మహబూబ్-నగర్
Saturday, October 24, 2015 - 12:26

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని వనపర్తి డివిజన్‌ గ్రామాల్లో మొహర్రం ప్రశాంతంగా జరిగింది.. పెద్దగూడెం బురన్‌ దర్గాలో ముస్లింలు మొక్కులు చెల్లించుకున్నారు.. ఇతర మతస్తులు కూడా దర్గాలో ప్రార్థనలు చేశారు.. ఈ గ్రామంలో మొహరం ఉత్సవాలు భారీస్థాయిలో నిర్వహిస్తారు.. ప్రజలు మాళీజా తయారుచేసి బుర్రన్ స్వామికి సమర్పించారు..

 

Saturday, October 24, 2015 - 10:00

మహబూబ్ నగర్ : తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలో నలుగురికి స్వైన్ ఫ్లూ నిర్థారణ అయింది. స్వైన్ ఫ్లూ సోకిన వారిలో ముగ్గురు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులున్నారు. ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, ఆసుపత్రి సిబ్బంది జాగ్రత్తలు తీసుకోకపోవడంతో... వారికి కూడా స్వైన్ ఫ్లూ సోకిందని అధికారులు తెలిపారు. 

Thursday, October 15, 2015 - 16:39

మహబూబ్ నగర్ : జిల్లాలో మరో రైతు తనువు చాలించాడు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కరవు జిల్లాగా పేరుగడించిన మహబూబ్ నగర్ జిల్లాల్లో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మక్కల్ మండలం దాసరదొడ్డి గ్రామానికి చెందిన బాలకిష్టన్న అనే రైతు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతను మూడు ఎకరాల్లో పత్తి..వరి పంట వేశాడు. కానీ...

Thursday, October 15, 2015 - 12:43

మహబూబ్‌నగర్‌ : జడ్చర్లలో శ్రీలక్ష్మి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను ముప్పు తిప్పలు పెడుతోంది.... అర్ధరాత్రి హైవేపై ఈ బస్సు ఆగిపోయింది.. అప్పటినుంచి ప్రయాణికులు రోడ్డుపై పడిగాపులు పడుతున్నారు.. ఈ బస్సు హైదరాబాద్‌నుంచి పొద్దుటూరు వెళుతుండగా మధ్యలో నిలిచిపోయింది.. దీంతో మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు..

Wednesday, October 14, 2015 - 17:33

మహబూబ్ నగర్ : జడ్చర్ల (మం) గొల్లపల్లిలో స్థల వివాద బాధితులకు ఎమ్మెల్యే డీకే అరుణ పరామర్శించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, కనీసం మూడెకరాల భూమివ్వాలని డిమాండ్ చేశారు. గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నేతలు..కార్యకర్తల ఆగడాలు అధికమయ్యాయని ఆరోపించారు. ఇద్దరి చావుకు కారణమైన టీఆర్ఎస్ నేత ఇర్ఫాన్ పై చర్యలు తీసుకోవాలని...

Tuesday, October 13, 2015 - 14:43

మహబూబ్‌నగర్‌ : జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లిలో స్థల వివాదంలో నలుగురు వ్యక్తులు పురుగుల మందు తాగిన ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. రెండు రోజుల క్రితం జడ్చర్లలో టీఆర్‌ఎస్‌ నేత ఇర్ఫాన్‌ ఇంటి ఎదుట ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు పురుగుల మందు తాగారు. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. నిన్న ఇద్దరు చనిపోయారు. ఇవాళ మరో వ్యక్తి చనిపోయాడు...

Monday, October 12, 2015 - 17:48

హైదరాబాద్ : గడీల బతుకమ్మ కాదు బడుగుల బతుకమ్మ ఆడుదామని తెలంగాణ మహిళా,సాంస్కృతిక సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ అంటున్న ఐక్య వేదిక నేతలు బతుకమ్మను కొందరు స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని దుయ్య బట్టారు. బడుగుల బతుకమ్మ ఆడాలనే నినాదంతో తెలంగాణ మహిళా, సాంస్కృతిక సంఘాల ఐక్య వేదిక బతుకమ్మ యాత్రను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని సుందరయ్య పార్క్ నుంచి...

Monday, October 12, 2015 - 15:20

మహబూబ్ నగర్ : జడ్చర్ల మండలం గొల్లపల్లి వాసులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు స్థానికులను చెదరగొట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం భూమి విషయంలో స్థానిక టీఆర్ఎస్ నేత ఇర్ఫాన్ మోసం చేశాడని గొల్లపల్లి ప్రాంతానికి చెందిన వెంకటయ్య తన ముగ్గురు కుమారులతో నేత ఇంటి ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు మృతి...

Monday, October 12, 2015 - 10:39

హైదరాబాద్ : నవమాసాలు మోసిన తల్లి పుట్టిన మూడు నెలలకే బిడ్డను తన పొత్తిళ్లకు దూరం చేసి అనాథగా వదిలేసిన సంఘటన మహబుబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ లో చోటుచేసుకుంది. రోడ్డు ప్రక్కన గుక్కతిప్పకుండా పసికందు ఏడుస్తుండటంతో స్థానికులు గుర్తించారు. పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఐసిడిఎస్‌ అధికారులకు అప్పగించారు. 

Sunday, October 11, 2015 - 13:18

మహబూబ్ నగర్ : భూ వివాదం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. తమకు న్యాయం చేయడం లేదని టీఆర్ఎస్ నేత ఇంటి ఎదుట ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఇందులో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జడ్చర్ల మండలం గొల్లపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే గొల్లపల్లి లో ఓ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని స్థానిక సర్పంచ్...

Sunday, October 11, 2015 - 11:29

మహబూబ్ నగర్ : భూ వివాదంలో టీఆర్ఎస్ నేత తమకు న్యాయం చేయడం లేదని ఓ తండ్రితో నలుగురు కుమారులతో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. జడ్చర్లలోని గొల్లపల్లిలో వెంకటయ్య 416 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. కానీ ఈ స్థలం తమదని పక్కనున్న వారు అభ్యంతరం చెప్పారు. ఇది తాను కొనడం జరిగిందని వెంకటయ్య...

Pages

Don't Miss