మహబూబ్-నగర్
Friday, July 21, 2017 - 17:12

మహబూబ్ నగర్ : ప్రాజెక్ట్‌ జలకలతో నిండుకుండలా మారింది. కానీ రైతులకు మాత్రం కడుపు నిండడం లేదు.. జీవనాధారమైన ప్రాజెక్ట్‌ నుంచి ఈ ఏడాది చుక్కనీరు బయటకు రావడం లేదు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆయకట్టు రైతుల పొలాల్లోకి నీరు పారడం లేదు. దీంతో అన్నదాతలంతా లబోదిబోమంటున్నారు.. పాలమూరు కర్షకుల కడగళ్లపై ప్రత్యేక కథనం. 
రైతుల వరప్రదాయిని జూరాల ప్రాజెక్ట్‌ ...

Thursday, July 20, 2017 - 07:57

ఢిల్లీ : తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థి శ్రీకాంత్‌ ఈనెల 6న కిడ్నాప్‌కు గురయ్యాడు. ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ అతడిని కిడ్నాప్‌ చేశాడు. అతడిని వదిలిపెట్టాలంటే 5కోట్ల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్‌ పెట్టాడు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. శ్రీకాంత్‌గౌడ్‌ కిడ్నాప్‌ కావడంతో ఓలా క్యాబ్‌ యాజమాన్యం 7న ప్రీత్‌విహార్‌ ప్రాంతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు....

Tuesday, July 18, 2017 - 21:44

హైదరాబాద్ : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. వరద ప్రవాహంతో అన్ని జిల్లాల్లో ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. 
జోరుగా..
జోరువానలతో హైదరాబాద్‌లో జనజీవనం అతలాకుతలమవుతోంది. నగరంలోని పలు చెరువుల్లోకి భారీగా...

Monday, July 17, 2017 - 21:23

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభాంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీవర్షాలు దంచికొడుతుండగా .. ఒడిశాలో కురుస్తున్న భారీవర్షాలకు ఉత్తరాంధ్రలోని నదుల్లో వరద ఉధృతి...

Sunday, July 16, 2017 - 07:47

మహబూబ్ నగర్ : తాము చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు పాలకులు వివరించే పనిలో పడ్డారు. పాలమూరు జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌.. జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. అయితే.. కొంతమంది కావాలనే అభివృద్ధి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని... వారికి ప్రజలే బుద్ది చెప్పాలన్నారు. 
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన 
తెలంగాణ...

Saturday, July 15, 2017 - 21:52

మహబూబునగర్ : మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సాహసం చేశారు. రోప్‌వేపై ఒక పక్కనుంచి మరో పక్కకు ప్రయాణించి అందరినీ ఆకట్టుకున్నారు. మంత్రితో పాటుగా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అడ్వంచర్స్‌ చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన అడ్వంచర్‌ పార్క్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రులు- నేతలు ఈ సాహసం చేశారు. 

Saturday, July 15, 2017 - 21:51

మహబూబునగర్ : జిల్లా కేంద్రంలో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో పాలమూరు జిల్లాను ఎంతో అభివృద్ధి చేశామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దంటూ కేటీఆర్ చెప్పారు. 

Saturday, July 15, 2017 - 18:00

మహబూబునగర్ : ప్రతి విద్యార్థికి ఇంటర్‌ దశే కీలకం. విద్యార్థుల ఆశలు, ఆశయాలు ఇంటర్‌ విద్యపైనే ఆధారపడి ఉంటాయి. ఇంటర్‌లో కనబర్చిన ప్రతిభపైనే వారి జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు కూడా మంచి జూనియర్‌ కాలేజీలో తమ పిల్లలను చేర్పిస్తుంటారు. అయితే పాలమూరు జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం విద్యార్ధులపాలిట శాపంగా మారింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తంగా 47 ప్రైవేట్‌ జూనియర్‌...

Saturday, July 15, 2017 - 16:15

మహబూబునగర్ : మంత్రి కేటీఆర్ మహబూబునగర్ పర్యటనలో ఫ్లెక్సీలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల నిషేధం పాటించాలని ఆయన కోరారు. ఇద్దరు టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు దృష్ట్యా ఫ్లెక్సీలన్నిటినీ తొలగించాలని కేటీఆర్ ఆదేశించారు. దీంతో మున్సిపాల్ అధికారులు వెంటనే ఫ్లెక్సీలు తొలగించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Saturday, July 15, 2017 - 13:42

మహబూబ్ నగర్ : పేదవాళ్ల కన్నీళ్లు తుడవడం ... వాళ్ల ముఖాల్లో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా కేసీఆర్‌ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.  తెలంగాణలో 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు.

Thursday, July 13, 2017 - 16:37

మహబూబు నగర్ : ఢిల్లీలో కిడ్నాపైన గద్వాల్‌కు చెందిన శ్రీకాంత్‌ గౌడ్‌ కుటుంబాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ పరామర్శించారు. శ్రీకాంత్‌ ఆచూకీ తెలుసుకునే విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. కిడ్నాప్‌నకు గురై వారం రోజులు గడిచినా కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కిడ్నాపర్ల చెర నుంచి శ్రీకాంత్‌గౌడ్‌కు విముక్తి కల్పించాలని డిమాండ్...

Pages

Don't Miss