మహబూబ్-నగర్
Thursday, December 1, 2016 - 08:40

మహబూబ్ నగర్ : ఫేస్‌బుక్‌లో కిడ్నీల వ్యాపారం మొదలుపెట్టాడో మోసగాడు..దీనికి దానం చేస్తున్నామంటూ బిల్డప్ ఇచ్చాడు..అమాయకులను బుట్టలో వేసుకుని వారి కిడ్నీలను లక్షలకు విక్రయించేందుకు బేరం పెట్టాడు..ఇలా పాలమూరు కుర్రాడు లైన్లోకి రాగానే ఆశలు పెట్టి మోసం చేయబోయాడు. చివరకు దొరికిపోయాడు.
కిడ్నీ దానం చేసేవారితో చాటింగ్‌...
ఇతనే ఆ నకిలీ డాక్టర్‌ హనీఫ్‌షాన్......

Wednesday, November 30, 2016 - 21:56

మహబూబ్ నగర్ : రైతుల కోసం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 790 కోట్ల రూపాయల ఇన్‌పుట్‌ సబ్సిడీని వెంటనే రైతులకు చెల్లించాలని టీ టీడీపీ వర్కింగ్ ప్రెసెండెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గిలో రేవంత్ చేపట్టిన రైతు పోరుబాట యాత్ర ముగింపు సభ జరిగింది. సభకు ప్రజలు భారీగా హాజరయ్యారు. ఈ సభలో సీఎం కేసీఆర్‌పై రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు...

Wednesday, November 30, 2016 - 19:42

మహబూబ్ నగర్ : తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సిద్ధంగా వుండాలని టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  పిలుపునిచ్చారు. రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని తీవ్రంగా విమర్శించారు. టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర ఈరోజుతో ముంగిపు దశకు చేరుకుంది.  ఈ సందర్భంగా కోస్గిలో టీ.టీడీపీ బహిరంగ సభ...

Tuesday, November 29, 2016 - 10:41

మహబూబ్ నగర్ : జడ్చర్ల మండలం మాచారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 44 నంబరు జాతీయ రహదారిపై ఆగి వున్న లారీని ఓ ప్రయివేట్ బస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 15మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఓ మహిళ రోడ్ క్రాస్ చేస్తేన్న నేపథ్యంలో వేగాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవటంతో బస్ లారీని...

Sunday, November 27, 2016 - 13:18

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ రాజకీయ పార్టీలు, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జరిగే భారత్‌ బంద్‌కు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. బంద్‌ సందర్భంగా ధర్నాలు, రాస్తా రోకోలు, రైల్‌ రోకోలు చేయాలని నిర్ణయించాయి. హర్తాళ్‌ను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ ప్రజలు, నేతలు, కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నాయి. ఐదొందలు...

Friday, November 25, 2016 - 06:36

హైదరాబాద్ : పెద్దనొట్ల రద్దు అంశం ఆర్టీసీపై తీవ్ర ప్రభావాన్నిచూపుతోంది. అసలే నష్టాలతో నడుస్తోన్న సంస్ధలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. మోదీ తీసుకున్న నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీలకు అక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. దీంతో ఉహించని రీతిలో ఆర్టీసీలు నష్టాలు చవిచూస్తున్నాయి. 500,1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా...

Thursday, November 24, 2016 - 06:42

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని తేలిపోయింది. రాజ్యసభ సాక్షిగా కేంద్రమంత్రి హన్సరాజ్‌ ప్రకటన చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉన్నప్పటికీ.. డీ-లిమిటేషన్‌ చట్టం ప్రకారం 2026 వరకు సంఖ్య పెంచలేమని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల పెంపు ఉంటుందని ఆశపడుతున్న తెలంగాణ రాజకీయ నేతలపై...

Sunday, November 20, 2016 - 21:26

హైదరాబాద్ : పాత నోట్లు చెల్లవు.. కొత్త నోట్లు అందుబాటులో లేవు. బ్యాంకులు బంద్. ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకుందామంటే.. చాంతాడంత క్యూలైన్లు. పన్నెండు రోజులవుతున్నా.. ఇదే పరిస్థితి. ఇటు.. పెద్ద నోట్లను ఎవరూ తీసుకోకపోవడం..అటు... కొత్త నోట్లకు చిల్లర లభించకపోవడంతో... సామాన్యులు, పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త నోట్ల కోసం జనం ఇంకా ఏటీఎంల ముందు భారీగా...

Sunday, November 20, 2016 - 14:44

వనపర్తి : జిల్లాలో దారుణం జరిగింది. వివాహిత కూతురుతో సహా అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లాకొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన పవిత్రకు శివకుమార్ అనే వ్యక్తితో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వీరికి వైష్ణవి (8నెలలు) చిన్నారి ఉంది. ప్రస్తుతం పవిత్ర మూడు నెలల గర్భిణీ. ఈ నేపథ్యంలో పవిత్ర..చిన్నారి వైష్ణవి మృతేదహాలు చెరువులో...

Pages

Don't Miss