కర్నూలు
Sunday, May 22, 2016 - 15:01

కర్నూలు : జిల్లాలోని రాజోలీబండ డైవర్షన్‌ స్కీం (ఆర్డీఎస్) వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్డీఎస్‌ ఆధునీకరణ పనులను వ్యతిరేకిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్కీం వద్ద వంటావార్పు లాంటి నిరసన చర్యలు చేపట్టారు. ఆర్డీఎస్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 

 

Sunday, May 22, 2016 - 06:45

విజయవాడ : ఏపీలో నామినేటెడ్‌ పదవుల భర్తీ ఆలస్యంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండెళ్లైనా.. పదవులు భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడుతున్నారు. ఇదిలావుంటే ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఆలోచిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. అసలు నామినేటెడ్‌ పదవుల భర్తీపై సర్కార్‌ ఏం ఆలోచిస్తోంది ? ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా.. ఇంకా...

Sunday, May 22, 2016 - 06:41

విజయవాడ : ఏపీ ఎంసెట్-2016 అగ్రికల్చరల్‌ అండ్‌ మెడికల్‌ ఫలితాలను విజయవాడలో సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఎంసెట్ టాప్-10 ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులను సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా, కామినేని, ప్రత్తిపాటి, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు ప్రయత్నం...

Saturday, May 21, 2016 - 14:56

కర్నూలు : ఎంసెట్ మెడికల్‌ ఎంట్రన్స్‌పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన హేమలత టాప్ ర్యాంకు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది. అధ్యాపకులు, తల్లి దండ్రుల సహకారంతోనే కష్టపడి చదివి మెడిసిన్‌లో మొదటి ర్యాంకు సాధ్యం అయ్యిందని హేమలత తెలిపారు.

Saturday, May 21, 2016 - 08:29

కర్నూలు : ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 గుడిసెలు దగ్ధమవగా, నాలుగు సిలిండర్లు పేలాయి. సుమారు 10 లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది. 

Wednesday, May 18, 2016 - 15:35

కర్నూలు : టీసర్కార్ చేపడుతున్న ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు అడ్డుకోలేకపోతున్నాడని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తెలంగాణ సర్కారు కడుతున్న సాగునీటి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కర్నూలులో జగన్ మూడు రోజులపాటు జలదీక్ష చేశారు. ఈరోజుతో దీక్ష ముగిసింది. రైతులు జగన్ కు నిమ్మరసం త్రాగించి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ టీసర్కారు నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టుల...

Tuesday, May 17, 2016 - 06:54

హైదరాబాద్ : టిఆర్ఎస్ తో అంతర్గత ఒప్పందం కుదుర్చుకుంద‌నే విమర్శలకు చెక్ పెట్టేందుకు జగన్‌ ప్రయత్నం చేస్తున్నారు . తెలంగాణా ప్రాజెక్టుల‌కు వ్యతిరేకంగా క‌ర్నూల్ లో చేస్తున్న జలదీక్షలో తొలిసారిగా కేసీఆర్ పై జ‌గ‌న్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎంను హిట్లర్‌తో పోల్చుతూ ఘాటైన విమర్శలు చేశారు.

టీర్ఎస్ నేత‌లు...

Monday, May 16, 2016 - 22:10

కర్నూలు : ఆళ్లగడ్డ మండలంలో దారుణం జరిగింది. ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. సదరు మహిళ పరిస్థితి విషమంగా వుండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాజు అనే వ్యక్తి గత తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కొంతకాలంగా మహిళపై ఒత్తిడి తీసుకొస్తున్నాడని సమాచారం. దీన్ని వ్యతిరేకిస్తున్న మహిళపై రాజు కక్ష పెంచుకున్నాడు...

Monday, May 16, 2016 - 12:38

కర్నూలు :కృష్ణా,గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా బతకాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను వైసీపీ అధినేత జగన్‌మ్మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. ఎన్ని ప్రాజెక్టులకు అనుమతి సాధించారో కేసీఆర్ తెలపాలని డిమాండ్ చేశారు. టీ సర్కార్ చేపడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మూడు రోజుల పాటు జగన్ చేపట్టిన దీక్ష కర్నూలులో ప్రారంభమైంది. తెలంగాణ...

Sunday, May 15, 2016 - 18:23

కర్నూలు : వైఎస్సార్సీపి అధినేత వైఎస్‌ జగన్‌ మరో దీక్షకు సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా క‌ర్నూల్‌లో రేపటి నుంచి మూడు రోజుల పాటు జ‌లదీక్షకు సిద్ధమయ్యారు జగ‌న్. ఇప్పటికే దీక్షకు సంబంధించి అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయి. జల దీక్ష ద్వారా..అనుమ‌తులు లేని తెలంగాణ ప్రాజెక్టుల‌పై చర్యలు తీసుకునేలా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువ‌స్తామంటున్నారు వైసిపి నేత‌లు. తెలంగాణలో...

Sunday, May 15, 2016 - 14:12

గుంటూరు : లక్ష్మీనగర్ లో మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటనలో నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్క్ సూపర్ వైజర్ సాంబశివరావు, మేస్త్రీ యుగంధర్, కాంట్రాక్టర్ వినోద్ కుమార్  లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పట్టాభిపురం పోలీసు స్టేషన్ కు తరలించారు. లక్ష్మీపురంలోని హరిహర మహల్  సెంటర్‌లో కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా సెల్లార్ తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. ఈ...

Pages

Don't Miss