కర్నూలు
Wednesday, February 14, 2018 - 16:07

కర్నూలు : జిల్లా ఎమ్మిగనూరులో నకిలీ డాక్టర్ గుట్టురట్టైంది. శకుంతల సర్కిల్ లో శ్రీనరహరిక్లీనిక్  పేరుతో నరహరి అనే నకిలీ వైద్యుడు నడుపుతున్నాడు. విద్యార్హత లేకున్నా నరహరిరెడ్డి 20 ఏళ్ల నుంచి వైద్య వృతి కొనసాగిస్తున్నారు. ఇన్ని ఏళ్లకు డాక్టర్ బాగోతాన్ని విజిలెన్స్ అధికారలు బయటపెట్టారు. మరింత సమాచారం కోసం వీడియ క్లిక్ చేయండి. 

Wednesday, February 14, 2018 - 06:45

కర్నూలు : మహా శివరాత్రికి శ్రీశైలం ఆలయం భక్తజన సంద్రంగా మారింది. ఓం నమోః శివాయ నామస్మరణతో శ్రీ గిరి పొంగిపోయింది. భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు నంది వాహనంపై విహరించారు. సాయంత్రం నిర్వహించిన ప్రభోత్సవం అద్యంతం కన్నుల పండువగా సాగింది. పాగాలంకరణతో వరుడైన మల్లన్న కల్యాణోత్సవం అర్ధరాత్రి దాటిన తర్వాత అట్టహాసంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మల్లన్న పాగాలంకరణ ఘట్టాన్ని చూసి...

Monday, February 12, 2018 - 17:10

కర్నూలు : జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. 4వ టౌన్ పోలీస్ స్టేష్ పరిధిలో చోరీలు పెరిగిపోతున్నాయి. వారానికి ఒకసారి దొంగలు హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. కృష్ణా నగర్ లోని ఓ కిరాణా దుకాణంలో ఉన్న రాధా అనే మహిళ మెడలో నుండి బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మరింత...

Sunday, February 11, 2018 - 11:48

కర్నూలు : జిల్లాలోని తుగ్గలిమండలం చెన్నంపల్లి కోటలో తవ్వకాలను అధికారులు నిలిపివేశారు. నాలుగోచోట తవ్వకాల్లో బండరాయి అడ్డుపడటంతో తవ్వకాలు నిలిపివేశారు. 10 అడుగుల లోతులో బండరాయి ఉన్నట్లు జీపీఆర్ స్కానింగ్ ఆధారంగా అధికారులు గుర్తించారు. తిరిగి శివరాత్రి తరువాత అధికారులు తవ్వకాలు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కోటను తవ్వకాలతో పాడు చేస్తున్నారంటూ విమర్శలు...

Sunday, February 11, 2018 - 10:52

కర్నూలు : జిల్లాలోని ప్యాపిలిలో రౌడీషీటర్ దారుణ హత్య గావించారు. రౌడీషీటర్ వెంకటరెడ్డి జాతరకు వెళ్లి వస్తుండగా దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. మధు 2009లో ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్నారు. ఇరువర్గాలు 20 రోజుల క్రితం రాజీపడ్డారు. పాత కక్షలు నేపథ్యంలో మధు హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Saturday, February 10, 2018 - 18:52

కర్నూలు : సీపీఎస్ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కర్నూలులో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో..కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి... ఓపీఎస్ సిస్టమ్ అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కర్నూలు ఉద్యోగ...

Saturday, February 10, 2018 - 08:09

కర్నూలు : గుప్త నిధులంటూ కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో చేపట్టిన తవ్వకాలతో... చరిత్ర ఆనవాళ్లు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిధుల కోసం అధికారులు చేపట్టిన తవ్వకాలలో నిధుల మాటేమోగాని కోటంతా గుంతలమయం అయింది. దీంతో భవిష్యత్‌ తరాలకు చరిత్ర తెలియకుండా పోయే పరిస్థితి నెలకొంది. 

 

Friday, February 9, 2018 - 09:35

కర్నూలు : ప్రైవేట్ కాలేజీలో ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. కాలేజీ యాజమాన్యాలు డబ్బులే పరమావధిగా భావిస్తున్నారు. ఫీజుల పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రైవేట్ కాలేజీ ధన దాహానికి విద్యార్థులు బలవుతున్నారు. తాజాగా కర్నూలులో ఫీజుల జులుంకి బీటెక్ విద్యార్ధిని ప్రశాంతి బలైంది. ప్రశాంతి కర్నూలులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్‌ రెండో సంవత్సరం...

Pages

Don't Miss