మెదక్
Thursday, November 26, 2015 - 20:52

మెదక్ : తెలంగాణా సాధించిన పార్టీగా టీఆర్‌ఎస్‌ను వరంగల్‌ ప్రజలు గెలిపించారని సీపీఎం తెలంగాణ రాష్ట్రా కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  అన్నారు. టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఉన్నా.. అది ఓడించే స్థాయిలో లేదని ఆయన అన్నారు. మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో ఈనెల 29,30న జరిగే సీపీఎం విస్త్రతస్థాయి సమావేశాలకు రాష్ట్రవ్యాప్తంగా 200 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తమ్మినేని ప్రకటించారు. 

Wednesday, November 25, 2015 - 16:37

మెదక్‌ : నర్సాపూర్‌ నియోజకవర్గంలో నకిలీ డాక్టర్లు అక్రమదందా మూడు పూవులు ఆరుకాయలుగా సాగుతోంది. గతంలో శిశు విక్రయాలు, గర్భసంచి తొలగింపు ఆపరేషన్లతో అమాయకుల జీవితాలతో ఆడుకుంటే, ఇప్పుడు తాజాగా అపెండిసైటిస్‌ ఆపరేషన్లతో నకిలీలు డబ్బులు కొల్లగొడుతున్నారు. కడుపు నొప్పి అంటూ రోగి ఆశ్రయిస్తే చాలు కత్తులు పట్టుకొని అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ చేసేసి వేలకు వేలు దండుకుంటున్నారు. ముఖ్యంగా అమాయక...

Sunday, November 15, 2015 - 21:29

మెదక్ : రాబోయే నాలుగు నెలల్లో తెలంగాణలో లక్ష ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్లు జారీచేస్తామని మంత్రి హరీష్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో ఏర్పాటైన పోలీస్‌ నియామక ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు పోలీస్‌ నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని అన్నారు. అనంతరం విద్యార్థులకు సిలబస్‌...

Sunday, November 15, 2015 - 16:29

మెదక్ : గజ్వేల్‌, సిద్ధిపేటను అభివృద్ధి చేస్తామంటున్న కేసీఆర్‌, హరీష్‌రావులు మాటాలకే పరిమితమవుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం కోసం పేదల భూములను లాక్కొంటున్నారని విమర్శించారు. తగిన నష్టపరిహారం ఇవ్వకుండానే భూములను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. 

Friday, November 13, 2015 - 15:56

మెదక్ : జిల్లాలో అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కోహిర్‌ మండలం చింతల్‌ఘాట్‌లో అనిత్‌ తన పొలంలో వేసిన పంట ఎండిపోవడం.. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ పెద్ద ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

 

Monday, November 9, 2015 - 13:25

హైదరాబాద్ : పంజాగుట్టలోని నిమ్స్ లో ఫిజియోథెరపి వైద్యుడు విజయ్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫిజియోథెరపిలో పీజీ పూర్తి చేసుకుని నిమ్స్ లో ఇంటర్న్ షిప్‌ చేస్తున్న విజయ్‌కుమార్.. ఆరో అంతస్తులోని గ్రిల్స్ కు ఉరేసుకున్నాడు. తోటి వైద్యుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. విజయ్‌కుమార్‌ పటాన్‌చెరు వాసిగా గుర్తించారు. ఇక విజయ్‌కుమార్‌ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని...

Monday, November 9, 2015 - 06:35

విశాఖపట్టణం : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారుతోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ వాయుగుండం మరింత బలపడుతోంది. పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ, తీవ్ర వాయుగుండంగా, ఆ తరువాత తుపానుగా మారనుంది. ఈ తుపానుకు రోవానుగా నామకరణం చేస్తూ ఐఎండీ అధికారికంగా ప్రకటించనుంది.

సోమవారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం..
రోవాను తుపాను సోమవారం అర్ధరాత్రికి...

Sunday, November 1, 2015 - 06:32

హైదరాబాద్ : హకీంపేటలో అర్ధరాత్రి పోలీసులు విరుచుకుపడ్డారు. డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్ నిర్వహించి తడాఖా చూపారు. 18 మంది రౌడీషీటర్లు, 17 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 48 బైక్‌లు, ఐదు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో 500 పోలీసులు పాల్గొన్నారు. మూడు బృందాలుగా ఏర్పడిన దాదాపు 500 మంది పోలీసులు కార్డన్‌సెర్చ్‌తో బెంబెలేత్తించారు.

...

Thursday, October 29, 2015 - 19:46

మెదక్: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్‌ జిల్లా న్యాల్‌కల్‌ మండలంలో చోటు చేసుకుంది. రాజోల గ్రామానికి చెందిన చెరుకు రైతు నాగన్న ప్రైవేటు ఫైనాన్షియర్ల వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకొని బలవన్మరణం పొందాడు. ప్రైవేటు ఫైనాన్స్‌ వద్ద 3 లక్షల మేర అప్పు తీసుకోవడంతో పాటు 7 ఎకరాల పొలంలో నాగన్న చెరుకు సేద్యం చేశాడు . తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటకు నీరందక ఎండిపోయింది...

Friday, October 23, 2015 - 21:09

మెదక్‌ : జిల్లాలోని జహీరాబాద్‌లో పోలీసులు స్పిరిట్‌ను పట్టుకున్నారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న 15 లక్షల విలువైన స్పిరిట్‌ను పోలీసులు.. బోచేలు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ స్పిరిట్‌ను మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Friday, October 23, 2015 - 12:44

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇళ్లు లేని పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇవ్వాని తెలంగాణ సర్కార్‌ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఐదేళ్లలో రెండు లక్షల మంది పేదలకు ఇళ్లు ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. హైదరాబాద్‌ ఐడీహెచ్‌ కాలనీలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద 400 మందికి మెరుగైన ఇళ్లను నిర్మించారు. ఇదేవిధంగా రాష్ట్రంలో ఈ ఏడాది చివరికల్లా 10 వేల ఇళ్లను నిర్మించాలని సర్కార్‌ నిర్ణయించింది. ...

Pages

Don't Miss