కర్నూలు
Sunday, November 29, 2015 - 17:47

కర్నూలు : జిల్లాలోని ఆత్మకూరులో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌ విద్యార్ధిపై విరుచుకుపడ్డాడు. ప్రగతి ప్రైవేట్‌ స్కూల్‌ స్టడీ అవర్‌లో 10వ తరగతి విద్యార్ధి వినోద్‌కుమార్‌ను సాయికిరణ్‌ అనే టీచర్‌ చితకబాదాడు. దెబ్బలకు తాళలేక విద్యార్ధి స్పృహ తప్పిపోయాడు. తోటి విద్యార్ధులు వినోద్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరోవైపు విద్యార్ధి సిగరేట్‌ తాగడం వల్లే మందలిచ్చామని పాఠశాల యాజమాన్యం చెబుతోంది...

Saturday, November 28, 2015 - 20:56

కర్నూలు : జిల్లాలోని అవుకు మండలం చెర్లపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ-వైసీపరీ వర్గీయులు పరస్పరం వేటకొడవళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. 

 

Saturday, November 28, 2015 - 17:43

కర్నూలు : ఆత్మకూర్ సమీపంలోని నల్లమల అడవుల్లో పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వాహనంలో ఉంచిన 1260 జిలిటెన్ స్టిక్స్, 30 బ్యాగుల అమ్మోనియం నైట్రైట్, 1650 డిటోనేటర్లు, 1200 మీటర్ల ఫీజు వైర్ ను స్వాధీనం చేసుకున్నారు. వాహనం డ్రైవర్, క్లీనర్లను అరెస్ట్ చేశారు. 

Friday, November 27, 2015 - 16:39

కర్నూలు : జిల్లాలోని బనగానపల్లె విద్యుత్‌ శాఖ అధికారి లంచం పుచ్చుకుంటూ ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. విద్యుత్‌ శాఖ ఎడిఈ గా పనిచేస్తున్న సుధాకరాచారి గత రెండేళ్లుగా లంచాలు తీసుకుంటూ రైతులు, వ్యాపారవేత్తలను హింసిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు నెలలుగా కాంట్రాక్టర్‌ కిషోర్‌ను పెండింగ్ బిల్లుల విషయంలో వేధిస్తున్నారు. దీంతో ఆయన ఎసిబి అధికారులను ఆశ్రయించగా...

Monday, November 23, 2015 - 18:52

కర్నూలు : జిల్లాలోని ఆదోనిలో చెయిన్‌ స్నాచర్లు పెట్రేగిపోతున్నారు. పట్టణంలోని తిరుమలనగర్‌లో నివాసముంటున్న నారాయణమ్మ అనే మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసును చెయిన్‌ స్నాచర్లు తెంపుకుపోయారు. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై వచ్చి ఈ ఘటనకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న త్రీ టౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. త్రీటౌన్‌ పరిధిలో పదమూడు రోజుల...

Friday, November 20, 2015 - 16:47

కర్నూలు : జిల్లాలోని ఆదోనిలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆర్ డీఓ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమతో భారీగా పనిచేయించుకుంటూ అతి తక్కువ జీతాలిస్తున్నారని ఆరోపించారు. ఈ ధర్నాకు సిఐటియు మద్దతు ప్రకటించింది.

Tuesday, November 17, 2015 - 09:53

కర్నూలు : జిల్లాలోని నంద్యాల మండలం చాకిరేవులలో దారుణం జరిగింది. భార్య కాపురానికి రావడం లేదని అత్తింటివారిపై భర్త కత్తితో దాడి చేశాడు. ఈదాడిలో భార్య మహాలక్ష్మి, మామ సుబ్బరాయుడు, అత్త సుంకమ్మ, బావమరిది నాగరాజు, కొడుకు సురేష్‌కు గాయాలయ్యాయి. ప్రతిదాడిలో బావ నాగశేషును బావమరిది నాగరాజు కొట్టి చంపాడు.

 

Wednesday, November 11, 2015 - 21:26

విజయవాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రిజర్యాయర్లకు నీరు వచ్చి చేరుతోంది. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. తిరుమల జలాశయాల్లోకి భారీగా నీరు చేరింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత మూడు రోజులుగా నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలో భారీ...

Wednesday, November 11, 2015 - 16:18

కర్నూలు : జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరం వద్ద హంద్రీనీవా కాల్వకు భారీ గండిపడింది. దీనితో వరదనీరు గ్రామంలోకి ప్రవేశించింది. నీటి ఉధృతికి పంట పొలాలు మునిగిపోగా..పలు జంతువులు కొట్టుకపోయాయి. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత గ్రామ ప్రజలు అధికారులకు విషయం చెప్పారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి కాల్వ గండిపడిన ప్రాంతాన్ని సందర్శించారు. రెవెన్యూ సిబ్బంది పంటల నష్టాన్ని...

Tuesday, November 10, 2015 - 21:27

కడప/ అనంతపురం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించారు. కడపలో గండికోట రిజర్వాయర్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్టరల్లో సమీక్ష నిర్వహించారు. కొన్ని ప్రాజెక్ట్‌ల నిర్మాణం నత్తనడకన సాగుతున్న విషయాన్ని గమనించిన చంద్రబాబు... సంబంధిత అధికారులు,...

Monday, November 9, 2015 - 19:56

కర్నూలు : ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు ఓర్వకల్లు దగ్గర 120 ఎకరాలలో 20 కోట్లతో ఉర్దూ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీ పేరును అబ్దుల్ హక్ గా నామకరణం చేశారు. ఓర్వకల్లులో 900 ఎకరాలలో ఎడ్యుకేషన్ హబ్ ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు....

Pages

Don't Miss