మెదక్
Sunday, November 27, 2016 - 13:23

మెదక్ : తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 42వ రోజు కొనసాగుతోంది. ఈరోజు మెదక్‌ జిల్లాలోని గువ్వలపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. శంకరంపేట, కేవలకిసన్‌ సమాధి, చేగుంట, కర్నాల్‌పల్లి, మక్కరాజుపేట, గొల్లపల్లి, దౌల్తాబాద్‌లో కొనసాగనుంది. మహాజన పాదయాత్రలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు. 93 శాతం ఉన్న అణగారిన వర్గాల...

Sunday, November 27, 2016 - 13:18

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ రాజకీయ పార్టీలు, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జరిగే భారత్‌ బంద్‌కు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. బంద్‌ సందర్భంగా ధర్నాలు, రాస్తా రోకోలు, రైల్‌ రోకోలు చేయాలని నిర్ణయించాయి. హర్తాళ్‌ను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ ప్రజలు, నేతలు, కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నాయి. ఐదొందలు...

Sunday, November 27, 2016 - 09:40

మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మరోలేఖ సంధించారు. జిల్లాల విభజన తర్వాత మెదక్‌ జిల్లా పారిశ్రామికంగా వెనకబడిందన్నారు. జిల్లాలో ఉన్న ఒక షుగర్‌ ఫ్యాక్టరీని మూసివేసి కార్మికులను రోడ్డున పడేశారని ఆరోపించారు. వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా...

Saturday, November 26, 2016 - 18:42

మెదక్ : ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్‌ వైద్యం అందిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. రెండున్నరేళ్లు గడుస్తున్నా చేసిందేమీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. సీపీఎం మహాజన పాదయాత్ర 41వ రోజు మెదక్‌ జిల్లాలో కొనసాగుతోంది. ఈరోజు మంబోజిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించిన తమ్మినేని బృందం .. మెదక్‌ ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. రోగులకు అందుతున్న...

Saturday, November 26, 2016 - 18:37

మెదక్ : సంచారం చేస్తూ జీవిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని బుడగ జంగాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌ జిల్లా వెల్దూర్తి మండలం రామాయంపల్లిలో అనేకమంది బుడగ జంగాలు జీవనం కొనసాగిస్తున్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని సమస్యలను వీడియోలో చూద్దాం....

 

Saturday, November 26, 2016 - 16:39

సంగారెడ్డి : పెద్దనోట్ల రద్దు, చిన్ననోట్లు దొరక్క పద్దెనిమిది రోజులుగా ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. దీనికితోడు ఈరోజు నుంచి వరుసగా రెండు రోజులు బ్యాంకులకు సెలవులు. దీంతో ఈ విషయం తెలియక ఉదయం నుంచే జనాలు బ్యాంకులకు తరలి వస్తున్నారు. బ్యాంకులు మూసివేసి ఉండటంతో వచ్చిన ప్రజలు నిరాశకు గురవుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Saturday, November 26, 2016 - 16:05

మెదక్ : కమ్యునిస్టులకు ఆదర్శంగా నిలిచిన క్యూబా మాజీ అధ్యక్షుడు, మహోద్యమకారుడు క్యాస్ట్రో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఫిడెల్‌ క్యాస్ట్రో మృతికి సంతాపం తమ్మినేని ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిడెల్‌ క్యాస్ట్రో ఆశయాల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపిచ్చారు. అగ్ర రాజ్యం అమెరికాను అల్లాడించిన ఘనత క్యాస్ట్రోదని...

Saturday, November 26, 2016 - 09:36

గద్వాల : ఓ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. ఉండవల్లి పీఎస్ లో రఘుపతి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా దొంగలు హల్ చల్ చేస్తుండడంతో పోలీసులు గస్తీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఖాకీలు గస్తీలు నిర్వహిస్తున్నారు. ఆరుగురు దొంగలున్న సమాచారంతో అక్కడకు వెళ్లగా పరారీకి...

Saturday, November 26, 2016 - 08:41

మెదక్ : 40 రోజులు.. వెయ్యి కిలోమీటర్లు.. అదే జోష్‌.. అదే హుషారు.. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు అట్టడుగున ఉన్న సామాన్య ప్రజల బతుకుల్లో వెలుగులు నింపేందుకు.. వారికి అండగా నిలబడేందుకు చేస్తున్న సీపీఎం మహాజన పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రలో అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలకు తమ్మినేని బృందం ధన్యవాదాలు తెలిపింది. ఇదే ఉత్సాహంతో నాలుగు వేల కిలోమీటర్ల...

Saturday, November 26, 2016 - 06:30

హైదరాబాద్ : నారావారిపల్లె, ఎర్రవల్లి, నర్సన్నపేట ఈ మూడు గ్రామాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకత వుంది. చంద్రబాబు, కెసిఆర్ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకీ వెరీ స్పెషల్ గ్రామాలివి. మరి అలాంటి గ్రామాల్లో నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎంత? ఈ మూడు గ్రామాలను సందర్శించిన 10టీవీ ప్రతినిధులకు ఆసక్తికర అనుభవాలు ఎదురయ్యాయి.

నారావారిపల్లె..
ఇది నారావారిపల్లె....

Friday, November 25, 2016 - 19:29

మెదక్ : తెలంగాణ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం నినాదంగా సాగుతున్న సీపీఎం మహాజనపాదయాత్ర మెదక్ జిల్లా మంబోజిపల్లిలో 1000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా మంబోజిపల్లిలో 1000 కి.మీల శిలాఫలాకాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. పాదయాత్ర బృందం సభ్యులు నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. పాదయాత్రకు...

Pages

Don't Miss