మహబూబ్-నగర్
Thursday, February 9, 2017 - 16:57

మహబూబ్ నగర్ : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ప్రాజెక్టు డిజైన్‌ను మార్చి కల్వకుర్తి ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేసేలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. ప్రాజెక్టులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మూడు రోజులుగా జలసాధన రైతు చైతన్య యాత్ర...

Tuesday, January 31, 2017 - 06:46

తిరుమల : అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తూంచర్లకు చెందిన మహాత్మ, వరలక్ష్మిల కుమార్తె నవ్యశ్రీ, కుమారుడు హర్షవర్ధన్‌తో కలసి శనివారం తిరుమల వచ్చారు. గదులు లభించకపోవడంతో మాధవం యాత్రి సదన్‌లోని ఐదో నంబర్‌ హాలులో లాకర్‌ తీసుకున్నారు. రాత్రి శ్రీవారి దర్శనానికి వెళ్లి ఆదివారం ఉదయం 6 గంటలకు తిరిగి యాత్రి సదన్‌కు చేరుకున్నారు. కుటుంబమంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో...

Sunday, January 29, 2017 - 13:12

మహబూబ్‌నగర్‌ : అడ్డాకుల దగ్గర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం డ్రైవర్‌ మృతి చెందాడు. అడ్డాకులు టోల్‌ ప్లాజా దగ్గర ఆగివున్న రెండు బస్సులను వెనుక నుంచి వేగంగా వచ్చిన తమిళనాడుకు చెందిన డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న వోల్వో, హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న గరుడ ప్లస్‌ బస్సులు దెబ్బతిన్నాయి. డీసీఎం డ్రైవర్‌ శశికిరణ్‌...

Saturday, January 21, 2017 - 19:38

భూపాలపల్లి : పాలమూరు జిల్లా..ఈ జిల్లా పేరు వినగానే మనకు వలసలు గుర్తుకొస్తాయి. బ్రతుకుదెరువు కోసం పొట్టచేతపట్టుకొని ఊరుగాని ఊళ్లకు పాలమూరు ప్రజలు వలసలు వెళ్తుంటారు. ఇక గొర్లకాపర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. గొర్రెల పోషణకోసం ఒకటి కాదు రెండు కాదు..వందల కిలోమీటర్ల దూరం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. పాలమూరు జిల్లా నుంచి భూపాలపల్లి జిల్లాకు వలసవచ్చిన గొర్లలకాపర్లు 10 టివితో...

Thursday, January 19, 2017 - 16:46

మహబూబ్ నగర్ : ఏదైనా ఊరు పరిస్థితిని తెలుసుకోవాలంటే ఆ ఊరు చెరువును చూస్తే చాలు.. చెరువు నిండుగా ఉంటే ఊరు సస్యశామలంగా ఉన్నట్లు.. ఇప్పుడు ఇదే సూత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం పాటిస్తోంది. ఇందుకోసం మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలోని చెరువులు జలకళ తెచ్చుకునేలా కృషిచేస్తోంది. 
పాత మహబూబ్‌నగర్ జిల్లా కరవుకు కేరాఫ్ అడ్రస్‌.. 
...

Saturday, January 14, 2017 - 10:52

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో ప్రైవేట్ బస్ బోల్తా పడింది. ఈప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. ఆరెంజ్‌ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 35 మందితో బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తోంది. రాజాపూర్‌ మండలం రంగారెడ్డి గూడ సమీపంలో భారత్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకునేందుకు వెళ్తున్న బెలెరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేక్రమంలో అదుపుతప్పడంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి...

Monday, January 9, 2017 - 18:26

మహబూబ్‌నగర్‌ : 10 టీవీ క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. 10 టీవీ ప్రతినిత్యం ప్రజలపక్షాన పోరాడుతున్న ఛానల్‌ అని శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Monday, January 9, 2017 - 18:12

మహబూబ్ నగర్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించిన వనపర్తి జిల్లా ఇంకా అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉంది. విద్యార్ధులు చదువుకోవడానికి కష్టాలు తప్పడం లేదు. విద్యార్ధులు వాగు,వంకలు దాటాల్సిన పరిస్ధితి. వర్షాకాలంలో పరిస్ధితి మరీ దారుణం..ఈ సమస్యతో భావిభారత పౌరులు చదువులకు దూరమవుతున్నారు.

వనపర్తి జిల్లా శేరుపల్లిలో నిత్యం నరకం
...

Thursday, December 29, 2016 - 15:56

సిద్దిపేట : అసెంబ్లీలో సీపీఎంపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు బాధకరమన్నారు.. సిద్ధిపేట్‌ జిల్లా పార్టీ కార్యదర్శి మల్లారెడ్డి.. 2013 భూసేకరణ చట్టం ఉన్నప్పటికీ మళ్లీ కొత్త చట్టం తేవాల్సిన అవసరం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. ప్రజలను ఇబ్బందిపెట్టేలాఉన్న ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. కేసీఆర్‌ కామెంట్స్‌కు నిరసనగా సిద్ధిపేట్‌ పాత బస్టాండ్‌ దగ్గర పార్టీ...

Friday, December 23, 2016 - 12:50

హైదరాబాద్ : జాతీయ రహదారుల అంశంపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. జాతీయ రహదారుల విషయంలో మహబూబ్ నగర్ కు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో జిల్లాకు ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వలేదని ఆరోపించారు. ఎన్ హెచ్ లపై పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనీ..వీటిపై పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. రహదారుల నిర్మాణంలో తెలంగాణ...

Pages

Don't Miss