మహబూబ్-నగర్
Tuesday, September 15, 2015 - 17:42

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో గుడుంబా నిల్వలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గుడుంబా స్థావరాలపై మెరుపు దాడులు చేస్తూ..నాటుసారా బట్టీలను ధ్వసం చేస్తున్నారు. పాలమూరు వాసుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న గుడుంబాను అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు దాడులు చేస్తున్నారు. మరోవైపు నాటుసారా తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్న పాలమూరు వాసుల్లో చైతన్యం నింపేందుకు సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం...

Sunday, September 13, 2015 - 17:41

మహబూబ్‌నగర్‌ : రైతుల ఆత్మహత్యలు, కరవు పరిస్థితులను టిఆర్‌ఎస్‌ సర్కార్‌ పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జమిస్తాపూర్‌ గ్రామంలో పత్తి చేను ఎండిపోయిందన్న బాధతో పొలంలో ఉరివేసుకుని చనిపోయిన చెన్నమ్మ అనే మహిళా రైతు కుటుంబాన్ని పలువురు జిల్లా పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే పరామర్శించారు. రూ. 20 వేల ఆర్థిక సాయాన్ని...

Sunday, September 13, 2015 - 13:38

మహబూబ్‌నగర్‌ : జిల్లా గద్వాల ఏరియా ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పసికందును అపహరించేందుకు యత్నించిన యువకుడిని స్థానికులు దేహశుద్ధి చేశారు. డెలీవరి కోసం వావిలాల గ్రామానికి వచ్చిన ఓ మహిళ గద్వాల్ ఏరియా ఆసుపత్రికి వచ్చింది. అయితే పసిపిల్లల వార్డులోకి అర్థరాత్రి ఆజాద్‌ అనే వ్యక్తి చొరబడ్డ పుట్టిన పసికందును అపహరించేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన బంధువులు, ఆసుపత్రి సిబ్బంది ఆజాద్‌ను...

Saturday, September 12, 2015 - 17:11

మహబూబ్ నగర్ : తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపరం కొనసాగుతూనే ఉంది. అనునిత్యం ఏదో ఒక చోట అన్నదాత ప్రాణాలు తీసుకుంటున్నాడు. దేశానికి వెన్నెముకైన అన్నదాత నడ్డి విరుగుతోంది. అందరికీ అన్నం పెట్టే రైతన్న తనువు చాలిస్తున్నాడు. గిట్టుబాటు ధర లేక, ఎరువుల ధరలు అధికమవ్వడం, వర్షాభావ పరిస్థితులు, పంట చేతికి రాక, పెట్టిన పెట్టుబడులు రాక, అప్పుల బాధలు తట్టుకోలేక రైతులు బలవన్మరణాలకు...

Saturday, September 12, 2015 - 09:30

మహబూబ్ నగర్ : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. జూరాలకు భారీగా వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో దిగువకు నీరు వదులుతున్నారు. జూరాలకు ఇన్‌ఫ్లో 24 వేల క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 29 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.50 మీటర్లా కాగా ప్రస్తుత నీటిమట్టం 318.15 మీటర్లకు చేరుకుంది. జూరాలలో 5...

Saturday, September 12, 2015 - 06:41

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తాయి.. భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులో వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయంలో 18 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 18వేల 800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి పెడుతున్నారు. ప్రాజెక్టులోని 4 యూనిట్ల ద్వారా 156 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. అటు శ్రీశైలం డ్యాం కూడా నీటితో కళకళాడుతోంది. జూరాల...

Friday, September 11, 2015 - 20:12

మహబూబ్ నగర్ : జిల్లాలోని నాగర్ కర్నూల్ లో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి చెందారు. వర్షం పడుతున్నప్పుడు పొలంలో పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈఘటనలో మరొకరికి గాయాలయ్యాయి.

 

Wednesday, September 9, 2015 - 06:57

మహబూబ్ నగర్ : సినీనటుడు ప్రకాశ్‌రాజ్. ఇప్పుడు వెండతెర మీదనే హీరో కాదు. నిజజీవితంలోనూ...రియల్‌ హీరో అయ్యారు. మహమూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాని చెప్పిన 24 గంటల్లోనే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూట్టారు.

కొండారెడ్డిపల్లిలో పర్యటించిన ప్రకాశ్‌ రాజ్.....

దత్తత గ్రామం...

Tuesday, September 8, 2015 - 20:41

మహబూబ్ నగర్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటి ఎమ్మెల్యేపై దాడి చేసిన... గువ్వల బాలరాజును చైనా టూర్‌కు తీసుకెళ్లడం సిగ్గుచేటన్నారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలకు బుద్ధిచెబుతామని డీకే అరుణ హెచ్చరించారు.

 

Tuesday, September 8, 2015 - 18:53

మహబూబ్ నగర్ : జిల్లాలోని కొండారెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న నటుడు ప్రకాశ్ రాజ్.. ఇవాళ ఆ గ్రామాన్ని సందర్శించారు. జిల్లా కలెక్టర్ శ్రీదేవి, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రకాశ్ రాజ్ మొక్కలు నాటారు. రాబోయే రోజుల్లో వంద గ్రామాలను దత్తత తీసుకునే స్థాయికి కొండారెడ్డి పల్లిని తీర్చిదిద్దుతానని.. ప్రకాశ్ రాజ్ ప్రకటించారు...

Monday, September 7, 2015 - 10:23

హైదరాబాద్ : పాలమూరు జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య వివాదం రాష్ట్రస్థాయిలో రాజకీయ దుమారం రేపుతోంది. వ్యక్తిగత ఘర్షణ కాస్తా ఇప్పుడు రెండు పార్టీల మధ్య ప్రతిష్టగా మారింది. ఇరుపార్టీల నేతలూ ఆరోపణ ప్రత్యారోపణలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బహిరంగంగానే సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా టీఆర్ఎస్‌ నేతలు జూపల్లి, శ్రీనివాస్‌గౌడ్‌లు విపక్షాలపై...

Pages

Don't Miss