మెదక్
Sunday, November 1, 2015 - 06:32

హైదరాబాద్ : హకీంపేటలో అర్ధరాత్రి పోలీసులు విరుచుకుపడ్డారు. డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్ నిర్వహించి తడాఖా చూపారు. 18 మంది రౌడీషీటర్లు, 17 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 48 బైక్‌లు, ఐదు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో 500 పోలీసులు పాల్గొన్నారు. మూడు బృందాలుగా ఏర్పడిన దాదాపు 500 మంది పోలీసులు కార్డన్‌సెర్చ్‌తో బెంబెలేత్తించారు.

...

Thursday, October 29, 2015 - 19:46

మెదక్: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్‌ జిల్లా న్యాల్‌కల్‌ మండలంలో చోటు చేసుకుంది. రాజోల గ్రామానికి చెందిన చెరుకు రైతు నాగన్న ప్రైవేటు ఫైనాన్షియర్ల వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకొని బలవన్మరణం పొందాడు. ప్రైవేటు ఫైనాన్స్‌ వద్ద 3 లక్షల మేర అప్పు తీసుకోవడంతో పాటు 7 ఎకరాల పొలంలో నాగన్న చెరుకు సేద్యం చేశాడు . తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటకు నీరందక ఎండిపోయింది...

Friday, October 23, 2015 - 21:09

మెదక్‌ : జిల్లాలోని జహీరాబాద్‌లో పోలీసులు స్పిరిట్‌ను పట్టుకున్నారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న 15 లక్షల విలువైన స్పిరిట్‌ను పోలీసులు.. బోచేలు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ స్పిరిట్‌ను మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Friday, October 23, 2015 - 12:44

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇళ్లు లేని పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇవ్వాని తెలంగాణ సర్కార్‌ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఐదేళ్లలో రెండు లక్షల మంది పేదలకు ఇళ్లు ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. హైదరాబాద్‌ ఐడీహెచ్‌ కాలనీలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద 400 మందికి మెరుగైన ఇళ్లను నిర్మించారు. ఇదేవిధంగా రాష్ట్రంలో ఈ ఏడాది చివరికల్లా 10 వేల ఇళ్లను నిర్మించాలని సర్కార్‌ నిర్ణయించింది. ...

Thursday, October 15, 2015 - 20:30

మెదక్ : గడీల బతుకమ్మ కాదు..బడుగుల బతుకమ్మ ఆడుదామని తెలంగాణ మహిళా, సాంస్కృతిక సంఘాల ఐక్య వేదిక చేపట్టిన యాత్ర మెదక్ లో ముగిసింది. ఈ కార్యక్రమానికి మహిళలు తరలివచ్చారు. మహిళా సంఘాల నేతృత్వంలో బతుకమ్మ ఆడారు. మహిళలు, చిన్నారులు సందడిగా ఆడి పాడారు. అత్యాచారాలు లేని సమాజాన్ని సాదిద్ధామని సంఘం నేతలు పేర్కొన్నారు. అక్టోబర్ 16 వికారాబాద్‌ రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 17 గద్వాల మహబూబ్‌...

Thursday, October 15, 2015 - 20:26

మెదక్ : జిల్లాలో డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కవితలు బతుకమ్మను ఆడారు. నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లిలో జరిగిన కార్యక్రమంలో వారు ఆడి పాడారు. బతుకమ్మల అలంకరణకు అవసరమైన పూలను పంచారు. ఎంపీ కవితతో పాటు డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ పూలతో బొడ్డెమ్మలను అలకరిస్తూ.. మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ...

Wednesday, October 14, 2015 - 17:20

మెదక్ : మంత్రి హరీష్ రావు జిల్లాకు వస్తున్నారంటే ముందుగా పోలీసులు ఆశా వర్కర్లపై దృష్టి సారిస్తున్నారు. ఆయన పర్యటనలో సమస్యలు చెప్పుకుంటున్నారని..నిరసనలు వ్యక్తం చేస్తున్నారని పోలీసులు ముందస్తుగా అరెస్టులకు తెరలేపుతున్నారు. తాజాగా నారాయణఖేడ్ లో హరీష్ రావు పర్యటన నేపథ్యంలో సుమారు 60 మంది ఆశా వర్కర్లను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. ఈ అరెస్టులపై ఆశా వర్కర్లు తీవ్ర అభ్యంతరం...

Monday, October 12, 2015 - 17:48

హైదరాబాద్ : గడీల బతుకమ్మ కాదు బడుగుల బతుకమ్మ ఆడుదామని తెలంగాణ మహిళా,సాంస్కృతిక సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ అంటున్న ఐక్య వేదిక నేతలు బతుకమ్మను కొందరు స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని దుయ్య బట్టారు. బడుగుల బతుకమ్మ ఆడాలనే నినాదంతో తెలంగాణ మహిళా, సాంస్కృతిక సంఘాల ఐక్య వేదిక బతుకమ్మ యాత్రను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని సుందరయ్య పార్క్ నుంచి...

Monday, October 12, 2015 - 12:20

మెదక్ : పాముకాటుతో తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఈ ఘటన అల్లాదుర్గం మండలం బిజిలిపూర్‌లో జరిగింది. రాత్రిసమయంలో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లను పాము కాటువేసింది. దీంతో వారిని జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి.. తల్లి వినోద, కూతురు అఖిల చనిపోయారు. సరిగ్గా ఏడాది క్రితం కుటుంబానికి పెద్ద దిక్కుఅయిన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు...

Saturday, October 10, 2015 - 18:49

మెదక్ : కట్నం వేధింపులకు ఓ మహిళ తన నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. పుల్కల్ మండలం మంతూరు గ్రామానికి చెందిన జ్యోతికి రెండేళ్ల క్రితం రాజుతో వివాహమైంది. పెళ్లి సమయంలో 15 లక్షల నగదు, ఒక బైకు కట్నంగా ఇచ్చుకున్నారు జ్యోతి తల్లిదండ్రులు. అయితే అదనపు కట్నం కోసం భర్త రాజు, అత్తమామలు ఆమెను అదనపు కట్నం కోసం రోజు తీవ్ర వేధింపులకు...

Saturday, October 10, 2015 - 16:35

మెదక్‌ : జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని కాంగ్రెస్ నేతలు అన్నారు. రైతులకు న్యాయం చేయాలని అడిగినందుకు తమ గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. రైతు సమస్యల్లో ఉన్నారని సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల్లో రూ. లక్ష రుణమాఫీ చేస్తామన్నారని ఆమె తెలిపారు. ఆ హామీ నెరవేర్చాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. రుణమాపీ ఏకకాలంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు...

Pages

Don't Miss