మెదక్
Tuesday, February 20, 2018 - 18:43

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో బిఎల్ఎఫ్ ఒక్కటే ప్రత్యామ్నాయమని బిఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వెల్లడించారు. బిఎల్ఎఫ్ తొలి బహిరంగసభ సంగారెడ్డిలో జరిగింది. ఈ సభలో తమ్మినేని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు మూసివేస్తున్నారని, అంతకుముందు మూసివేసిన పరిశ్రమలు తెరవలేదన్నారు. ఒక్క కార్మికుడిని కూడా పర్మినెట్ చేయలేదని, 18వేల వేతనం ఎక్కడా అమలు కాలేదన్నారు. రైతాంగానికి రూ. 4వేలు...

Tuesday, February 20, 2018 - 17:26

సంగారెడ్డి : బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తొలి బహిరంగసభ సంగారెడ్డిలో జరుగబోతోంది. ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ లోని ఎస్వీకే వద్ద నుండి తమ్మినేని..బీఎల్ఎఫ్ ఛైర్మన్ నల్లా సూర్యప్రకాశ్..బిఎల్ఎఫ్ నేతలు భారీ ర్యాలీగా సంగారెడ్డికి తరలివెళ్లారు. రామచంద్రాపురంలో సీపీఎం శ్రేణులు నేతలకు ఘన స్వాగతం పలికారు. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా...

Monday, January 29, 2018 - 17:40

మెదక్ : పెట్రోల్‌లో నీరు కలుస్తుందంటూ మెదక్‌ జిల్లా రామాయంపేటలోని పెట్రోల్‌ బంక్‌పై ఎమ్మార్వో, పోలీసులకు వాహనదారులు ఫిర్యాదు చేశారు. ఈ బంక్‌లో పెట్రోల్‌ పోయించుకుని కొద్ది దూరం పోయేసరికి బైక్‌లు ఆగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. పెట్రోల్‌లో నీరు కలవడంతోనే ఈ సమస్య వచ్చిందని మోకానిక్‌ తెలిపారు. దీంతో బాధితులు బంక్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Saturday, January 20, 2018 - 07:36

మెదక్ : జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు బీబీ పాటిల్‌ టెన్‌టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల కేంద్రంలోని వెంకటకాజా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం క్యాలెండర్‌ ఆవిష్కరణ చేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో టెన్‌ టీవీ ఎనలేని కృషి చేస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ర్ట కార్యదర్శి బిక్షపతి, అల్లదుర్గం మాజీ ఎంపీపీ కాశీనాథ్‌, పోతులగూడ...

Wednesday, January 17, 2018 - 15:59

మెదక్ : జిల్లా నర్సాపూర్‌లో బీవీఆర్‌ఐటీ కళాశాల ప్రిన్సిపల్‌ కృష్ణారెడ్డి టెన్‌టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ప్రతినిత్యం ప్రజల పక్షం వహిస్తూ... టెన్‌టీవీ ఎనలేని సేవలందిస్తోందని ఆయన అన్నారు. ప్రజలను చైతన్యవంతం చేసే వార్తలు అందించడంలోనూ ముందుంటోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీజీఎం కాంతారావు, డీన్‌ లక్ష్మీనరసయ్య, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Tuesday, January 16, 2018 - 18:16

మెదక్ : 10TV ప్రజల టీవీ అని అన్నారు జహీరాబాద్ ఎమ్మెల్యే జె.గీతారెడ్డి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఆమె 1OTV క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ... వారి సమస్యలను పాలకుల ముందుకు తెస్తున్న 10టీవీ సిబ్బందికి, 10టీవీ ప్రేక్షకులకు.. గీతారెడ్డి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 

Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Pages

Don't Miss