మెదక్
Sunday, August 12, 2018 - 21:21

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ తడిసి ముద్దైంది. వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు...

Friday, August 3, 2018 - 06:58

హైదరాబాద్ : గ్రామీణ తెలంగాణలో నూతన శకం ఆరంభమైంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏకకాలంలో 4 వేల 3 వందల 83 కొత్త పంచాయతీలు నేటి నుంచి ఉనికిలోకి వచ్చాయి. పాత పంచాయతీలతో పాటు నూతన పంచాయతీలలో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. ఇంతకాలం ఒక ఊరికి అనుబంధంగా ఉన్న శివారు పల్లెలు, తండాలు, గూడేలకు ఇప్పుడు స్వతంత్ర హోదా దక్కింది. కొత్త పంచాయితీల ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు...

Thursday, August 2, 2018 - 19:45

మెదక్‌ : జిల్లాలోని అల్లదుర్గం మండలం చిల్వర గ్రామంలో విషాదం నెలకొంది. విద్యుత్‌ వైర్లు తెగిపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గీత కార్మికుడు సంగమేశ్వర్‌ గౌడ్‌, మహమ్మద్‌ పాషా పొలంలో పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. హై టెన్షన్‌ వైర్ల ప్రమాదం ఉందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని...

Wednesday, August 1, 2018 - 12:31

మెదక్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమం కాసేపటి క్రితం ఘనంగా ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో ఆయన మొక్కలు నాటారు. ములుగు, గజ్వేల్, సిద్ధిపేటల్లో ఆయన మొక్కలు నాటేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. మసీదు లో సైరన్ మోగడంతో ఒకేసారి లక్ష మొక్కలను నాటేందుకు శ్రీకారం చుట్టారు.

గజ్వేల్‌ మున్సిపాలిటి పరిధిలో...

Wednesday, August 1, 2018 - 11:15

సిద్ధిపేట : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ములుగు, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ లో ఆయన మొక్కలను నాటనున్నారు. మసీదుల్లో సైరన్ మోగిన అనంతరం ఒకేసారి లక్ష మొక్కలను ప్రజలు నాటనున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి పలువురితో ముచ్చటించింది. ములుగు, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ లో కొంతమంది నివాసాల్లో కేసీఆర్ మొక్కలు నాటనున్నారు. తమ నివాసాలు..గ్రామాల్లో...

Wednesday, August 1, 2018 - 10:18

మెదక్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత హరిత హారం కాసేపట్లో ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్, సిద్ధిపేటలో ప్రారంభం కానుంది. ఇందుకు అధికారులు మొక్కలను సిద్ధం చేశారు. ఒకేసారి లక్ష మొక్కల కార్యక్రమం జరుగనుంది. ములుగు మండలంలో మొదటి మొక్కను నాటిన అనంతరం రెండో మొక్కను ప్రజ్ఞాపూర్ లోని కూర నాగరాజు ఇంట్లో సీఎం కేసీఆర్ మొక్కను నాటనున్నారు. అనంతరం గజ్వేల్ లో...

Wednesday, August 1, 2018 - 09:16

మెదక్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'హరితహారం' నాలుగో విడుత కార్యక్రమం జరుగనుంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో ఈ కార్యక్రమం జరుగనుంది. ములుగు, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ లో మొక్కలు నాటనున్నారు. ఒకే రోజు లక్ష మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

గజ్వేల్‌ ప్రజలందరూ మొక్కలు నాటే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రచార...

Sunday, July 29, 2018 - 19:58

ఉమ్మడి మెదక్‌ : జిల్లాలో జాతీయ రహదారుల వెంట ఉన్న దాబాలు... బార్‌ అండ్‌ రెస్టారెంట్లుగా మారిపోతున్నాయి. ఇరవై నాలుగు గంటలు మద్యం అందుబాటులో ఉండటంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఎక్సైజ్‌ శాఖ కూడా మొక్కుబడి తనిఖీలతో కాలం వెళ్లదీస్తోంది. దాబాలలో విచ్చలవిడిగా కొనసాగుతున్న మద్యం అమ్మకాలపై స్పెషల్ స్టోరీ. 

ఉమ్మడి మెదక్‌ జిల్లా జాతీయ రహదారుల వెంట ఉన్న వందలాది దాబాలలో మద్యం...

Friday, July 27, 2018 - 06:38

హైదరాబాద్ : రాహుల్‌ ప్రధాని కావాలంటే.. తెలంగాణలో ఎంపీ స్థానాలు కీలకంగా మారనున్నాయి. గత ఎన్నికల్లో రెండు ఎంపీలను గెలిచిన హస్తం నేతలు... ఈసారి పరిస్థితి తమకు అనుకూలంగా ఉందంటున్నారు. ఇదే ఊపుతో దూసుకుపోతున్న హస్తం నేతలు... మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కించుకుంటామంటున్నారు. అయితే కాంగ్రెస్‌ నేతలు చెబుతున్న దాంట్లో ఎంతమేరకు వాస్తవం ఉంది ? 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి...

Pages

Don't Miss