మెదక్
Wednesday, June 27, 2018 - 21:16

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను...

Wednesday, June 20, 2018 - 07:23

మెదక్ : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గంజాయి దందా యధేచ్చగా సాగుతోంది. యువతను, విద్యార్థులే లక్ష్యంగా స్మగ్లర్లు గంజాయిని విక్రయిస్తున్నారు. గంజాయి దందాను అరికట్టాల్సిన అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో విచ్చలవిడిగా కొనసాగుతోన్న గంజాయి దందాపై స్పెషల్‌ స్టోరీ..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గంజాయి మాఫియా చెలరేగిపోతోంది. అక్రమంగా గంజాయి విక్రయిస్తూ...

Saturday, June 2, 2018 - 21:05

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో...

Monday, May 28, 2018 - 12:32

సంగారెడ్డి : జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని జిల్లా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన నిరహార దీక్షకు కూర్చొన్నారు. దీక్ష ప్రాంగణానికి భారీగా కార్యకర్తలు..తరలి వచ్చారు. మూడు రోజుల పాటు రిలే నిరహార దీక్ష చేయనున్నారు. గతంలో తాను మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో స్పందించాలని పేర్కొన్నారు. మూడు...

Sunday, May 27, 2018 - 06:36

సిద్దిపేట : జిల్లా ప్రజ్ఞాపూర్‌లో ఓ లారీ సృష్టించిన బీభత్సంలో 12 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిశాయి. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో నవతెలంగాణ రిపోర్టర్‌ లక్ష్మణ్‌ ఉన్నారు. అతని కుటుంబానికి చెందిన 8 మంది మృతిచెందడంతో పెద్దమ్మగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న మరో నలుగురూ మృతి చెందారు. సురభి దయాకర్‌రావుఫార్మసీ కళాశాల దగ్గర జరిగిన ఈ ప్రమాదం...

Monday, May 14, 2018 - 06:24

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అన్నదాతలకు చెక్‌లతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగిన రైతుబంధు చెక్కుల...

Sunday, May 13, 2018 - 20:10

మెదక్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వేష్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు క్రింద పడి మృతి చెందాడు. మృతుడి ఒంటిపై నిక్కరు ఉంది. కర్ర, ఓ ప్లాస్టిక్ సంచిలో బట్టలు రైలు పట్టాల వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కామారెడ్డి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Sunday, May 13, 2018 - 16:35

మెదక్ : రైతులను బతికియ్యాలని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలో రైదు బంధు పథకం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఐదు జిల్లాలకు నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. శ్రీరాంసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి మొత్తం 40 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరు అందిస్తామని చెప్పారు. కోమటూరు చెరువును కూడా నింపుతామని తెలిపారు. వచ్చే...

Thursday, May 10, 2018 - 06:36

మెదక్ : ఎన్నికల ఏడాదిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నదాతలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. రైతుబంధు పథకం కింది పెట్టుబడి సాయం అందిస్తున్న కేసీఆర్‌.. ఇప్పుడు నీటి తీరువా బకాయిలు రద్దు చేశారు. భవిష్యత్‌లో అన్నదాతల నుంచి నీటి తీరువా వసూళ్లు ఉండవని మెదక్‌ సభలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7 నుంచి 8 వందలకోట్ల రూపాయల నీటి తీరువా బకాయిలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన కేసీఆర్‌.. ఇకపై...

Pages

Don't Miss