మెదక్
Tuesday, November 14, 2017 - 18:14

సంగారెడ్డి : డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌ రెడ్డి జిల్లా కార్యాలయంలో సహకార సంఘం వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. వారం రోజుల పాటు ఈ వారోత్సవాలు జరగుతాయని చైర్మన్‌ దేవేందర్‌ రెడ్డి తెలిపారు. దీంతో పాటు సహకార సంఘ సభ్యులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ సదస్సులో సహకార సంఘ పటిష్టతకు తీసుకునే చర్యలను సభ్యులందరికీ వివరిస్తామన్నారు...

Wednesday, November 8, 2017 - 10:23

సంగారెడ్డి : జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపేశారు. విషయం తెలుసుకున్న అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జిల్లాలోని హత్నూర (మం) రొయ్యల పల్లిలో గొల్ల మహేష్ అనే వ్యక్తిని ముగ్గురు దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం నిందితులు పీఎస్ లో లొంగిపోయారు. వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. 

Tuesday, November 7, 2017 - 15:46

మెదక్ : సింగూరు జలాలను శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కి తరలించ వద్దంటూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సింగూరు డ్యాంని ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు. సింగూరు నీటిని తీసుకెళ్లడమంటే జిల్లా ప్రజలన్ని మోసం చేయడమే అని సంగారెడ్డి జిల్లా సీపీఎం నేతలు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా సింగూరు జలాల విషయం లేవనెత్తితే స్థానిక ఎమ్మెల్యేలు చర్చించక పోవడం దారుణమన్నారు. డ్యాం ముట్టడికి ప్రయత్నించిన నేతలను...

Monday, November 6, 2017 - 17:30

మెదక్ : సింగూరు డ్యామ్ 15 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్ కు విడుదల చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. అందులో కొన్ని టీఎంసీల నీటిని ఇప్పటికే విడుదల చేసింది. సింగూర్ ప్రాజెక్టు స్టోరేజ్ 29 టీఎంసీలగా ఉందనే విషయం తెలిసిందే. దీనిపై టి.కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద టి.కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి..కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ...

Monday, November 6, 2017 - 17:29

సంగారెడ్డి : అమీన్ పూర్ వందనపురి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అరవింద క్లాసిక్ అపార్ట్ మెంట్ లో పక్క ప్లాట్ లో ఉన్న వారిపై ఓ వ్యక్తి కెమికల్ ప్రయోగం చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు..ఒక బాబుకు గాయాలయ్యాయి.

అపార్ట్ మెంట్ లో నరసింహరావు సోసైటీ ప్రెసిడెంట్ గా ఉండేవాడు. ఇటీవలే ఓ వివాదంలో నరసింహరావు ప్రెసిడెంట్ నుండి తొలగించారు. దీనితో అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ఓ...

Sunday, November 5, 2017 - 18:11

మెదక్ : ఎన్ని సంఘటనలు జరుగుతున్నా ఇంకా ప్రజల్లో మార్పు రావడం లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చెరువులు..నదుల్లోకి దిగొద్దని సూచనలున్నా పలువురు నీటిలోకి దిగి మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఇద్దరు యువతులు నీటిలోకి దిగి కొట్టుకపోయారు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. చిలిపిచేడ్ మండలం మంజీరా నదిలోకి రోహిణి..శ్రీవిద్యలు దిగి కొట్టుకపోయారు. తమ కళ్లెదుటే కొట్టుకపోవడంతో...

Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Pages

Don't Miss