మెదక్
Sunday, September 20, 2015 - 17:36

హైదరాబాద్ : నగరంలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలువురు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం గమనార్హం. రైతుల ఆత్మహత్యలకు పాల్పడవద్దని పలువురు సూచిస్తున్నా అప్పులు తీర్చలేక..తీవ్ర వత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవలే ట్యాంక్ బండ్...

Saturday, September 19, 2015 - 12:41

మెదక్ : చదువులు చెప్పాల్సిన గురువులు యమకింకరులుగా మారుతున్నారు. క్రమశిక్షణ పేరుతో చిన్నారులను చితకబాదుతున్నారు. మెదక్‌ జిల్లాలో ఆగ్రహానికి గురైన టీచర్‌ ఓ చిన్నారిని త్రీవంగా చితకబాదింది. పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి యోక్షితశ్రీని హోంవర్క్‌ సరిగ్గా చేయలేదని టీచర్‌ కర్రతో చితకబాదింది. దెబ్బలకు తాళలేక చిన్నారికి తీవ్ర జ్వరం వచ్చింది....

Friday, September 18, 2015 - 14:41

హైదరాబాద్ : మెదక్‌ జిల్లాలో దారుణం జరిగింది. దొంగతనం కేసులో పదేళ్ల బాలుడికి సంకేళ్లు వేసి పోలీసులు హింసించారు. కోర్టు నుంచి సంకెళ్లతోనే ఆర్టీసీ బస్సులో బాలుడిని తరలించారు. అయితే పదేళ్ల బాలుడికి సంకెళ్లు వేసి తీసుకెళ్లడంపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Sunday, September 13, 2015 - 22:09

మెదక్ : తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు కారణం ఆంధ్రాపాలకులే అని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 60 ఏళ్ల ఆంధ్రా పాలనలో తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. 60 ఏళ్ల పాలనలో నీళ్ల గురించి ఆలోచన చేయలేదని... ఎపి గురించే ఆలోచన చేశారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి సాగునీరు ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు....

Saturday, September 12, 2015 - 15:13

మెదక్ : ఆశావర్కర్లపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్‌ లో హరీష్‌రావుకు వినతీపత్రం ఇచ్చేందుకు ఆశావర్కర్లు వెళ్లారు. తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు. ఐతే వారిపై హరీష్‌రావు కోపడ్డారు. 'ఎన్ని రోజులు సమ్మె చేసినా మాకు సంబంధం లేదు' అని స్పష్టం చేశారు. చివరకు వినతీ పత్రం తీసుకోకుండానే... మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

Friday, September 11, 2015 - 15:59

మెదక్ : జిల్లాలో దళితులను అవమానించిన ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎల్లారం దళితులకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఇదిలావుంటే ఎల్లారం గ్రామంలోని పెత్తందార్లను అరెస్ట్ చేయాలంటూ కెవీపీఎస్‌ తలపెట్టిన ఎస్పీ కార్యాలయం ముట్టడి తాత్కాలికంగా వాయిదా పడింది.

 

Friday, September 11, 2015 - 13:45

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టాన్ని స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో మరో మహిళ మృతి చెందింది. మెదక్‌ జిల్లాకు చెందిన మహిళ స్వైన్‌ఫ్లూతో మృతి చెందింది. గత నెల 26వ తేదీన కాన్సు కోసం గాంధీ ఆసుపత్రికి వచ్చింది. ఈ నెల 1వ తేదీన ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. కాన్సులో స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి నుండి ఆమెకు ప్రత్యేక వార్డులో...

Thursday, September 10, 2015 - 13:22

మెదక్ : పిడుగుపాటుకు రైతు మృతిచెందిన సంఘటన మెదక్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పుల్కల్‌ మండలం గొంగ్లూర్‌ తండాకు చెందిన శంకర్‌ అనే రైతు.. వర్షంలోనే పొలంలో పని చేస్తుండగా పిడుగుపడింది. దీంతో.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. శంకర్‌ మృతితో ఆ కుటుంబం అనాథగా మారిపోయిందని, ప్రభుత్వమే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Thursday, September 10, 2015 - 09:48

హైదరాబాద్ : కాలం కాటేస్తోంది.. వరుణుడు దోబుచులాడుతున్నాడు. కరువు ఉరుముతోంది. గద్దెనెక్కిన పాలకుల హామీలు.. నీటిరాతలవుతున్నాయి. వెరసి అన్నదాతలు.. ఆకలి కేకలు, అప్పుల బాధతో అలమటిస్తున్నారు. దారిలేక.. దిక్కుతోచక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా అన్నదాతల తలరాతలు మారడం లేదు.

అప్పుల ఊబిలో...

Sunday, September 6, 2015 - 13:10

మెదక్ : జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. పటన్ చెరులోని అమీన్ పూర్ లో హరితహారం కార్యక్రమంలో ఎంపీ పాటిల్ పాల్గొన్నారు. అనంతరం కారులో ఆయన నిజామాబాద్ కు వెళుతున్నారు. కల్హేరు మండలం బాజేపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ఎద్దును తప్పించబోయి కారు బోల్తా పడింది. దీనితో ఎంపీ పటేల్ కు స్వల్పగాయాలయ్యాయి. ఆయనతో పాటు ఉన్న అనుచరులకు కూడా గాయాలైనట్లు సమాచారం....

Saturday, September 5, 2015 - 18:47

మెదక్ : తెలంగాణ మంత్రి హరీష్‌రావు మెదక్‌ జిల్లా సిద్ధిపేటలోని పలు గ్రామాల్లో పర్యటించారు. సిద్ధిపేట, నారాయణరావుపేట, ఇబ్రహీంపూర్‌లో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం తెలంగాణ తల్లి, ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ విగ్రహాలను ఆవిష్కరించారు. ఆ తర్వాత గ్రామాల్లో ఇంకుడు గుంతలను పరిశీలించారు. సీఎం కేసీఆర్‌కు ముందుండి దారి చూపిన మహనీయుడు...

Pages

Don't Miss