార్జీలు పెంచాలని ఏపీ ఆర్టీసీ యోచిస్తోంది. సంస్థపై భారాన్ని తగ్గించాలంటే చార్జీలు పెంచకతప్పదని ప్రభుత్వాన్ని విన్నవించుకుంది. చార్జీలు పెంచేందుకు అనుమతినివ్వాలని కోరింది. దీనికి పరిశీలిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీనిచ్చినట్లు తెలుస్తోంది.
భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన కొద్ది రోజుల తరువాత ఆర్టీసీ సంస్థ...

Tuesday, August 18, 2015 - 16:29

కర్నూలు : సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా కార్మికులు చేపట్టనున్న సమ్మె ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామని సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ అన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర కర్నూలు జిల్లాకు చేరుకుంది. కార్మికుల జోలికి వస్తే టీడీపీ, బీజేపీకి గుణపాఠం తప్పదన్న గఫూర్‌.....

Monday, August 17, 2015 - 15:43

కర్నూలు: జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎపి సీఎ చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లాలోని తంగడంచలో ఫుడ్‌ పార్క్, ఓర్వకల్లులో ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం బాబు మాట్లాడారు. కర్నూలు జిల్లాకు రూ. 3 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తుందని సీఎం చెప్పారు.

Friday, August 14, 2015 - 21:07

కర్నూలు: డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ మహిళ చనిపోయిందంటూ కర్నూలులో బాధితులు ఆందోళనకు దిగారు. కర్నూలు విజయదుర్గ కార్డియాలిజీ ఆస్పత్రిలో రామేశ్వరమ్మ అనే మహిళ చికిత్స కోసం చేరింది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆమెను ఆరోగ్యశ్రీ కింద చేర్చుకున్నారు. అయితే 8వ తేదీ నుంచి చికిత్స అందిస్తుండగా ఆమె 13వ తేదీ రాత్రి చనిపోయింది. అయితే చనిపోయిన విషయం తమకు తర్వాతి రోజు ఉదయం 8...

Sunday, August 9, 2015 - 19:41

హైదరాబాద్ : తిరుపతి మునికోటి ఆత్మహత్య.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ప్రజల ఆందోళనను ప్రస్ఫుటం చేస్తోంది. ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకునేంతటి భావోద్వేగం ఒక్క రోజులో వచ్చింది కాదన్నది విశ్లేషకుల భావన. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రానికి ఉన్న ఇబ్బందులు ఏంటి..? కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీ సర్కారుకు ఎదురవుతున్న అవరోధాలు ఏంటి..? ఆంధ్రప్రదేశ్‌...

Sunday, August 9, 2015 - 19:32

హైదరాబాద్ : ఏలికల శుష్క వాగ్దానం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తిరుపతి మునికోటి ఆత్మహత్య.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ప్రజల ఆందోళనను ప్రస్ఫుటం చేస్తోంది. ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకునేంతటి భావోద్వేగం ఒక్క రోజులో వచ్చింది కాదన్నది విశ్లేషకుల భావన. కాంగ్రెస్‌ సంతకాల సేకరణ.. జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు..వామపక్షాల బస్సు యాత్ర.. ఇలా ఎన్నో కార్యక్రమాలు.....

Friday, August 7, 2015 - 15:49

కర్నూలు : ఈనెల 4 న ఆదోనిలో ఓ భర్త తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పింటించిన ఘటనలో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. రంగమ్మ, తాయన్న దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. తన భర్త మద్యానికి బానిస కావడంతో..రంగమ్మ ఓ రోజు తన భర్తను నిలదీసింది. కుటుంబ పోషణలో తనకు సహకరించాలని అడిగింది. దీంతో..ఆగ్రహం చెందిన భర్త కిరోసిన్‌పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలైన...

Sunday, August 2, 2015 - 17:30

కర్నూలు: ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీల కోసం కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటం చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు డిమాండ్‌ చేశారు. ఈవిషయంలో ప్రతిపక్షాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. రాష్ర్టంలో అభివద్ధి వికేంద్రీకరణ జరగాలని... అందుకోసం ఈ నెలలో సీపీఎం ఉద్యమం చేపడుతుందని తెలిపారు.

 

Tuesday, July 28, 2015 - 21:02

కర్నూలు: నగరంలో అత్యాచారానికి గురైన మైనర్ బాలికను మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పరామర్శించారు. బాలికకు రెండు లక్షలు రూపాయలు ఆర్ధికసాయం, అలాగే బాలిక చదువు, వివాహానికి అయ్యే ఖర్చును తామే భరిస్తామన్నారు. అంతేకాకుండా ఆ బాలికను పెళ్లిచేసుకునే భర్తకు కూడా.. టీజీవి గ్రూప్‌లో ఉద్యోగం కల్పించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునారవృతంకాకుండా... ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని,...

Pages

Don't Miss