మెదక్
Sunday, November 29, 2015 - 07:15

మెదక్ : చిన్నారి రాకేష్ మృత్యుంజయుడిగా తిరిగి రావాలి..తమ ముద్దుల కొడుకు ప్రాణాలతో రావాలి..ముద్దుముద్దు మాటలు మాట్లాడాలి...అని కోరుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. బోరు బావిలో పడిపోయిన చిన్నారి విగతజీవుడిగా బయటకొచ్చాడు. తమ కొడుకు మృతదేహాన్ని చూసిన కన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి రాకేష్ మృతి చెందాడన్న తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.

...

Sunday, November 29, 2015 - 06:29

మెదక్ : సీపీఎం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలకు సంగారెడ్డి ముస్తాబైంది. వాడవాడలా స్వాగత తోరణాలు, బ్యానర్లు రెపరెపలాడుతున్నాయి. పట్టణమంతా ఎరుపు వర్ణం సంతరించుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సమావేశాలకు వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

ఏచూరి రాక..
ఉదయం జిల్లా పార్టీ...

Sunday, November 29, 2015 - 06:26

మెదక్ : మెదక్‌ జిల్లా. పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండా ఇంకా టెన్షన్ కొనసాగుతోంది. శనివారం ఉదయం బోరుబావిలో పడిన చిన్నారి రాకేష్ బయటకు తీయడానికి ఏర్పాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో స్థానిక అధికారులు కొంత జాగ్రత్తగా ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధునిక యంత్రాలతో కాకుండా మాములు యంత్రాలతో తవ్వకాలు..చర్యలు కొనసాగిస్తున్నారనే పలువురు...

Saturday, November 28, 2015 - 21:22

హైదరాబాద్ : బోరుబావి మళ్లీ నోరు తెరిచింది. మూడేళ్ల బాలుడిని మింగేసింది. బాలున్ని రక్షించేందుకు దాదాపు 12 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ సాగుతోంది. ఆడుకుంటు ఆడుకుంటూ కళ్లెదుటే పాతాళంలోకి పడిపోయిన పిల్లాన్ని తలుచుకుని తల్లిదండ్రుల గుండె తల్లడిల్లుతోంది. ఆ ఊరే కాదు తెలుగు ప్రజలంతా పిల్లాడు సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నారు.
బోర్ బావిలో పడిన బాలుడు
...

Saturday, November 28, 2015 - 19:57

మెదక్ : జిల్లాలోని పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెంలో ప్రమాదవశాత్తు ఓ బాలుడు బోరువావిలో పడిపోయాడు. దాదాపు 33 అడుగుల లోతులో రాకేష్ పడిపోయాడు. బాలుడిని కాపాడేందుకు 9 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోరుబావికి సమాంతరంగా జెసిబిలతో తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వకాలకు అడ్డుగా నిలిచిన బండరాళ్లను తొలగించేందుకు అధికారులు ప్రత్యేకంగా ఐదు యంత్రాలను తీసుకొచ్చారు. అధికారులు, స్థానికులు...

Saturday, November 28, 2015 - 17:38

మెదక్‌ : జిల్లాలోని పుల్కల్‌ మండలంలో బోరుబావిలో పడిపోయిన బాలుడు రాజేష్ ను రక్షించడానికి స్థానికులు, అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. బోరుబావిలోకి ఆక్సిజన్‌ను పంపుతున్నారు. రాజేష్ 33 అడుగుల అడుగుల లోతున ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం బోరుకు సమాంతరంగా తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సమాంతరంగా తవ్వుతున్న క్రమంలో బండలు రావడంతో సహాయక చర్యలకు ఆటంకం కల్గి...

Saturday, November 28, 2015 - 10:35

మెదక్ : ఎన్ని జరిగినా.. ఎంతమంది చనిపోయినా.. మళ్ల అదే తప్పు అందరూ పదే పదే చేస్తున్నారు. పనికిరాని బోరుబావులను మూసేయకుండా చిన్నారులను మింగేసే కొండచిలువల్లా వాటిని తయారు చేస్తున్నారు. మెదక్‌ జిల్లాలో మరో బోరుబావి ప్రమాదం జరిగింది. ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. పుల్కల్‌ మండలం బొమ్మారెడ్డిగూడెంలో ఈ ఘటన జరిగింది. ఆ బాలుడిని వెలికితీసేందుకు స్థానికులు, అధికారులు...

Saturday, November 28, 2015 - 06:42

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చండీయాగం ఏర్పాట్లలో బిజీ అయ్యారు. మెదక్‌ జిల్లాలోని తనసొంత వ్యవసాయం క్షేత్రం ఎర్రవెల్లిలో 30 ఎకరాల్లో చండీయాగం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే చండీయాగం ప్రారంభానికి ముందు చేయాల్సిన ప్రత్యేక పూజలను సీఎం కేసీఆర్‌ దంపతులు నిర్వహించారు. డిసెంబర్‌ 23 నుంచి 30 వరకు నిర్వహించనున్న ఈ యాగానికి దేశవ్యాప్తంగా ఉన్న 4వేల మంది పండితులను...

Thursday, November 26, 2015 - 20:52

మెదక్ : తెలంగాణా సాధించిన పార్టీగా టీఆర్‌ఎస్‌ను వరంగల్‌ ప్రజలు గెలిపించారని సీపీఎం తెలంగాణ రాష్ట్రా కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  అన్నారు. టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఉన్నా.. అది ఓడించే స్థాయిలో లేదని ఆయన అన్నారు. మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో ఈనెల 29,30న జరిగే సీపీఎం విస్త్రతస్థాయి సమావేశాలకు రాష్ట్రవ్యాప్తంగా 200 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తమ్మినేని ప్రకటించారు. 

Wednesday, November 25, 2015 - 16:37

మెదక్‌ : నర్సాపూర్‌ నియోజకవర్గంలో నకిలీ డాక్టర్లు అక్రమదందా మూడు పూవులు ఆరుకాయలుగా సాగుతోంది. గతంలో శిశు విక్రయాలు, గర్భసంచి తొలగింపు ఆపరేషన్లతో అమాయకుల జీవితాలతో ఆడుకుంటే, ఇప్పుడు తాజాగా అపెండిసైటిస్‌ ఆపరేషన్లతో నకిలీలు డబ్బులు కొల్లగొడుతున్నారు. కడుపు నొప్పి అంటూ రోగి ఆశ్రయిస్తే చాలు కత్తులు పట్టుకొని అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ చేసేసి వేలకు వేలు దండుకుంటున్నారు. ముఖ్యంగా అమాయక...

Sunday, November 15, 2015 - 21:29

మెదక్ : రాబోయే నాలుగు నెలల్లో తెలంగాణలో లక్ష ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్లు జారీచేస్తామని మంత్రి హరీష్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో ఏర్పాటైన పోలీస్‌ నియామక ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు పోలీస్‌ నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని అన్నారు. అనంతరం విద్యార్థులకు సిలబస్‌...

Pages

Don't Miss