మహబూబ్-నగర్
Thursday, July 19, 2018 - 19:40

మహబూబ్ నగర్ : కృష్ణానది ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు జలకళను సంతరించుకున్నాయి. ఆల్మట్టి పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 113.40 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు కూడా దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల రిజర్వాయర్‌కు వరద నీరు పోటెత్తుతోంది. జూరాల ఇన్‌ఫ్లో 65 వేల క్యూసెక్కులు...

Wednesday, July 18, 2018 - 19:33

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని జడ్చర్ల ఎస్సీ వసతి గృహంలో విద్యార్థులు తినే అల్పాహారంలో ఎలుక వచ్చింది. ప్లేట్‌లో ఎలుక కనబడటంతో ఒక్కసారిగా విద్యార్థులందరూ భయాందోళనకు గురయ్యారు. అల్పాహారాన్నంతా పారేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎంఈవో మంజుల హాస్టల్‌కు చేరుకొని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్‌ పరిసరాలను పరిశీలించారు. 

Monday, July 16, 2018 - 21:15

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటోంది. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలుప్రాంతాల్లో జనజీవనం స్ధంబించింది. కాగా ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల ఒక...

Thursday, July 12, 2018 - 21:15

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ, ఏపీలో గాలి వానకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నారుమళ్లలో నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. రాత్రి నుంచి ఏకధాటిగా...

Wednesday, July 11, 2018 - 14:16

మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశ పెట్టిన పలు పథకాలు అక్రమార్కులకు వరంగా మారిపోయాయి. భూ రిజిష్ట్రార్ ల పేరిట ఓ ఎమ్మార్వో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తపేటలో చోటు చేసుకుంది. కొత్తపేట వద్ద సర్వే నెంబర్ లో భూ వివాదం నెలకొంది. ఈ వివాదం పరిష్కారించాలంటే రూ. 1.50 వేలు ఇవ్వాలని రియల్టర్ ను ఎమ్మార్వో డిమాండ్ చేశాడు. దీనితో సంబంధిత...

Wednesday, July 11, 2018 - 13:49

మహబూబ్ నగర్ : అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. కొత్తకోట తహసీల్దార్ ఏసీబీకి చిక్కాడు. రూ.150000 లంచం తీసుకుంటూ ఎమ్మార్వో మల్లికార్జున్ రావు ఏసీబీకి పట్టుబడ్డాడు. 

Saturday, July 7, 2018 - 21:39

మహబూబ్ నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలమూరుకు చాలా అన్యాయం జరిగిందన్నారు. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. దివిటిపల్లిలో ఐటీ పార్క్‌ నిర్మాణానికి శంకుస్థాపన...

Saturday, July 7, 2018 - 15:59

మహబూబ్ నరగ్ : తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటి నుండి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్నామన్నారు మంత్రి కేటీఆర్‌. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంత్రి  పర్యటించారు. పాలమూరులో ఐటీ టవర్‌ నిర్మాణాని 50 కోట్లు విడుదల చేస్తామన్నారు. జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు పోతామన్నారు. 

Saturday, July 7, 2018 - 09:12

మహబూబ్ నగర్ : తొలకరి చినుకులతో విత్తనాలు వేసుకున్న ఆ అన్నదాతలకు ఇప్పుడు కష్టకాలం వచ్చిపడింది. వచ్చిన మొలకలు ఎండిపోతుండటం చూసి తల్లడిల్లిపోతున్నారు. ఆకాశంవైపు చూస్తూ దిగాలుపడుతున్నారు. కరుణించు వరుణుడా అంటూ పూజలు చేస్తున్నారు. వాన జాడ లేకపోవటంతో బాధపడుతున్న పాలమూరు రైతన్నలపై టెన్‌టీవీ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ఆరంభంలో.. తొలకరి చినుకల రాకతో...

Wednesday, June 27, 2018 - 21:16

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను...

Sunday, June 24, 2018 - 12:56

హైదరాబాద్ : రాష్ర్టవ్యాప్తంగా వేబ్రిడ్జీలపై తెలంగాణ తూనికలు, కొలతల శాఖ మెరుపు దాడి చేసింది. వేబ్రిడ్జీల్లో మోసాలపై అందిన ఫిర్యాదుల మేరకు అ ధికారులు తనిఖీలు హించారు. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జీలను సీజ్‌ చేశారు. తూనికలు, కొలతల శాఖ రాష్ర్ట వ్యాప్తంగా వేబ్రిడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జీలను సీజ్‌ చేశారు.రీజనల్‌...

Pages

Don't Miss