మహబూబ్-నగర్
Saturday, October 7, 2017 - 17:16

మహబుబ్ నగర్ : మంత్రి లక్ష్మారెడ్డికి స్వంత పార్టీనేతల నుంచి చేదు అనుభవం ఎదురైంది. నిన్న జెడ్పీ సమావేశంలో మంత్రి జూపల్లితో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వాగ్వాదం మరిచిపోకముందే మరో మంత్రితో స్థానికనేత గొడవ దిగారు. దామరగిద్ద మండలం క్యాతాన్ పల్లి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో టీఆర్ఎస్ నేత శివకుమార్ తనను వేదికపైకి పిలువలేదని మంత్రితో వాగ్వాదాని దిగాడు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్...

Tuesday, October 3, 2017 - 12:12

మహబూబ్ నగర్ : అభివృద్ధిలో వెనకబడిన జిల్లా ఇప్పుడు ముందంజలో నిలువనుంది. కరువు జిల్లా కాస్త వరాల ఖిల్లాగా మారబోతోంది. పాలమూరు జిల్లాలో ఐటీ కారిడార్, ఇండస్ట్రీయల్ ఏర్పాటుతో జిల్లా రూపురేఖలు మారనున్నాయి. దీంతో తమ కష్టాలు త్వరలోనే తీరబోతున్నాయని.. ఇటు రైతులు, అటు నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో వలసల జిల్లా అంటే మొదటగా గుర్తొచ్చేది పాలమూరు జిల్లా. వరుస కరవులు,...

Saturday, September 30, 2017 - 08:29

మహబూబ్ నగర్ : ఆ క్షేత్రం ఆలయాల నగరం. అక్కడ అడుగుపెడితే చాలు వందల ఏళ్లనాటి ఆధ్యాత్మిక చరిత్ర కళ్లకు కడుతోంది. అద్భుతమైన శిల్ప సంపదతో ఆలయాలు దేదీప్యమానంగా ఆకట్టుకుంటాయి. ఓ వైపు తుంగభద్ర, కృష్ణమ్మల సంగమం...మరోవైపు ఉగ్రరూపంతో దర్శనమిచ్చే అమ్మవారు..ఇంకోవైపు నవబ్రహ్మ ఆలయాలు.. ఆలంపూర్ పట్టణసిగలో మణిముకటమై వెలసిన క్షేత్రమే జోగులాంబ ఆలయం. 

అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా......

Thursday, September 28, 2017 - 07:34

మహబూబ్ నగర్ : జిల్లాలో ఇద్దరు మహిళా ఉద్యోగుల మధ్య ఘర్షణ జరిగింది. బస్సులో ఎక్కిన మహిళా కానిస్టేబుల్‌ టికెట్‌ తీసుకోలేదు... దీంతో ఐడీ కార్డు చూపించాలని కండక్టర్‌ అడిగింది. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగి... పరస్పరం దాడికి దిగారు. ఈ దృశ్యాలన్నీ బస్సులో ఉన్న ఓ ప్రయాణికుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడంతో విషయం బయటకొచ్చింది. 

Tuesday, September 26, 2017 - 12:40

మహబూబ్ నగర్ : జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వరదనీటితో కళకళలాడుతోంది. జలాశయంలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. దీంతో 14 గేట్లు ఎత్తి 77.674 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పవర్‌హౌస్‌ ద్వారా 36 వేల క్యూసెక్కులు, సమాంతర కాల్వలు, లిఫ్ట్‌ల ద్వారా 3.210 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో లక్షా 19 వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో లక్షా...

Monday, September 25, 2017 - 18:37

మహబూబ్ నగర్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనకు రైతులందరూ సహకరించాలని గవర్నర్ నరసింహన్ కోరారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా నాగసాలలో నిర్వహించిన భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. భూరికార్డుల ప్రక్షాళనను గవర్నర్ ప్రత్యక్షంగా పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అధికారులు రైతుల ఇంటికి వచ్చి భూ ప్రక్షాళన చేపడతారని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు....

Monday, September 25, 2017 - 07:17

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు మూడుఎకరాల భూమి కలేనా..? అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే భూములు దక్కనున్నాయా..? దశాబ్దాలుగా కబ్జాలకు గురైనా భూముల లెక్కలు తేలేదన్నడు.. ? సమగ్ర భూసర్వే పేరుతో గులాబీనేతలు జేబులు నింపుకోడానికి ప్లాన్స్‌ వేశారా..? తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తున్న భూ సర్వేపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పై వివాదాలు రాజుకుంటున్నాయి...

Sunday, September 24, 2017 - 10:29

మహబూబ్ నగర్ : జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరుగుతోంది. శనివారం లక్షా 75వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. లక్షా64 వేల 68 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో... శ్రీశైలానికి కూడా వరద ప్రవాహం పెరిగింది. తెలంగాణలోని కల్వకుర్తి ఎత్తిపోతలకు శ్రీశైలం నుంచి 16 వందల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం సాగర్‌ ప్రాజెక్టు కుడి కాలువ రెండు గేట్ల ద్వారా 2 వేల క్యూసెక్కుల...

Wednesday, September 20, 2017 - 19:51

మహబూబ్ నగర్ : ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ జలకలను సంతరించుకుంది. కర్ణాటక, మహారాష్ట్రలలో భారీగా వర్షాలు కురవడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలకు వచ్చి చేరుతోంది. ఈ నీటిని దిగువకు వదలడంతో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వరద ఉధృతి పెరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 అడుగులు కాగా ప్రస్తుతం...

Wednesday, September 20, 2017 - 12:45

Pages

Don't Miss